Business Ideas: మీ ఇంట్లో ఒక గది ఉంటే చాలు.. ఈ వ్యాపారంతో నెలకు రూ. 2 లక్షలు సంపాదించే అవకాశం..
వ్యాపారం చేయడం ద్వారా మంచి ఆదాయం పొందాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ తో మీ ముందుకు వచ్చాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ఇంటి వద్ద ఉండే చక్కటి ఆదాయం పొందే వీలుంది.

వ్యాపారం చేయడం ద్వారా మంచి ఆదాయం పొందాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ తో మీ ముందుకు వచ్చాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ఇంటి వద్ద ఉండే చక్కటి ఆదాయం పొందే వీలుంది. ఈ బిజినెస్ కోసం మీకు కేవలం ఒక గది ఉంటే సరిపోతుంది. . ముఖ్యంగా మహిళలు ఇద్దరు ముగ్గురు కలిసి ఈ బిజినెస్ చేస్తే మంచి ఆదాయం లభించే అవకాశం ఉంది అలాగే పెట్టుబడి కూడా చాలా తక్కువ అని చెప్పాలి. కేవలం రూ. 25 వేల నుంచి రూ. 40 వేల వరకు పెట్టుబడి పెడితే చాలు. ఈ వ్యాపారంలో చక్కటి ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది. అలాంటి బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ మధ్యకాలంలో ప్రతి ఆదివారం ప్రతి ఇంట్లోనూ నాన్ వెజ్ వంటలు చేసుకొని తినడం సాధారణం అయ్యింది ముఖ్యంగా సండే పూట చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ తో చేసిన వంటలు తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక నాన్ వెజ్ వంటలు అనగానే ముఖ్యంగా గుర్తుకు వచ్చేది గరం మసాలా మాత్రమే. మసాలా జోడిస్తేనే నాన్ వెజ్ కర్రీ అయినా బిర్యాని అయినా రుచి వస్తుంది. ముఖ్యంగా ఇన్ స్టంట్ పద్ధతిలో నాన్ వెజ్ కర్రీ చేసుకోవాలంటే, గరం మసాలా తప్పనిసరి. ప్రతి వంటింట్లోను గరం మసాలా కనిపిస్తోంది.
ఈ గరం మసాలా తయారీ వ్యాపారాన్ని మీరు ఒక ఆదాయ అవకాశంగా మార్చుకోవచ్చు. గరం మసాలా తయారీ కోసం ముఖ్యంగా మీకు కావాల్సింది.. Industrial Masala Grinder . దీని ధర సుమారు 20వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకు ఉంటుంది. మసాలా దినుసులను హోల్ సేల్ పద్ధతిలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ మసాలా దినుసులను గ్రైండర్ లో వేసి మన ఆడిస్తే గరం మసాల పొడి తయారవుతుంది. ఈ మసాలా పొడిని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి మార్కెట్లో విక్రయించడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే వీలుంది.




మీరు పెద్ద ఎత్తున ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే స్థానిక అనుమతులను సైతం ఉండాల్సి ఉంటుంది అలాగే FSSAI సర్టిఫికేషన్, జీఎస్టీ నెంబర్, స్థానిక పర్మిషన్లు పొందాల్సి ఉంటుంది. అలాగే ప్యాకేజింగ్ మిషన్ కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఇక గరం మసాలాను విక్రయించడానికి మీరు హోటల్స్ కర్రీ పాయింట్స్ అలాగే ఇతర వాణిజ్య సముదాయాల వద్ద హోల్సేల్ లెక్కన విక్రయించవచ్చు. అలాగే కిరాణా దుకాణాల్లో కూడా మీరు ఈ గరం మసాలాను అందుబాటులో ఉంచితే చక్కటి సేల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని పబ్లిసిటీలకు అన్న కూడా మౌత్ పబ్లిసిటీ అనేది చాలా ముఖ్యమైనది అందుకే మీ గరం మసాలాను స్థానికంగా ఉన్న ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచితే మంచి సేల్స్ పుంజుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చికెన్ షాపుల వద్ద మటన్ షాపుల వద్ద మీ గరం మసాలాను అందుబాటులో ఉంచాలి. అప్పుడే ప్రజలకు మీ గరం మసాలా రుచి తెలుస్తుంది. ఒక చిన్న స్థాయి మసాలా తయారీ కేంద్రం ప్రారంభిస్తే నెలకు రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకూ సంపాదించే వీలుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..