Mutual Fund: 40 ఏళ్ల వయసు నుంచి నెలకు రూ.20,000 సేవ్ చేస్తే రూ.2 కోట్ల లాభం!
ప్రాపర్టీ, మ్యూచువల్ ఫండ్‌లు లేదా ఇతర ఆస్తుల ద్వారా ఇలాంటి ఆదాయాన్ని అందుకోవచ్చు. రిటైర్ మెంట్ అడ్వైజర్ సంజీవ్ దావర్ చెప్పిందేంటంటే.. ప్రతీ ఒక్కరూ వీలైనంత త్వరగా వారి రిటైర్ మెంట్ కోసం పాసివ్ ఇన్ కమ్ మార్గాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసుకోవాలి. ఇది మీ ప్రిన్సిపుల్ ఇన్వెస్ట్ మెంట్ మొత్తంపై రిటర్న్స్ ఇవ్వడంతో పాటు వడ్డీ కూడా మీ కార్పస్‌కు యాడ్ అవుతుంది. అంటే క్రమం తప్పకుండా వచ్చే ఆదాయం ఒక్కసారిగా ఆగిపోయినా.. పాసివ్ ఇన్ కమ్ ద్వారా కొంత మొత్తం రెగ్యులర్ గా వస్తుంది.
పెన్షన్ పరిమితంగా వస్తోంది. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య 70 ఏళ్ల వ్యక్తి నెలకు కేవలం రూ. 26,000తో సరిపెట్టుకోవడం చాలా కష్టం. ఆ మొత్తం ఆయన మందులు, చికిత్స ఖర్చులకే సరిపోతుంది. మరి.. ఆయన రోజువారీ ఖర్చుల సంగతేంటి? ఆ వ్యక్తి ఉద్యోగంలో ఉన్నప్పుడు తన పదవీ విరమణ కోసం ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకోనందుకు బాధపడుతున్నారు. ఒక వ్యక్తి చేసిన తప్పులాగా మీరు కూడా చేయకుండా ఉండటం మంచిది. మీ పెన్షన్‌పై మాత్రమే ఆధారపడవద్దు. జీతం పొందే వ్యక్తులు.. ప్రత్యామ్నాయ వనరుల కోసం కూడా ప్లాన్ చేసుకోవాలి. దీనినే పాసివ్ ఇన్ కమ్ అంటారు. ప్రాపర్టీ, మ్యూచువల్ ఫండ్‌లు లేదా ఇతర ఆస్తుల ద్వారా ఇలాంటి ఆదాయాన్ని అందుకోవచ్చు. రిటైర్ మెంట్ అడ్వైజర్ సంజీవ్ దావర్ చెప్పిందేంటంటే.. ప్రతీ ఒక్కరూ వీలైనంత త్వరగా వారి రిటైర్ మెంట్ కోసం పాసివ్ ఇన్ కమ్ మార్గాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసుకోవాలి. ఇది మీ ప్రిన్సిపుల్ ఇన్వెస్ట్ మెంట్ మొత్తంపై రిటర్న్స్ ఇవ్వడంతో పాటు వడ్డీ కూడా మీ కార్పస్‌కు యాడ్ అవుతుంది. అంటే క్రమం తప్పకుండా వచ్చే ఆదాయం ఒక్కసారిగా ఆగిపోయినా.. పాసివ్ ఇన్ కమ్ ద్వారా కొంత మొత్తం రెగ్యులర్ గా వస్తుంది.
మీరు 40 సంవత్సరాల వయస్సులో మీ పదవీ విరమణ కోసం పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, రూ. 2 కోట్ల కార్పస్‌ను కూడబెట్టుకోవడానికి మీరు ప్రతి నెలా రూ. 20,000 పక్కన పెట్టాలి. అయితే, కేవలం 5 సంవత్సరాలు ఆలస్యం చేస్తే, అదే లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు ప్రతి నెలా కేటాయించాల్సిన మొత్తం రెండింతలు.. అంటే రూ.40,000 అవుతుంది. హాయిగా పదవీ విరమణను పొందాలంటే మీ వార్షిక ఖర్చులకు 25 రెట్లు కార్పస్ సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. మీ NPS కార్పస్ ఇందులో మీకు సహాయం చేస్తుంది. మీ NPSలో క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. మీకు 60 ఏళ్లు నిండిన తర్వాత మీ కార్పస్‌లో 40% తప్పనిసరిగా యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయవలసి ఉంటుంది. ఇది నిర్ణీత కాలానికి లేదా మీరు జీవించి ఉన్నంతవరకు సాధారణ చెల్లింపులను పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది.
