AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Jewellery: బంగారు అభరణాలకు ఎలాంటి పత్రాలు లేకుంటే ఏమవుతుంది? ఇబ్బందులు ఏమిటి?

Gold Jewellery: నమోదుకాని ఆస్తి 60 శాతం పన్ను చెల్లించాలి. దీనికి అదనంగా 25 శాతం సర్‌ఛార్జ్, 4 శాతం సెస్ విధిస్తారు. పన్నుపై 10 శాతం జరిమానా కూడా విధిస్తారు. ఆ ఆస్తి పూర్తి విలువను పన్ను రూపంలో చెల్లించాలి..

Gold Jewellery: బంగారు అభరణాలకు ఎలాంటి పత్రాలు లేకుంటే ఏమవుతుంది? ఇబ్బందులు ఏమిటి?
Subhash Goud
|

Updated on: Oct 22, 2025 | 3:37 PM

Share

Gold Jewellery: మీ దగ్గర లెక్కల్లో చూపని బంగారు ఆభరణాలు ఉంటే మీరు చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. వారసత్వంగా వచ్చిన ఆభరణాలతో సహా లెక్కల్లో చూపని బంగారు ఆభరణాలను ఉంచుకోవడానికి చట్టం పరిమితిని విధించింది. ఆ పరిమితి కంటే ఎక్కువ ఉంటే దానిని అక్రమ ఆస్తిగా పరిగణిస్తారు. బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత కోట్ల విలువైన ఆభరణాలను విజయవంతంగా కాపాడాడు.

నవంబర్ 14, 2019న బెంగళూరులోని ఈ వ్యక్తి నివాసంపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ విభాగం) దాడి చేసి సోదాలు చేసింది. ఈ సమయంలో 2.487 కిలోల బంగారం, 3 కిలోల వెండి ఆభరణాలు లభించాయి. అప్పుడు వీటి విలువ రూ. 1.75 కోట్లుగా అంచనా వేశారు. వీటిలో పత్రాలు లేని ఆభరణాల విలువ రూ. 1.65 కోట్లు. వీటిని ఆదాయపు పన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: Post office: పోస్టల్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆ సేవలు 24 x 7 అందుబాటులో..

ఇవి కూడా చదవండి

బెంగళూరుకు చెందిన ఈ వ్యక్తి తన వద్ద ఉన్న అన్ని చెల్లింపు పత్రాలను చూపించాడు. ఆన్‌లైన్ చెల్లింపులు చేసినట్లు రుజువు మొదలైనవి సరిపోలేదు. అతని ఆదాయపు పన్ను రిటర్న్‌లో కూడా ఈ ఆస్తుల గురించి ప్రస్తావించలేదు. ఆ రూ.1.65 కోట్ల విలువైన ఆభరణాలపై ‘పన్ను’ చెల్లించాలని ఆ శాఖ తెలిపింది. దీనికి అంగీకరించకుండా, ఆ వ్యక్తి అప్పిలేట్ కమిషనర్ (CIT A) వద్దకు వెళ్లాడు. అక్కడ అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే, ఆదాయపు పన్ను శాఖ బెంగళూరు డివిజన్‌లోని ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT)ను ఆశ్రయించింది. ఇక్కడ కూడా ఆ వ్యక్తికి అనుకూలంగా తీర్పు రావడం గమనార్హం.

ఇది కూడా చదవండి: BSNL Diwali Offer: కేవలం 1 రూపాయికే రోజుకు 2GB డేటా.. 30 రోజుల చెల్లుబాటు!

ఈ వ్యక్తి కేసును ఎలా గెలిచాడు?

ఆదాయపు పన్ను శాఖ ఆ ఇంటిపై దాడి చేసి ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. ఈ సమయంలో అధికారి ఆ వ్యక్తి భార్య వాంగ్మూలం తీసుకున్నారు. ఆ ఆభరణాలు ఆమెవేనని ఆమె వివరణను అధికారి అంగీకరించారు. అయితే, భర్త వివరణను అంగీకరించలేదు. అది అక్రమ ఆస్తి అని చెప్పడంతో Abusive Tax Avoidance Transactions (ATAT)లో ఆదాయపు పన్ను శాఖకు ఎదురుదెబ్బ తగిలింది. ఒక అధికారి చేసిన తప్పు అతని భార్య సహాయంతో బెంగళూరు నివాసి కోట్ల రూపాయలు ఆదా చేయగలిగాడు.

పత్రాలు లేకుండా నగలు ఉంటే ఎంత పన్ను చెల్లించాలి?

నమోదుకాని ఆస్తి 60 శాతం పన్ను చెల్లించాలి. దీనికి అదనంగా 25 శాతం సర్‌ఛార్జ్, 4 శాతం సెస్ విధిస్తారు. పన్నుపై 10 శాతం జరిమానా కూడా విధిస్తారు. ఆ ఆస్తి పూర్తి విలువను పన్ను రూపంలో చెల్లించాలి. అంటే, ఆస్తిని కొత్తగా కొనుగోలు చేసినట్లుగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 29 వరకు పాఠశాలలు బంద్‌.. కారణం ఏంటంటే..

ఇది కూడా చదవండి: BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌లో 5 చౌకైన రీఛార్జ్ ప్లాన్లు.. తక్కువ ధరల్లో ఎక్కువ వ్యాలిడిటీ!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి