SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఆ రెండున్నర గంటల పాటు నిలిచిపోయిన సేవలు..
తమ సేవల్లో చిన్నపాటి అంతరాయం పై అలర్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. టెక్నాలజీ అప్‌గ్రేడ్ కారణంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) జనవరి 7వ తేదీ రాత్రి 11.30 గంటల..
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా కీలక ప్రకటన చేసింది. తమ సేవల్లో చిన్నపాటి అంతరాయం పై అలర్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. టెక్నాలజీ అప్‌గ్రేడ్ కారణంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) జనవరి 7వ తేదీ రాత్రి 11.30 గంటల నుండి జనవరి 8 ఉదయం 2:00 గంటల వరకు అందుబాటులో ఉండదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శనివారం ప్రకటించింది. అంటే మొత్తం రెండున్నర గంటల పాటు సేవలు పని చేయవని ప్రకటించింది. ఈ సమయంలో యూపీఐ పని చేయదని వెల్లడించింది స్టేట్ బ్యాంక్. ఖాతాదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది.
టెక్నాలజీ అప్ గ్రేడ్ కారణంగా ఈ సేవలు నిలిపివేస్తున్నట్లు వివరించింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేసింది ఎస్‌బీఐ.
— State Bank of India (@TheOfficialSBI) January 7, 2023
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కోసం ఎస్‌బీఐ యోనో ద్వారా ఆన్‌లైన్‌లోనే హోమ్ లోన్ కోసం అప్లై చేసుకునే అవకాశాన్ని అందిస్తోంది. యోనో యాప్ ద్వారా హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ఆప్షన్లను అందులో లభిస్తాయి. అంతేకాకుండా క్షణాల్లో హోమ్ లోన్ కోసం ఇన్‌స్టంట్ అప్రూవల్ కూడా పొందొచ్చని బ్యాంక్ పేర్కొంటోంది. అంటే ఎస్‌బీఐ యోనో ద్వారా మీరు సులభంగానే లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం