AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

E passport: త్వరలోనే కొత్త రూపు సంతరించుకోనున్న పాస్ పోర్ట్.. ఈసారి మరిన్ని సెక్యూరిటీ ఫీచర్స్ తో..

త్వరలోనే పాస్ పోర్ట్   కొత్త రూపం సంతరించుకోనుంది.  ఈసారి మరిన్ని అధునాతన సెక్యూరిటీ  ఫీచర్లతో ఇది  పౌరులకు అందుబాటులోకి  రానుంది.  ఇందులో భాగంగా ప్రస్తుతమున్న పుస్తకాల పాస్ పోర్ట్ ల

E passport: త్వరలోనే కొత్త రూపు సంతరించుకోనున్న పాస్ పోర్ట్.. ఈసారి మరిన్ని సెక్యూరిటీ ఫీచర్స్ తో..
Passport
Basha Shek
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 17, 2022 | 6:46 AM

Share

త్వరలోనే పాస్ పోర్ట్  కొత్త రూపం సంతరించుకోనుంది.  ఈసారి మరిన్ని అధునాతన సెక్యూరిటీ  ఫీచర్లతో ఇది  పౌరులకు అందుబాటులోకి  రానుంది.  ఇందులో భాగంగా ప్రస్తుతమున్న పుస్తకాల పాస్ పోర్ట్ ల స్థానంలో అతి త్వరలోనే  ఈ- పాస్‌ పోర్ట్‌లను  జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.  ఈ మేరకు త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని  ప్రవేశపెట్టనున్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్‌ భట్టాచార్య   వెల్లడించారు . ఈ పాస్‌ పోర్ట్‌ బయోమెట్రిక్‌ డేటాతో మరింత సురక్షితంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా అంతర్జాతీయంగా ఇమిగ్రేషన్‌ చెక్‌ పోస్ట్‌ల వద్ద చెకింగ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసుకునేందుకు వీలవుతుందని తెలిపారు.

టీసీఎస్ సంస్థ సాంకేతిక సహకారంతో..

కాగా ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పటికే  ఈ-పాస్‌పోర్ట్ సేవలను అమలు చేస్తున్నాయి. మరికొన్ని దేశాలు కూడా ఇదే బాటలో నడవనున్నాయి. అందులో భారతదేశం కూడా ఒకటి.   అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) నిబంధనలకు అనుగుణంగా నాసిక్‌లోని ‘ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌’  ఈపాస్ పోర్టులను తయారుచేస్తోంది.   టాటాకు చెందిన ప్రముఖ కంపెనీ టీసీఎస్‌ ఈ- పాస్ పోర్ట్ తయారీకి కావాల్సిన సాంకేతిక  సహకారం అందించనుంది.  ఇందులో అమర్చిన మైక్రో చిప్ లో ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు ఎన్ కోడ్ చేస్తారు. ఫలితంగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ సాయంతో ఇందులోని వ్యక్తిగత డేటాను బదిలీ చేసుకోవడానికి బదిలీ చేయడానికి ఏ మాత్రం ఆస్కారం ఉండదు. ఒకవేళ  ఈ మైక్రో చిప్ ను ట్యాంపర్ చేయడానికి ప్రయత్నించినా సులభంగా గుర్తించవచ్చు. కాగా ఇంతకు ముందే    పౌరులకు   మైక్రో చిప్ తో   కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లను జారీచేయనున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే . త్వరలోనే ఈ పాస్ పోర్టుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

Also Read: ఈ మేకకు చికెన్ బిర్యానీ, మ‌ట‌న్ లేకుంటే ముద్ద దిగ‌దు.. వీడియో

తన ముగ్గులతో కుర్రకారుని ముగ్గులోకి దింపుతున్న లావణ్య

వైట్ అండ్ వైట్ లో అదరగొట్టిన నాగ చైతన్య లేటెస్ట్ ఫొటోస్ వైరల్