కానీ మీ కార్పస్‌లో మిగిలిన 60% మొత్తాన్ని, 60 ఏళ్లు నిండిన తర్వాత ఏకమొత్తంగా వెనక్కు తీసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. సిస్టమాటిక్ విత్ డ్రాల్ ప్లాన్.. అంటే SWP ద్వారా రెగ్యులర్ గా ఇన్ కమ్ ఉండేలా మంచి ఫండ్స్ ను ఎంచుకోవచ్చు. రెండు బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్స్‌లో ఒకే విధంగా పెట్టుబడి పెట్టాలని దావర్ సూచిస్తున్నారు. కొంత భాగాన్ని అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ కోసం కేటాయించారు. బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్‌లు ఈక్విటీ , డెట్ రెండింటి ప్రయోజనాలను పొందడంలో మీకు సహాయపడతాయి. వాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారం, బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్‌లు వరుసగా 3, 5 సంవత్సరాల వ్యవధిలో 10.48% 9.02% రాబడిని అందించాయి. మీరు మీ పోర్ట్‌ఫోలియోకు డివిడెండ్ ఇచ్చే స్టాక్‌లను యాడ్ చేయడం గురించీ ఆలోచించవచ్చు. రెగ్యులర్ గా వచ్చే డివిడెండ్ లు.. మీ స్థిరాదాయానికి యాడ్ చేసి ఊరుకోకండి. ఈ డివిడెండ్‌లను మళ్లీ పెట్టుబడి పెట్టడం వల్ల మీ కార్పస్‌ని పెంచుకోవచ్చు. డివిడెండ్‌లను సాధారణంగా బ్లూ-చిప్ కంపెనీలు ఆర్థికంగా బలంగా, మార్కెట్‌లో పేరుపొందిన, మార్కెట్ రిస్క్‌లను తట్టుకోగల సామర్థ్యమున్న వాటిలో పెడతాయి.
ఇలా కాదనుకుంటే.. మీరు స్టాక్‌లకు దూరంగా ఉండాలనుకుంటే, డివిడెండ్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడాన్ని ఎంచుకోవచ్చు. డివిడెండ్-ఈల్డ్ మ్యూచువల్ ఫండ్స్ 3 సంవత్సరాల వ్యవధిలో 23.77% రాబడిని, 5 సంవత్సరాల కాలంలో 17.97% రాబడిని అందించాయని వేల్యూ రీసెర్చ్ డేటా తెలియజేస్తోంది. కార్పస్‌ను పెట్టుబడిగా పెట్టడమే కాకుండా, మీ వార్షిక ఉపసంహరణలను తగ్గించడం , రీఇన్వెస్ట్ మెంట్స్ ను పెంచడం కూడా అవసరమని దావర్ చెప్పారు. దీనివల్ల మీ రాబడి ఎప్పుడూ మీ విత్ డ్రాల్స్ కన్నా ఎక్కువగానే ఉంటుంది.
మనలో చాలా మంది ఆస్తులను కొని.. వాటని అద్దెకు ఇచ్చి.. దాని ద్వారా సంపాదించాలనుకుంటారు. కానీ అద్దెకుండేవారిని చూడడం, ఆ ఆస్తిని మెయింటైన్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి, మీరు మీ పదవీ విరమణ కోసం ముందుగానే పెట్టుబడి పెట్టకున్నా… మీ పేరు మీద ఆస్తిని కలిగి ఉంటే, మీరు రివర్స్ మార్ట్‌గేజింగ్ ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. హోమ్ లోన్ లో.. బ్యాంకు మీకు ఒకేసారి డబ్బును రుణంగా ఇస్తుంది. దానిని తిరిగి నెలవారీగా ఇన్ స్టాల్ మెంట్స్ లో తీసుకుంటుంది. కానీ రివర్స్ మార్ట్‌గేజింగ్‌లో, మీరు మీ ఆస్తిని కొలాటెరల్ గా ఉపయోగించవచ్చు. పైగా బ్యాంక్ నుంచి క్రమంగా ఇంట్రస్ట్ పేమెంట్స్ ను పొందవచ్చు. ఇటువంటి రుణాలు… బ్యాంకు వద్ద ఆస్తిని తనఖా పెట్టడం ద్వారా వస్తాయి. కాలానుగుణంగా కొంత మొత్తాన్ని వడ్డీగా సంపాదించుకునేలా చేస్తాయి.
ఇటువంటి రుణాలను అన్ని ప్రముఖ భారతీయ బ్యాంకులు అందిస్తాయి. 60 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి. మీరు ఈ లోన్‌ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు, అలాగే లోన్ వ్యవధిలో మీరు మీ ఆస్తి నుండి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. అంతేకాదు, ఈ నెలవారీ చెల్లింపులకు పన్ను మినహాయింపు ఉంది. ఒకవేళ మీ కుటుంబం ఈ ఆస్తి యాజమాన్య హక్కును తిరిగి తీసుకోవాలనుకుంటే, వారు వడ్డీతో సహా ఈ రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. స్వాధీనం చేసుకుంటామంటూ క్లెయిమ్ చేయవచ్చు. లేకపోతే, బకాయి ఉన్న రుణ మొత్తాన్ని తిరిగి పొందడానికి బ్యాంక్ మీ ఆస్తిని విక్రయిస్తుంది. దీని తర్వాత ఏదైనా మొత్తం మిగిలి ఉంటే, ఆ ఆస్తి యజమాని వారసుడికి బ్యాంక్ ఇస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి