Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FD Interest Rate: ఆ బ్యాంకులో ఏకంగా 9.5శాతం వడ్డీ.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలంటే ఇదే బెస్ట్‌.. పూర్తి వివరాలు

యూనిటీ బ్యాంక్‌ తన ఎఫ్‌డీ రేట్లను సవరించింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉండే డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఇది ఇప్పుడు సీనియర్‌ సిటిజెన్స్‌కు 701 రోజుల కాల వ్యవధితో పెట్టుబడి పెట్టే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9.45% వార్షిక వడ్డీని అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే సాధారణ పౌరులకు మాత్రం 8.95శాతం వార్షిక వడ్డీ అదే కాలవ్యవధికి అందిస్తోంది.

FD Interest Rate: ఆ బ్యాంకులో ఏకంగా 9.5శాతం వడ్డీ.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలంటే ఇదే బెస్ట్‌.. పూర్తి వివరాలు
Fixed Deposit
Follow us
Madhu

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2023 | 7:56 PM

ప్రజల్లో అత్యంత ప్రజాదరణ పొందిన పథకం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌. సురక్షిత పెట్టుబడి పథకంగా అందరూ భావిస్తారు. ఇందులో అధిక వడ్డీతో పాటు పన్ను ప్రయోజనాలుండటంతో వీటిల్లో అధికశాతం మంది పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడతారు. సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లోనూ ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్(ఎఫ్‌డీ) ఖాతాను ప్రారంభించే వీలుంటుంది. అన్ని చోట్ల వడ్డీ రేట్లు ఒకేలా ఉండవు. ఒక్కో బ్యాంకులో ఒక్కో రకమైన రేటు అమలవుతుంది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వరుసగా నాలుగోసారి వడ్డీ రేట్లను మార్చలేదు. బెంచ్‌మార్క్ రెపో రేటు ఫిబ్రవరి 2023 నుంచి 6.50 శాతంగానే ఉంచుతూ అక్టోబర్ 6న ప్రకటన విడుదల చేసింది. దీంతో పలు బ్యాంకులు ఎఫ్‌డీలపై ఆకర్షణీయ వడ్డీ రేట్లు అమలు చేస్తున్నాయి. ఇందులో పలు పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు కూడా ఉన్నాయి. వాటిల్లో స్మాల్ ఫైనాన్స్ యూనిటీ బ్యాంకు ఒకటి. ఈ బ్యాంకు అత్యధికంగా 9.5శాతం వరకూ వడ్డీ రేటు అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

యూనిటీ బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లు..

యూనిటీ బ్యాంక్‌ తన ఎఫ్‌డీ రేట్లను సవరించింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉండే డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఇది ఇప్పుడు సీనియర్‌ సిటిజెన్స్‌కు 701 రోజుల కాల వ్యవధితో పెట్టుబడి పెట్టే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9.45% వార్షిక వడ్డీని అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే సాధారణ పౌరులకు మాత్రం 8.95శాతం వార్షిక వడ్డీ అదే కాలవ్యవధికి అందిస్తోంది. అదే విధంగా యూనిటీ బ్యాంక్ 1001 రోజుల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీపై సీనియర్ సిటిజన్లకు 9.50శాతం, సాధారణ పెట్టుబడిదారులకు 9.00శాతం వార్షిక వడ్డీ రేటును అమలు చేస్తుంది. అదనంగా, 181 నుంచి 201 రోజులు, 501 రోజుల కాల వ్యవధికి, యూనిటీ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 9.25శాతం, సాధారణ పెట్టుబడిదారులకు 8.75శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో ఏడు రోజుల నుంచి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై తాజా వడ్డీ రేట్లను స్థూలం పరిశీలిస్తే సాధారణ వినియోగదారులకు 4.5శాతం నుంచి 9శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 4.5శాతం నుంచి 9.5శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కొత్త వడ్డీ రేట్లు..

బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ కాల వ్యవధుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. 3 సంవత్సరాల వరకు వివిధ కాల వ్యవధుల్లో 50 బేసిస్ పాయింట్ల (బీపీఎస్‌) వరకు పెంచింది. ఈ రేట్లు రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై ఈ కొత్త రేట్లు వర్తిస్తాయని బ్యాంకు ప్రకటించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 9, 2023 నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

ఈ బ్యాంకుల్లో రేటు తగ్గింది..

మరోవైపు ప్రైవేటు రుణదాతలు అయిన యస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు రూ. 2కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై ఏ కాల వ్యవధిపై అనేసరే ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటును తగ్గించాయి. అలాగే ఇండస్‌ఇండ్ బ్యాంక్, పంజాబ్ అండ్‌ సింధ్ బ్యాంక్ కూడా అక్టోబర్ 2023లో తమ టర్మ్ డిపాజిట్లయిన ఎఫ్‌డీల వడ్డీ రేట్లను సవరించాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వేసవిలో చురుకుగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి
వేసవిలో చురుకుగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి
హోండా నుంచి 2 ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.. రెండింటిలో ఏది ఉత్తమం..!
హోండా నుంచి 2 ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.. రెండింటిలో ఏది ఉత్తమం..!
ఏప్రిల్ నెలలో వారికి పట్టిందల్లా బంగారం..12 రాశుల వారికి మాసఫలాలు
ఏప్రిల్ నెలలో వారికి పట్టిందల్లా బంగారం..12 రాశుల వారికి మాసఫలాలు
ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా హీరోయిన్ గుర్తుందా.. ?
ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా హీరోయిన్ గుర్తుందా.. ?
ఆది శంకరాచార్య కృతులు అధ్యయన తరగతులు.. ఎలా నేర్చుకోవాలంటే..
ఆది శంకరాచార్య కృతులు అధ్యయన తరగతులు.. ఎలా నేర్చుకోవాలంటే..
కదులుతూ కనిపించిన స్కూల్ బ్యాగ్.. ఏముందా అని చూడగా షాక్..
కదులుతూ కనిపించిన స్కూల్ బ్యాగ్.. ఏముందా అని చూడగా షాక్..
IPL 2025: ఆనాడు ధోనితో ఫొటో కోసం ఎదురుచూపులు.. కట్‌చేస్తే..
IPL 2025: ఆనాడు ధోనితో ఫొటో కోసం ఎదురుచూపులు.. కట్‌చేస్తే..
విమానం బాత్రూమ్ వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయి? నిజం తెలిస్తే..
విమానం బాత్రూమ్ వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయి? నిజం తెలిస్తే..
ఈవారం థియేటర్లలో/ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
ఈవారం థియేటర్లలో/ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
పెన్ను పట్టుకునే విధానం వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుందని తెలుసా..
పెన్ను పట్టుకునే విధానం వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుందని తెలుసా..