Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personal Finance: మీ పిల్లలకు 18 ఏళ్లు నిండాయా? అయితే ఈ పనులు వెంటనే చేయండి.. లేకుంటే ఇబ్బందులు పడతారు..

అప్పటి వరకూ మీరు జాయింట్ ఉన్న వాటికి వారు సోల్ ఓనర్ షిప్ పొందుతారు. అయితే అందుకోసం తల్లిదండ్రులు కొన్ని పనులు చేయాలి. మైనర్ టు మేజర్ అయిన పిల్లల అకౌంట్లను అప్ గ్రేడ్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ జాయింట్ తొలగించి, పిల్లల పేరు మీదకు మారాలి. అలాగే పాన్ కార్డు, ఆధార్ కార్డులను అప్ గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఓ క్రమ పద్ధతిలో చేయాలి.

Personal Finance: మీ పిల్లలకు 18 ఏళ్లు నిండాయా? అయితే ఈ పనులు వెంటనే చేయండి.. లేకుంటే ఇబ్బందులు పడతారు..
banking
Follow us
Madhu

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2023 | 7:56 PM

సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల పేరుమీద ఏం చేసినా జాయింట్ గా చేస్తారు. అంటే పిల్లల పేరు మీద తీసుకొనే బ్యాంక్ అకౌంట్లు, వారి పేరు మీద కొనే ఆస్తులు వంటి పేరంట్స్ జాయింట్ ఓనర్ షిప్ కలిగి ఉంటారు. అయితే పిల్లల వయసు 18ఏళ్లు నిండిపోతే వారు మేజర్లు అవుతారు. వారికి ఓటు హక్కు కూడా వస్తుంది. అలాగే అప్పటి వరకూ మీరు జాయింట్ ఉన్న వాటికి వారు సోల్ ఓనర్ షిప్ పొందుతారు. అయితే అందుకోసం తల్లిదండ్రులు కొన్ని పనులు చేయాలి. మైనర్ టు మేజర్ అయిన పిల్లల అకౌంట్లను అప్ గ్రేడ్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ జాయింట్ తొలగించి, పిల్లల పేరు మీదకు మారాలి. అలాగే పాన్ కార్డు, ఆధార్ కార్డులను అప్ గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఓ క్రమ పద్ధతిలో చేయాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

పాన్ కార్డ్.. మీ పిల్లల పేరు మీద పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం మొదటి, ప్రధానమైన అంశం. ఇప్పటికే పాన్ కార్డు ఉంటే, మీరు ఆమె/అతని తాజా ఫోటోతో కార్డును రీఇష్యూ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు దాన్ని పొందిన తర్వాత, దాన్ని మీ పిల్లల ఆధార్ కార్డ్‌కి దానిని లింక్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆధార్ కార్డ్ చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్‌కి అనుసంధానమై ఉందని మీరు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అదే నంబరు బ్యాంకులో కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

బ్యాంక్ ఖాతా.. మీ చేతిలో అప్ డేటెట్ పాన్ కార్డ్ ఉన్న తర్వాత, వ్యక్తిగత ధ్రువీకరణ కోసం మీ పిల్లలతో పాటు బ్యాంక్‌ని సందర్శించండి. బ్యాంక్ కొత్త వివరాలతో బ్యాంక్ ఖాతాను అప్‌గ్రేడ్ చేస్తుంది. మీ పిల్లల నమూనా సంతకాలను తీసుకుంటుంది. కొత్త చెక్ బుక్. డెబిట్ కార్డ్‌ను కూడా జారీ చేస్తుంది. మీ పిల్లల బ్యాంక్ ఖాతాను ఇప్పుడు ఏదైనా ఆర్థిక ఆస్తిని యాక్సెస్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్‌ల కోసం ఈ ప్రక్రియ ఒకే విధంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఎంఎఫ్/ పీపీఎఫ్‌లకు కేవైసీ.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌లను మైనర్ పేరు మీద చేయవచ్చు కానీ పిల్లలు పెద్దవారైన తర్వాత, వారిపై తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు నియంత్రణ ఉండదు. వీటిని సాధారణ వ్యక్తిగత యూనిట్‌హోల్డింగ్‌లుగా మార్చడానికి, కేవైసీ వివరాలు అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ వివరాలు, ఫోటో, ఐడీ చిరునామా రుజువును సమర్పించాల్సి ఉంటుంది. కేవైసీ పూర్తయిన తర్వాత, కొత్త బ్యాంక్ ఖాతాతో క్యాన్సిల్ చేసి చెక్‌తో పాటు మైనర్ నుంచి మేజర్‌గా మార్చడానికి అభ్యర్థనను సమర్పించాలి.

అలాగే పీపీఎఫ్ ఖాతాను మార్చే ప్రక్రియ కూడా ఇలానే ఉంటుంది. 18 ఏళ్ల వయస్సులో ఉన్న మీ పిల్లలకు పీపీఎఫ్ ఖాతాను పొడిగించే లేదా మెచ్యూరిటీ రాబడిని ఉపసంహరించుకునే అవకాశం ఉంది.

సుకన్య సమృద్ధి యోజన.. మీరు మీ కుమార్తె 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సులో ఉన్నప్పుడు ఆమె కోసం సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరిచి ఉండవచ్చు. ఇప్పుడు ఆమెకు 18 ఏళ్లు నిండినందున, మీరు దానితో ఆమె ఆధార్, పాన్‌ను లింక్ చేయాలి. ఓ ఫారమ్ ద్వారా ఆమె మెజారిటీ సాధించినట్లు బ్యాంక్/పోస్టాఫీసుకు తెలియజేయాలి. అమ్మాయికి 18 ఏళ్లు నిండినప్పుడు, ఆమె ఖాతాను నియంత్రించి, స్వయంగా డిపాజిట్లు చేసే అవకాశం ఉంటుంది. అలాగే సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.

కొత్త డీమ్యాట్ ఖాతా.. మీరు ట్రేడింగ్ సెక్యూరిటీల కోసం మీ పిల్లల పేరుతో డీమ్యాట్ ఖాతాను తెరిచి ఉంటే, అది ఇప్పుడు డీ యాక్టివేట్ అవుతుంది. ఆమె తాజాగా డీమ్యాట్ ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ఖాతా హోల్డర్ తప్పనిసరిగా వారి ఖాతాలోని బ్యాలెన్స్‌ని నిర్ధారించాలి . డీయాక్టివేట్ చేయబడిన ఖాతాలో ఉన్న షేర్‌లు కొత్త ఖాతాకు బదిలీ చేయబడతాయి. బిడ్డకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఖాతాను ఆపరేట్ చేయాలి. మీ చిన్నారి డిపాజిటరీ పార్టిసిపెంట్‌తో కొత్త ఒప్పందంపై సంతకం చేయాలి. కొత్త బ్యాంక్ ఖాతాను ట్రేడింగ్ ఖాతాకు లింక్ చేయాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మాస్టర్ బ్లాస్టర్ స్టైల్‌లో కమిన్స్ అప్పర్-కట్
మాస్టర్ బ్లాస్టర్ స్టైల్‌లో కమిన్స్ అప్పర్-కట్
బంగారాన్ని ఎక్కువ కాలం వాడకపోతే తుప్పు పడుతుందా?
బంగారాన్ని ఎక్కువ కాలం వాడకపోతే తుప్పు పడుతుందా?
కాలేజ్‌ క్యాంపస్‌లో తిరుగుతున్న భారీ మొసలి వీడియో వైరల్
కాలేజ్‌ క్యాంపస్‌లో తిరుగుతున్న భారీ మొసలి వీడియో వైరల్
ఇదేం చేస్తుందిలే అని చీప్‌గా చూసేరు.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం..
ఇదేం చేస్తుందిలే అని చీప్‌గా చూసేరు.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం..
ఆరుగురు హీరోయిన్స్ తర్వాత విజయ్ సినిమాలో ఆమె ఫిక్స్ అయ్యిందా..?
ఆరుగురు హీరోయిన్స్ తర్వాత విజయ్ సినిమాలో ఆమె ఫిక్స్ అయ్యిందా..?
మీ మతిమరుపునకు అసలు కారణం తెలిస్తే.. వీడియో
మీ మతిమరుపునకు అసలు కారణం తెలిస్తే.. వీడియో
సంగారెడ్డిలో ఘోరం..ముగ్గురు పిల్లల‌కు విష‌మిచ్చి తానూ తాగిన తల్లి
సంగారెడ్డిలో ఘోరం..ముగ్గురు పిల్లల‌కు విష‌మిచ్చి తానూ తాగిన తల్లి
ఈ పండు తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. వీడియో
ఈ పండు తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. వీడియో
అమెరికా వెళ్లాలనుకునే విద్యార్ధులకు షాక్‌.. ట్రంప్ ఏం చేశారంటే?
అమెరికా వెళ్లాలనుకునే విద్యార్ధులకు షాక్‌.. ట్రంప్ ఏం చేశారంటే?
ముల్లును ముల్లుతోనే తీయాలి.. తూర్పు లద్దాఖ్‌లో అధునాతన బలగాలు
ముల్లును ముల్లుతోనే తీయాలి.. తూర్పు లద్దాఖ్‌లో అధునాతన బలగాలు