AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugar Production: దేశంలో చక్కెర ఉత్పత్తిలో పెరుగుదల.. గణాంకాలు విడుదల చేసిన ఇండస్ట్రీ బాడీ ఐఎస్‌ఎంఏ

భారతదేశంలో చక్కెర వినియోగం ఎక్కువగానే ఉంటుంది. ప్రతి ఇంటిలో ఉపయోగిస్తారు. భారతదేశంలోని దాదాపు ప్రతి ఇంట్లో చక్కెర ఖచ్చితంగా ఉపయోగించబడుతుంది..

Sugar Production: దేశంలో చక్కెర ఉత్పత్తిలో పెరుగుదల.. గణాంకాలు విడుదల చేసిన ఇండస్ట్రీ బాడీ ఐఎస్‌ఎంఏ
Sugar Production
Subhash Goud
|

Updated on: Jan 04, 2023 | 7:00 AM

Share

భారతదేశంలో చక్కెర వినియోగం ఎక్కువగానే ఉంటుంది. ప్రతి ఇంటిలో ఉపయోగిస్తారు. భారతదేశంలోని దాదాపు ప్రతి ఇంట్లో చక్కెర ఖచ్చితంగా ఉపయోగించబడుతుంది. అదే సమయంలో కొత్త సంవత్సరంలో చక్కెరకు సంబంధించి ఓ శుభవార్త వచ్చింది. దేశంలో చక్కెర ఉత్పత్తి పెరిగింది. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దేశంలో చక్కెర ఉత్పత్తి 3.69 శాతం పెరిగి 120.7 లక్షల టన్నులకు చేరుకుందని ఇండస్ట్రీ బాడీ ఐఎస్‌ఎంఏ తెలిపింది.

ప్రపంచంలోని ప్రధాన చక్కెర ఉత్పత్తి దేశాలలో భారతదేశం ఒకటి. చక్కెర ఉత్పత్తి గత మార్కెటింగ్ సంవత్సరం ఇదే కాలంలో 116.4 లక్షల టన్నులు. చక్కెర మార్కెటింగ్ సంవత్సరం అక్టోబర్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ISMA) ప్రకారం.. ఈ కాలంలో 500 మిల్లుల నుండి 509 మిల్లులు క్రషింగ్ అయ్యాయి. 2022-23 మార్కెటింగ్ సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ కాలంలో ఉత్తరప్రదేశ్‌లో చక్కెర ఉత్పత్తి ఏడాది క్రితం 30.9 లక్షల టన్నుల స్థాయికి చేరుకోగా, మహారాష్ట్రలో అది 46.8 లక్షల టన్నులకు స్వల్పంగా పెరిగిందని ఐఎస్‌ఎంఏ ఒక ప్రకటన విడుదల చేసింది.

అదే సమయంలో కర్ణాటకలో చక్కెర ఉత్పత్తి అంతకుముందు 26.1 లక్షల టన్నులతో పోలిస్తే 26.7 లక్షల టన్నులకు కొద్దిగా పెరిగింది. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో చక్కెర ఉత్పత్తి గుజరాత్‌లో 3.8 లక్షల టన్నులు, తమిళనాడులో 2.6 లక్షల టన్నులు, ఇతర రాష్ట్రాల్లో 9.9 లక్షల టన్నులకు చేరుకుందని వెల్లడించింది. 2022-23 మార్కెటింగ్ సంవత్సరంలో 365 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తిని అంచనా వేసింది. ఇది 2021-22 మార్కెటింగ్ సంవత్సరంలో 358 లక్షల టన్నులతో పోలిస్తే రెండు శాతం పెరుగుదల ఉంది.

ఇవి కూడా చదవండి

అయితే ISMA 2022-23 మార్కెటింగ్ సంవత్సరంలో 365 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తిని అంచనా వేసింది. ఇది 2021-22 మార్కెటింగ్ సంవత్సరంలో 358 లక్షల టన్నులతో పోలిస్తే రెండు శాతం పెరుగుదలను చూపుతుంది. చక్కెర ఉత్పత్తి గణాంకాలు వచ్చిన తర్వాత జనవరిలో దేశీయ ఉత్పత్తిని అంచనా వేసిన తర్వాత ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరం 2022-23కి చక్కెర ఎగుమతి కోటాను ప్రభుత్వం పెంచవచ్చు. 2021-22 మార్కెటింగ్ సంవత్సరంలో భారతదేశం రికార్డు స్థాయిలో 111 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి