Renewable Energy: పెరుగుతున్న ఇంధన పునరుత్పాదక శక్తి.. ఏడాదిలో ఏకంగా 14.2 శాతం వృద్ధి

భారతదేశ పునరుత్పాదక ఇంధన రంగం గణనీయమైన వృద్ధిని సాధించిందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. నవంబర్ 2023 నుంచి నవంబర్ 2024 వరకు మొత్తం పునరుత్పాదక శక్తి సామర్థ్యంలో 14.2 శాతం పెరుగుదల నమోదు అయ్యింది.

Renewable Energy: పెరుగుతున్న ఇంధన పునరుత్పాదక శక్తి.. ఏడాదిలో ఏకంగా 14.2 శాతం వృద్ధి
Renewable Energy
Follow us
Srinu

|

Updated on: Dec 12, 2024 | 2:26 PM

భారతదేశంలో శిలాజ రహితం ఇంధన స్థాపిత సామర్థ్యం గత ఏడాది 187.05 జీడబ్ల్యూ నుంచి ఇప్పుడు 213.70 జీడబ్ల్యూకు చేరుకుంది. అదనంగా పైప్‌లైన్ ప్రాజెక్టులతో సహా మొత్తం సామర్థ్యం 472.90 జీడబ్ల్యూకి పెరిగింది. ఇది గత సంవత్సరం 368.15 జీడబ్ల్యూ నుంచి 28.5 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఈ పరిణామాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన ‘పంచామృతం’ లక్ష్యాల ప్రకారం స్వచ్ఛ ఇంధన లక్ష్యాలను సాధించడంలో భారతదేశంలో ఇందన వృద్ధిని పెరుగుతుంది. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో,  నవంబర్ 2024 నాటికి 14.94 జీడబ్ల్యూ కొత్త పునరుత్పాదక ఇంధన సామర్థ్యం నమోదైంది. గత సంవత్సరంలో ఇదే కాలంలో జోడించిన 7.54 జీడబ్ల్యూ కంటే దాదాపు రెట్టింపుగా ఉంది. 

భారతదేశ పునరుత్పాదక ఇంధన వృద్ధిలో సౌరశక్తి అగ్రగామిగా కొనసాగుతోంది. సౌర సామర్థ్యం 30.2 శాతం పెరిగింది. 2023లో 72.31 జీడబ్ల్యూ నుంచి 2024లో 94.17 జీడబ్ల్యూకి పెరిగింది. పైప్‌లైన్ ప్రాజెక్టులను పరిశీలిస్తే మొత్తం సౌర సామర్థ్యం 52.7 శాతం పెరిగింది. 2024లో 261.15 జీడబ్ల్యూకి చేరుకుంది. భారతదేశంలో పునరుత్పాదక ఇంధన పురోగతికి పవన శక్తి కూడా గణనీయంగా దోహదపడింది. పవన ఇంధన సామర్థ్యం 7.6 శాతం పెరిగింది. 2023లో 44.56 జీడబ్ల్యూ నుంచి 2024లో 47.96 జీడబ్ల్యూకి పెరిగింది. పైప్‌లైన్ ప్రాజెక్ట్‌లను కలుపుకుంటే మొత్తం పవన సామర్థ్యం 17.4 శాతం పెరిగింది. 63.41 జీడబ్ల్యూ నుంచి 74.44 జీడబ్ల్యూకి పెరిగింది.

బయోఎనర్జీ, జలవిద్యుత్ శక్తి, అణుశక్తి వంటి ఇతర పునరుత్పాదక ఇంధన రంగాలు కూడా స్థిరమైన సహకారాన్ని అందించాయి. బయోఎనర్జీ సామర్థ్యం 4.6 శాతం పెరిగింది. 2023లో 10.84 జీడబ్ల్యూ నుంచి 2024లో 11.34 జీడబ్ల్యూకి పెరిగింది. చిన్న హైడ్రో ప్రాజెక్ట్‌లు 4.99 జీడబ్ల్యూ నుంచి 5.08 జీడబ్ల్యూకి  స్వల్పంగా పెరిగాయి. పైప్‌లైన్ ప్రాజెక్టులతో సహా మొత్తం సామర్థ్యం 5.54 జీడబ్ల్యూకి చేరుకుంది. స్థాపిత సామర్థ్యం 46.88 జీడబ్ల్యూ నుంచి 46.97 జీడబ్ల్యూకి పెరగడంతో పెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టులు స్వల్పంగా పెరిగాయి. పైప్‌లైన్ ప్రాజెక్టులతో సహా మొత్తం జలవిద్యుత్ సామర్థ్యం 64.85 జీడబ్ల్యూ నుంచి 67.02 జీడబ్ల్యూకి పెరిగింది. అణుశక్తి రంగంలో భారతదేశ స్థాపిత అణు సామర్థ్యం 9.4 శాతం పెరిగింది. 2023లో 7.48 జీడబ్ల్యూ నుంచి 2024లో 8.18 జీడబ్ల్యూకి పెరిగింది. అయితే పైప్‌లైన్ ప్రాజెక్టులతో సహా మొత్తం అణు సామర్థ్యం 22.48 జీడబ్ల్యూ వద్ద స్థిరంగా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి