Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: మోడీ సర్కార్‌ శుభవార్త.. మహిళా రైతులకు రూ.12000?

రైతులకు మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్‌ ఒకటి. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. దేశంలోని మహిళా రైతులకు శుభవార్త చెప్పనుంది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన స్కీమ్‌ ద్వారా రైతులకు అందించే ఆర్థిక సాయాన్ని ప్రత్యేకంగా మహిళా రైతులకు రెట్టింపు చేసే ఆలోచనలో ఉన్నట్లు..

PM Modi: మోడీ సర్కార్‌ శుభవార్త.. మహిళా రైతులకు రూ.12000?
Pm Modi
Follow us
Subhash Goud

|

Updated on: Jan 11, 2024 | 4:19 PM

కేంద్రంలోని మోడీ సర్కార్‌ రైతుల కోసం ఎన్నో పథకాలను రూపొందిస్తున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా వివిధ రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. రైతులకు మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్‌ ఒకటి. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. దేశంలోని మహిళా రైతులకు శుభవార్త చెప్పనుంది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన స్కీమ్‌ ద్వారా రైతులకు అందించే ఆర్థిక సాయాన్ని ప్రత్యేకంగా మహిళా రైతులకు రెట్టింపు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా రైతులకురూ. 12,000 లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిన్నట్లు ఓ నివేదిక ద్వారా సమాచారం.

అయితే ఈ ఆలోచన పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు మహిళా ఓటర్లను ఆకర్షించే విధంగా ఉందని తెలిసినట్లు రాయిటర్స్‌ కథనంలో పేర్కొంది. ఈ ప్రణాళికను ఫిబ్రవరి 1న బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ప్రకటించినట్లయితే ప్రభుత్వానికి అదనంగా రూ.12,000 కోట్ల ఖర్చు పెరగనుందని బడ్జెట్‌ ప్రతిపాదనలో చర్చించినట్లు తెలుస్తోంది.

అయితే మహిళా ఓటర్లను ఆకట్టుకునే విధంగా కేంద్రం ఇలాంటి ప్రణాళిక ఎప్పుడు కూడా చేపట్టలేదు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు సాధికారత కల్పించే విధంగా ఈ రెట్టింపు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సాయం పెంచే విషయమై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోెసం ఇక్కడ క్లిక్ చేయండి