AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rates: ఈ దేశాల్లో బంగారం ధర చాలా తక్కువ!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మనదేశంలో అయితే పది గ్రాములు 24 క్యారట్ బంగారం ధర సుమారు రూ. 1,32,850 చేరుకుంది. అయితే బంగారం ధర తక్కువగా ఉన్నదేశాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? మనదేశం కంటే తక్కువ ధరకు బంగారం ఏయే దేశాల్లో లభిస్తుందంటే..

Gold Rates: ఈ దేశాల్లో బంగారం ధర చాలా తక్కువ!
Gold Rates
Nikhil
|

Updated on: Oct 22, 2025 | 4:01 PM

Share

బంగారం ధర దేశాన్ని బట్టి మారుతుందని మనకు తెలుసు. అమెరికాతో వాణిజ్య సంబంధాలు, గోల్డ్ రిజర్వ్స్ ను బట్టి ఒక్కో దేశంలో ఒక్కోరకంగా బంగారం ధరలు ఉంటాయి. ముఖ్యంగా కొన్ని దేశాలు ఆర్థికంగా మనకంటే వెనుక ఉన్నా బంగారం ధరలు మాత్రం అక్కడ తక్కువగా ఉన్నాయి. అలాంటి దేశాల వివరాలు ఇప్పుడు చూద్దాం.

హాంగ్‌కాంగ్

హాంగ్‌కాంగ్ లో ఓపెన్ ఎకానమీ ఉంటుంది. ఇక్కడ దిగుమతి సుంకాలు చాలా తక్కువ. అందుకే ఇక్కడ బంగారం ధరలు అత్యంత తక్కువగా ఉంటాయి ఇక్కడ బంగారం ధర10 గ్రాములకు రూ. 1,13,140 ఉంది.

దుబాయ్

దుబాయ్ దేశపు కరెన్సీ మన కరెన్సీ కంటే విలువైనది కాబట్టి ఇక్కడ 24 క్యారెట్ల తులం బంగారం ధర సుమారు రూ. 1,14,740 ఉంది.  దుబాయ్ ను సిటీ ఆఫ్ గోల్డ్‌ అని పిలుస్తారు. ఇక్కడ టాక్స్, ఇంపోర్ట్ డ్యూటీస్ తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ బంగారం ధరలు అంతగా పెరగలేదు.

అమెరికా

అమెరికాలో 24 క్యారట్ల తులం బంగారం ధర సుమారు రూ. 1,15,360 ఉంది. ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్న దేశం అమెరికానే కాబట్టి ఇక్కడ బంగారం ధరలు అమాంతం పెరగవు.  పైగా ప్రపంచవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు డాలర్లలో జరుగుతాయి. కాబట్టి అమెరికాలో బంగారం ధరలు మన దగ్గర పెరిగినంతగా పెరగవు.

సింగపూర్

సింగపూర్ లో రకరకాల పన్ను మినహాయింపులు, పన్ను రాయితీలు ఉంటాయి. అందుకే ఇక్కడ చాలా మంది బంగారంలో పెట్టుబడి పెడతారు. అందుకే ఈ దేశంలో బంగారం ధరలు ఎక్కువగా పెరగవు. ప్రస్తుతం సింగపూర్ లో 24 క్యారెట్ల తులం బంగారం ధర సుమారు రూ. 1,18,880 ఉంది.

కువైట్

కువైట్ దేశంలో కూడా తక్కువ పన్నులు ఉంటాయి. ఇక్కడ బంగారంలో పెట్టుబడి పెట్టేవాళ్లు ఎక్కువ ఉంటారు. అందుకే ఇక్కడ 24 క్యారెట్ల తులం బంగారం ధర సుమారు 1,13,570 ఉంది.

టర్కీ

టర్కీలో కూడా ఇండియాలో లాగానే బంగారాన్ని ఒక సంపదగా భావిస్తారు. ఇక్కడివాళ్లు బంగారంలో ఎక్కువ పెట్టుబడులు పెడతారు. అందుకే టర్కీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర సుమారు రూ. 1,13,040ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?