Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani: భారతదేశ చరిత్రలో నరేంద్ర మోదీ అత్యుత్తమ ప్రధాని: అంబానీ

2047 నాటికి భారతదేశం 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా అడుగులు వేస్తోందని.. ప్రపంచంలో ఏ శక్తీ దీన్ని ఆపదు. గుజరాత్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుంది' అని చెప్పారు. 'భారత్‌లో యువత ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశించి కొత్త ఆవిష్కరణలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మోదీ జాతీయవాదం, అంతర్జాతీయవాదానికి భవిష్యత్ తరాలు కృతజ్ఞతలు తెలుపుతాయని అన్నారు..

Mukesh Ambani: భారతదేశ చరిత్రలో నరేంద్ర మోదీ అత్యుత్తమ ప్రధాని: అంబానీ
Mukesh Ambani
Follow us
Subhash Goud

|

Updated on: Jan 10, 2024 | 1:54 PM

భారత దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అత్యుత్తమ ప్రధాని అని వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ అభివర్ణించారు. వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024లో అంబానీ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ఈ సమయంలో గొప్ప ప్రపంచ నాయకుడిగా ఎదిగారని అభిప్రాయపడ్డారు. వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ 20 ఏళ్లుగా కొనసాగడానికి కారణం నరేంద్ర మోదీ అని అన్నారు. 20 ఏళ్లుగా ఈ తరహా శిఖరాగ్ర సదస్సు బలంగా సాగిందనడానికి మరో ఉదాహరణ లేదన్నారు. మన ప్రధాన మంత్రి నరేంద్రభాయ్ మోదీ దార్శనికత, స్థిరత్వానికి ఇదొక ఉదాహరణ అని అంబానీ అభిప్రాయపడ్డారు.

భారతదేశ ప్రగతిని ఎవరూ ఆపలేరు

2047 నాటికి భారతదేశం 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా అడుగులు వేస్తోందని.. ప్రపంచంలో ఏ శక్తీ దీన్ని ఆపదు. గుజరాత్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుంది’ అని చెప్పారు. ‘భారత్‌లో యువత ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశించి కొత్త ఆవిష్కరణలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మోదీ జాతీయవాదం, అంతర్జాతీయవాదానికి భవిష్యత్ తరాలు కృతజ్ఞతలు తెలుపుతాయని అన్నారు. అమృత కాలంలోనే పూర్తిగా అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి మీరు గట్టి పునాది వేశారు. 2047 నాటికి భారతదేశం 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడాన్ని భూమిపై ఏ శక్తీ అడ్డుకోలేదు’ అని ఆయన పేర్కొన్నారు. ‘మేము గేట్‌వే సిటీ ఆఫ్ ఇండియా (ముంబై) నుండి ఆధునిక భారతదేశ పురోగతికి గేట్‌వే అయిన గుజరాత్‌కి వచ్చాము. విదేశీయులకు కొత్త భారతదేశం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది గుజరాత్. భారతదేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన వ్యక్తి ప్రధాని మోదీ అని అంబానీ అన్నారు.

సమ్మిట్ 20 ఏళ్ల వారసత్వాన్ని, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పెట్టుబడిదారుల సమ్మిట్‌గా దాని హోదాను గుర్తిస్తూ, విజయానికి ప్రధాని మోదీ దూరదృష్టి నాయకత్వమే కారణమన్నారు. రాబోయే పదేళ్లలో గణనీయమైన పెట్టుబడులతో గుజరాత్ వృద్ధిలో రిలయన్స్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి