Fake Currency: ఏటీఎం నుంచి నకిలీ నోట్లు వచ్చాయా..? ఇలా చేస్తే బ్యాంకు ఒరిజినల్‌ నోట్లు ఇస్తుంది!

నకిలీ నోట్లను గుర్తించేందుకు ఆర్బీఐ కొన్ని సూచనలు చేసింది. మీరు అసలు 100 రూపాయల నోటును గుర్తించాలనుకుంటున్నారని అనుకుందాం, దాని ముందు వైపులా దేవనాగరి లిపిలో 100 అని రాసి ఉంటుంది. దానిని తనిఖీ చేయండి. మధ్యలో మహాత్మా గాంధీ ఫోటో ఉంటుంది. అదేవిధంగా, ఇతర నోట్ల ముందు భాగంలో సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది. టార్చ్ లేదా..

Fake Currency: ఏటీఎం నుంచి నకిలీ నోట్లు వచ్చాయా..? ఇలా చేస్తే బ్యాంకు ఒరిజినల్‌ నోట్లు ఇస్తుంది!
Indian Currency
Follow us
Subhash Goud

|

Updated on: Jan 11, 2024 | 9:49 AM

దేశంలో డిజిటల్ లావాదేవీలు ప్రారంభమైనప్పటి నుండి ప్రజలు తమ నగదు లావాదేవీలను తగ్గించారు. ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్‌ లావాదేవీలే జరుపుతున్నారు. కొందరుద టీఎంల నుంచి విత్‌డ్రా చేసుకుంటారు. ఒక వేళ ఏటీఎం నుంచి నకిలీ నోటు వస్తే ఏం చేయాలి? ప్రస్తుతం దేశంలో రూ.30 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు నగదు లేదా కరెన్సీలో జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో ATM నుండి నకిలీ నోట్లు జారీ అయిన సందర్భాలు కూడా విన్నాము. ఇలా జరిగితే మీరు వెంటనే కొన్ని పనులు చేయడం ద్వారా మీ డబ్బును తిరిగి పొందవచ్చు.

మీకు నకిలీ నోట్లు వస్తే ఇలా చేయండి

  1. మీరు ATM నుండి డబ్బు విత్‌డ్రా చేస్తుంటే, ఈ నోటు అసలైనది కాదని మీకు కొంచెం కూడా అనిపిస్తే, ముందుగా దాని ఫోటో తీయండి.
  2. ఆ తర్వాత ఏటీఎంలో అమర్చిన సీసీటీవీ కెమెరా ముందు ఆ నోటును తలకిందులుగా చూపించాలి. తద్వారా ఏటీఎం నుండే ఈ నోటు బయటకు వచ్చినట్లు కెమెరా రికార్డు చేస్తుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. ఇప్పుడు ఈ లావాదేవీకి సంబంధించిన రసీదు తీసుకుని, దాని ఫోటో తీసి దాన్ని సేవ్ చేయండి.
  5. ఇప్పుడు ఏటీఎం నుండి నోటు, రసీదుతో బ్యాంకుకు వెళ్లండి. ఈ మొత్తం విషయం గురించి బ్యాంకు ఉద్యోగికి చెప్పండి. అప్పుడు మీకు ఒక ఫారమ్ అందిస్తారు. దాన్ని నింపిన తర్వాత రసీదు, నకిలీ నోటుతో పాటు బ్యాంకుకు ఇవ్వాల్సి ఉంటుంది.
  6. బ్యాంకు ఈ నకిలీ నోటును తనిఖీ చేసి, ఆపై మీకు అసలు నోటును ఇస్తుంది.
  7. మీరు పెద్ద మొత్తంలో డబ్బును విత్‌డ్రా చేసి, ఆపై మీకు నకిలీ నోటు దొరికితే, మీరు ఈ నోటుతో RBIకి వెళ్లాలి. రసీదు, నోటు ఆర్‌బిఐకి ఇవ్వాలి. ఆ తర్వాత ఆర్‌బీఐ విచారణ జరుపుతుంది. ఆ తర్వాత మాత్రమే మీరు మీ డబ్బు తిరిగి పొందుతారు.

అసలు, నకిలీ నోట్లను గుర్తించడం ఇలా

నకిలీ నోట్లను గుర్తించేందుకు ఆర్బీఐ కొన్ని సూచనలు చేసింది. మీరు అసలు 100 రూపాయల నోటును గుర్తించాలనుకుంటున్నారని అనుకుందాం, దాని ముందు వైపులా దేవనాగరి లిపిలో 100 అని రాసి ఉంటుంది. దానిని తనిఖీ చేయండి. మధ్యలో మహాత్మా గాంధీ ఫోటో ఉంటుంది. అదేవిధంగా, ఇతర నోట్ల ముందు భాగంలో సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది. టార్చ్ లేదా యూవీ లైట్‌లో చూస్తే పసుపు రంగులో కనిపిస్తుంది. ఈ విధంగా మీరు నకిలీ, అసలైన నోట్లను గుర్తించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోెసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ జిల్లాల్లో 100 శాతం సమగ్ర కులగణన సర్వే పూర్తి..
ఆ జిల్లాల్లో 100 శాతం సమగ్ర కులగణన సర్వే పూర్తి..
మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఎలా మార్చింది.?
మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఎలా మార్చింది.?
బంగారం ధర రూ.64 వేలకు పడిపోనుందా..? ధరలు ఎప్పుడు తగ్గుతాయి?
బంగారం ధర రూ.64 వేలకు పడిపోనుందా..? ధరలు ఎప్పుడు తగ్గుతాయి?
పెర్త్‌లో ముంబై వాలా దూకుడు.. సిక్స్‌ల రికార్డులో టాప్ లేపాడుగా
పెర్త్‌లో ముంబై వాలా దూకుడు.. సిక్స్‌ల రికార్డులో టాప్ లేపాడుగా
పెళ్ళికాని వారికి వివాహం జరిపించే వినాయకుడు.. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే
పెళ్ళికాని వారికి వివాహం జరిపించే వినాయకుడు.. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే
సైలెంట్‌గా బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఎంగేజ్‌మెంట్.. వరుడు ఎవరంటే?
సైలెంట్‌గా బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఎంగేజ్‌మెంట్.. వరుడు ఎవరంటే?
వామ్మో.. ఆహారాన్ని తొందర తొందరగా తింటున్నారా.. డేంజర్‌లో పడినట్టే
వామ్మో.. ఆహారాన్ని తొందర తొందరగా తింటున్నారా.. డేంజర్‌లో పడినట్టే
BSNL కీలక నిర్ణయం.. ఆ 48 ప్రదేశాల్లో ఉచిత వైఫై.. టవర్ల ఏర్పాటు!
BSNL కీలక నిర్ణయం.. ఆ 48 ప్రదేశాల్లో ఉచిత వైఫై.. టవర్ల ఏర్పాటు!
రెడ్‌మీ కొత్త సిరీస్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, ధరపై ఓ లుక్కేయండి.
రెడ్‌మీ కొత్త సిరీస్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, ధరపై ఓ లుక్కేయండి.
యాత్రికుల బస్సు బోల్తా.. తొమ్మిది మందికి గాయాలు
యాత్రికుల బస్సు బోల్తా.. తొమ్మిది మందికి గాయాలు