AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ విషయాలకు టెంప్ట్‌ అయ్యారో.. భారీగా నష్టపోతారు.. ఆ కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండండి..

ప్రతి వ్యక్తి జీవితంలో డబ్బులు సంపాదించాలనేది ఓ లక్ష్యం. జీవిత అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు అవసరం. అయితే డబ్బు సంపాదించడానికి ఒక్కొక్కరిది ఒక్కో ఆలోచన. కొంతమంది ఈజీగా డబ్బులు ఎలా వస్తాయా అని ఆలోచిస్తుంటారు. డబ్బుకు ఆశపడి.. తమ డబ్బులను పొగొట్టుకుంటూ ఉంటారు. తక్కువ సమయంలో మీరు పెట్టుబడి..

ఈ విషయాలకు టెంప్ట్‌ అయ్యారో.. భారీగా నష్టపోతారు.. ఆ కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండండి..
Fruad
Amarnadh Daneti
|

Updated on: Jan 08, 2023 | 8:30 AM

Share

ప్రతి వ్యక్తి జీవితంలో డబ్బులు సంపాదించాలనేది ఓ లక్ష్యం. జీవిత అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు అవసరం. అయితే డబ్బు సంపాదించడానికి ఒక్కొక్కరిది ఒక్కో ఆలోచన. కొంతమంది ఈజీగా డబ్బులు ఎలా వస్తాయా అని ఆలోచిస్తుంటారు. డబ్బుకు ఆశపడి.. తమ డబ్బులను పొగొట్టుకుంటూ ఉంటారు. తక్కువ సమయంలో మీరు పెట్టుబడి పెట్టిన డబ్బులు రెట్టింపు అవుతాయంటూ అనేక స్కీమ్‌లు కనిపిస్తూ ఉంటాయి. ఈజీగా డబ్బులు వస్తున్నాయి కదా అని కొంతమంది ఆ స్కీమ్‌ల వైపు ఆకర్షితులై.. కొద్దిరోజులకు తాము మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటుంటారు. తాజాగా పంజాబ్‌కు చెందిన మంగత్ రామ్ మైనీ, అతని బంధువులు, సహచరులు పందుల పెంపకం పేరుతో వేలమంది నుంచి పెట్టుబడులు స్వీకరించి మోసం చేశారు. పది వేల రూపాయలు పెట్టుబడి పెడితే మూడు పందిపిల్లలు వస్తాయని, ఏడు నెలల్లో ఆ డబ్బులు 1.5 రెట్లు పెరుగతాయని నమ్మించి పెట్టబడులు స్వీకరించారు. ఏడాది గడుస్తున్నా.. తమ డబ్బులు తమకు ఇవ్వకపోవడంతో చివరికి మోసపోయామని తెలుసుకుని వారంతా పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల కాలంలో చాలా మంది డబ్బులు సంపాదించడం కోసం తప్పుడు మార్గాలను ఎంచుకుంటూ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తున్నాం.

వెయ్యి రూపాయిలు పెట్టుబడి పెడితే మీ డబ్బులు మరుసటి రోజు రెట్టింపు అవుతాయంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈజీగా డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తున్న వారిని టార్గెట్ చేస్తూ.. ఆన్‌ లైన్‌ ద్వారా ఈ మోసాలకు పాల్పడుతున్నారు. మీ డబ్బులను తాము షేర్ మార్కెట్ లో పెడతామని, ఆ డబ్బులు 24 గంటల్లో రెట్టింపు చేసి ఇస్తామని నమ్మిస్తున్నారు. దీనిని నమ్మిన అనేక మంది యువత తమ విలువైన డబ్బులను పొగొట్టుకుంటున్నారు.

ఇలా ఈజీగా నగదు సంపాదించుకోవచ్చంటూ వస్తున్న స్కీమ్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా తెలియని వ్యక్తులు ఇలాంటి మాటలు చెప్పి.. డబ్బులు డిపాజిట్ చేయమని అడిగితే వెంటనే సమీప పోలీసులకు తెలియజేయాలంటున్నారు. మీ డబ్బులు తక్కువ కాలంలో డబుల్ అవుతాయని ఎవరైనా చెప్తే అది సాధ్యం కాని పనని, ఎవరూ అలాంటి వాటిని నమ్మవద్దని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..