AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Jannivesh Mutual Fund: నెలకు రూ.250 పెట్టుబడితో లక్షల్లో రాబడి.. ఆ ఎస్‌బీఐ స్కీమ్‌ గురించి తెలుసా?

భారతదేశంలో ఇటీవల కాలంలో పెట్టుబడిదారుల ఆలోచనా విధానాలు మారాయి. స్థిర ఆదాయ పథకాల కంటే రిస్క్‌ ఎక్కువైనా పర్లేదని మ్యూచువల్‌ ఫండ్స్‌ వంటి మార్కెట్‌ రిస్క్‌ ఉన్న పథకాల్లో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ ఓ కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ను ప్రకటించింది. ఎస్‌బీఐ జననివేష్‌ పేరుతో ప్రకటించిన ఈ ఫండ్‌లో నెలకు రూ.250 స్వల్ప పెట్టుబడితో లక్షల్లో రాబడి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

SBI Jannivesh Mutual Fund: నెలకు రూ.250 పెట్టుబడితో లక్షల్లో రాబడి.. ఆ ఎస్‌బీఐ స్కీమ్‌ గురించి తెలుసా?
Sbi Money
Nikhil
|

Updated on: Feb 26, 2025 | 7:04 PM

Share

ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఇటీవల జననివేష ఎస్‌ఐపీను ప్రారంభించింది, ఈ ఎస్‌ఐపీల్లో కేవలం నెలకు రూ.250 పెట్టుబడితో పెట్టుబడి ప్రయాణం ప్రారంభించవచ్చు. గ్రామీణ, సెమీ-అర్బన్, పట్టణ ప్రాంతాల నుంచి చిన్న మొత్తాలతో పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఈ స్కీమ్‌ను లాంచ్‌ చేశారని నిపుణులు చెబుతున్నారు. ఎస్‌ఐపీలో ముఖ్యమైన విషయం స్థిరత్వం. మీ పెట్టుబడి మొత్తం చిన్నదా కాదా అనేది పట్టింపు లేదు, కానీ మీరు పెట్టుబడి పెడుతూనే ఉన్నంత వరకు మీ కార్పస్ పెరుగుతుంది. అలాగే భవిష్యత్‌లో అనేక రెట్లు రాబడిని ఇవ్వగలదు. కాబట్టి పెట్టుబడిదారులు జననివేష్ కింద నెస్‌బీఐ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది హైబ్రిడ్ డైనమిక్ ఆస్తి కేటాయింపు పథకంగా ఉంది. రిస్క్‌ను నిర్వహిస్తూనే రాబడిని ఆప్టిమైజ్ చేయడానికి ఈక్విటీ, డెట్ రెండింటిలోనూ పెట్టుబడి పెడుతుంది. 

ప్యూర్ ఈక్విటీ లేదా డెట్ ఫండ్ల మాదిరిగా కాకుండా బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ మార్కెట్ తిరోగమనాల సమయంలో స్థిరత్వాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎస్‌బీఐ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్‌లో జననివేష్ కింద ఎస్‌ఐఈపీ ద్వారా ప్రతి నెలా రూ. 250 స్థిరంగా మరియు శ్రద్ధగా పెట్టుబడి పెడితే మీ కార్పస్ 40 సంవత్సరాల తర్వాత సంవత్సరానికి 12 శాతం రాబడితో సుమారు రూ. 29,70,605 లక్షలు అవుతుంది. తద్వారా మొత్తం రూ.1,20,000 పెట్టుబడితో 40 సంవత్సరాలలో రూ.28,50,605 లాభం వస్తుంది. ఎస్‌బీఐ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ మొత్తం ఏయూఎం జనవరి 31, 2025 నాటికి రూ. 33305.48 కోట్లుగా ఉంటే ప్రస్తుత ఎన్‌ఏవీ రూ. 14.40గా ఉంది. 

ఇవి కూడా చదవండి

పెట్టుబడి ఇలా

  • వినియోగదారులు ఎస్‌బీఐ యోనో ప్లాట్‌ఫామ్, పేటీఎం, గ్రో, జిరోదా వంటి ఇతర ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లలో మ్యూచువల్ ఫండ్‌ను తెరవవచ్చు.
  • పేటీఎంలో జన్‌నివేష్‌ ఎస్‌ఐపీలో పెట్టుబడి పెట్టాలంటే మీ పేటీఎం యాప్ తెరవాలి.
  • జననివేష్‌ ఎస్‌ఐపీ @250 ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. 
  • మీరు మొత్తాన్ని ఎంచుకోవచ్చు (రోజువారీ, వారపు, నెలవారీ) ఎంపికను ఎంటర్‌ చేయాలి
  • మీరు పాన్ నంబర్‌ను నమోదు చేయాలి. కేవైసీ, ఎస్‌ఐపీ సెట్‌ను పూర్తి చేయాలి.
  • పేటీఎం ఆటోమేటిక్ ప్రాతిపదికన చెల్లింపును ప్రతి నెలా చేసుకోవచ్చు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి