AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Post Payment Bank: పోస్ట్‌ ఆఫీస్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక నుంచి వాట్సాప్‌లో పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌ సేవలు

బ్యాంకుల మాదిరిగానే పోస్టాఫీసులు కూడా వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తోంది. పోస్టాఫీసులను మరింతగా బలోపేతం చేసేందుకు మోడీ సర్కార్‌ ప్రత్యేక సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. కస్టమర్లకు సులభమైన పద్దతుల్లో సర్వీస్‌ను అందిస్తోంది..

India Post Payment Bank: పోస్ట్‌ ఆఫీస్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక నుంచి వాట్సాప్‌లో పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌ సేవలు
Post Office
Subhash Goud
|

Updated on: Apr 01, 2023 | 10:27 AM

Share

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో ఖాతాలు ఉన్నవారికి శుభవార్త. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ప్రైవేట్ రంగ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌తో కలిసి వాట్సాప్ బ్యాంకింగ్ సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది. కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ సమాచారాన్ని అందించింది.

మొబైల్ ఫోన్లలో బ్యాంకింగ్ సేవలు:

పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌లో కస్టమర్‌లు ఇప్పుడు వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్ ద్వారా తమ మొబైల్ ఫోన్‌లలో సౌకర్యవంతంగా బ్యాంకింగ్ సేవలను పొందగలుగుతారు. ఈ కొత్త సిస్టమ్‌లో వాట్సాప్ మెసేజింగ్ సొల్యూషన్ ఎయిర్‌టెల్ ఐక్యూ ద్వారా వినియోగదారులకు డెలివరీ చేయబడుతుంది. ఇది IQ సేవగా పని చేస్తుంది అంటే క్లౌడ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్. ఇది బ్రాండ్‌లు తమ కస్టమర్‌లతో వాయిస్, ఎస్‌ఎంఎస్‌, వాట్సాప్‌ ఛానెల్‌ల ద్వారా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సీజీఎం అండ్‌ సీఎస్‌ఎంవో గురుశరణ్ రాయ్ బన్సాల్ మాట్లాడుతూ.. భారత్‌లో డిజిటల్, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌ను ప్రోత్సహించడానికి భారతీ ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం కావడానికి సంతోషిస్తున్నామని అన్నారు. డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగస్వామిగా దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను అందించడానికి ఐపీపీబీ చాలా కాలంగా అవిశ్రాంతంగా కృషి చేస్తోందన్నారు. వాట్సాప్‌లో వినియోగదారులకు బ్యాంకింగ్ పరిష్కారాలను అందించడానికి ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం కావడం మాకు ఆనందంగా ఉందన్నారు.

ఇవి కూడా చదవండి

ఎయిర్‌టెల్ ఏం చెబుతోంది

ఎయిర్‌టెల్ ఐక్యూ బిజినెస్ హెడ్ అభిషేక్ బిస్వాల్ మాట్లాడుతూ, సాంకేతికతతో నడిచే ఆర్థిక రంగంలో అపారమైన సంభావ్యత ఉందని, దేశంలోని మారుమూల ప్రాంతాలకు అత్యుత్తమ ఆర్థిక ఉత్పత్తులను తీసుకువెళ్లగలమని మేము విశ్వసిస్తున్నాము. ఎయిర్‌టెల్‌ ఐక్యూ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్‌లు బలమైన, సులభమైన, సురక్షిత క్లౌడ్ కమ్యూనికేషన్ సూట్ అందించబడుతోంది. వాట్సాప్ కోసం బిజినెస్ సర్వీస్ ప్రొవైడర్ (బిఎస్‌పి)గా వ్యవహరించే ప్రపంచంలోనే మొట్టమొదటి టెల్కో ఎయిర్‌టెల్. ఈ కొత్త ఏర్పాటు ప్రకారం.. వాట్సాప్ మెసేజింగ్ సొల్యూషన్ ఎయిర్‌టెల్ దీన్ని ఐక్యూ ద్వారా కస్టమర్లకు డెలివరీ చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి