Ola Electric: ఇండియన్ మార్కెట్‌ని షేక్ చేస్తున్న ఓలా.. ఒక్క నెలలో ఎన్ని వేల ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..

ఎలక్ట్రిక్‌ స్కూటర్ల అమ్మాకాల్లో ఓలా మరోసారి దుమ్ము రేపింది. భారతదేశంలో ఒక్క మార్చి నెలలోనే 27,000 స్కూటర్లను విక్రయించి సరికొత్త రికార్డును సృష్టించింది. తద్వారా వరుసగా ఏడో నెలలో కూడా టాప్‌ ప్లేస్‌ను కైవసం చేసుకొంది.

Ola Electric: ఇండియన్ మార్కెట్‌ని షేక్ చేస్తున్న ఓలా.. ఒక్క నెలలో ఎన్ని వేల ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..
Ola Electric
Follow us
Madhu

|

Updated on: Apr 01, 2023 | 6:52 PM

విద్యుత్‌ శ్రేణి వాహనాల్లో తనకు తిరుగులేదని ఓలా ఎలక్ట్రిక్‌ మరోసారి రుజువు చేసుకొంది. ఎలక్ట్రిక్‌ స్కూటర్ల అమ్మాకాల్లో మరోసారి దుమ్ము రేపింది. భారతదేశంలో ఒక్క మార్చి నెలలోనే 27,000 స్కూటర్లను విక్రయించి సరికొత్త రికార్డును సృష్టించింది. తద్వారా వరుసగా ఏడో నెలలో కూడా టాప్‌ ప్లేస్‌ను కంపెనీ కైవసం చేసుకొంది. మొత్తం 2022-23 ఆర్థిక సంవత్సరంలో జరిగిన స్కూటర్ల విక్రయాల్లో ఏకంగా 30 శాతం వాటాను ఆక్రమించి అగ్రస్థానంలో నిలిచింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఏడాదిలో రెండు లక్షల స్కూటర్ల విక్రయం..

విద్యుత్‌శ్రేణి వాహనాల్లో ఒక సెన్సేషన్‌ ఓలా. అత్యాధునిక సౌకర్యాలు, అధిక రేంజ్‌, క్యూట్‌ లుక్‌తో కూడిన ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇండియన్‌ మార్కెట్‌ ను దున్నేస్తున్నాయి. ఇదే విషయాన్ని తాజా గణాంకాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఈ సందర్భంగా కంపెనీ వ్యవస్థాపక సీఈఓ భవీస్ అగర్వాల్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో 2 లక్షలకుపైగా వాహనాలు అమ్మామని చెప్పారు. 2023 సంవత్సరం భారత ఎలక్ట్రానిక్ వాహన చరిత్రలో అద్భుతమైనదిగా ఆయన పేర్కన్నారు. రానున్న సంవత్సరాలలో కూడా ఉత్పత్తి, వేగం, ప్రమాణాల్లో ఎక్కడా రాజీపడకుండా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఈ రంగంలో వెనక్కి తిరగకుండా ముందంజలో ఉండాలని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు.

వినియోగదారులకు మెరుగైన సర్వీస్..

మరోవైపు ఆన్‍లైన్‍తో పాటు ఆఫ్‍లైన్‍ సేల్స్ మీద కూడా ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల దృష్టి సారించింది. అందుకే ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల సంఖ్యను క్రమంగా పెంచుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 400 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు ఉండగా.. ఇటీవల మరో 50 ఆఫ్‌లైన్‌ సెంటర్లను ప్రముఖ నగరాలలో ప్రారంభించింది. ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లలో స్కూటర్లను టెస్ట్ రైడ్ చేయటంతో పాటు కొనుగోలు చేయవచ్చు. స్కూటర్ డెలివరీలు కూడా వెంటనే చేసే వీలుంటుంది. ఈ సెంటర్లు తన 90 శాతం వినియోగదారులకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే కేంద్రీకృతమై ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

సరికొత్త మోడళ్లు..

ఓలా మోడళ్లను అప్‌ గ్రేడ్‌ చేయడంపై కొత్త సంవత్సరంలో దృష్టి పెట్టనుంది. ముఖ్యంగా ఎస్‌1 పోర్ట్‌ ఫోలియోలో ఇప్పటికే ఆరు వేరియంట్లను తీసుకొచ్చింది. 2kwh, 3kwh 4kwh సామర్థ్యంతో వీటిని అందుబాటులో ఉంచింది. అలాగే ఓలా ఎస్‌1 ఎయిర్‌ వేరియంట్లోని మూడు బైక్‌ ల డెలివరీలు కూడా ఈ ఏడాది జూలై నుంచి ప్రారంభించనుంది. అలాగే సిటీ పరిధిలోకి బాగా ఉపకరించే మరో ఎస్‌ 1 ఫ్యామిలీకి చెందిన 2kwh సామర్థ్యంతో స్కూటర్‌ ని లాంచ్‌ చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..