AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea : ఇంట్లో ఖాళీగా ఉన్నామని దిగులుపడకండి. ఈ మహిళను స్పూర్తిగా తీసుకుంటే విజయం మీ సొంతం.

మహిళలు ఆర్థిక స్వతంత్రతను కలిగి ఉండాలి. ఆర్థిక స్వతంత్రత వారిని ముందుకు సాగేలా ప్రేరేపిస్తుంది. శ్రమతోపాటు కాస్త తెలివితేటలు కూడా ఉపయోగిస్తే...విజయం మీ సొంతం అనడంల ఎలాంటి సందేహం లేదు.

Business Idea : ఇంట్లో ఖాళీగా ఉన్నామని దిగులుపడకండి. ఈ మహిళను స్పూర్తిగా తీసుకుంటే విజయం మీ సొంతం.
Business Idea
Madhavi
| Edited By: Janardhan Veluru|

Updated on: Mar 19, 2023 | 9:32 PM

Share

జీవితంలో ఎన్నో సాధించాలని కలలు కనే మహిళలు ఎందరో ఉన్నారు. కానీ కష్టాలను ఎదుర్కొని సమస్యల మధ్య విజయం సాధించిన వారి సంఖ్య చాలా తక్కువ. భారత్ లో నేటికీ చాలా చోట్ల స్త్రీలకు స్వేచ్చ లేదు. ఏదొకచోట అవమానలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఒక మహిళ స్వతంత్రంగా పనిచేస్తే..ఆమెకు సపోర్టు ఇచ్చేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అన్ని కష్టాలను ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు సాగే మహిళలు మనకు ఎందరో ఉన్నారు. అందులో ఒకరు సమీక్షా దినేష్ కప్కర్. ఎవరు ఆమె. ఎలా విజయవంతమైన మహిళగా గుర్తింపును పొందింది. ఇప్పుడు తెలుసుకుందాం.

పెద్ద కంపెనీ తెరిచి వేల మందికి ఉపాధి కల్పించాల్సిన పని లేదు. సుమీక్ష దినేష్ కప్కర్ ఆలోచన ప్రకారం మీ ఇంటి దగ్గరే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు, మీ చుట్టుపక్కల వారికి పని కల్పించవచ్చు. చాలా డబ్బు సంపాదించవచ్చు. సుమీక్ష దినేష్ కప్కర్ జనపనార సంచులను తయారు చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. అంతేకాదు ఇతర మహిళలకు జీవనోపాధిని కల్పిస్తున్నారు.

సుమీక్ష దినేష్ కప్కర్ ఎవరు? :

ఇవి కూడా చదవండి

సుమీక్ష దినేష్ కప్కర్ మహారాష్ట్రలోని శంభాజీ నగర్ నివాసి. కరోనా కారణంగా ఆమె భర్త ఉద్యోగం కోల్పోయాడు. దీంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఈ సందర్భంగా జన్‌శిక్షా సంస్థాన్‌లో జూట్‌ బ్యాగ్‌ మేకింగ్‌ కోర్సును అభ్యసించిన సమీక్ష ప్రస్తుతం వ్యాపారవేత్తగా రాణిస్తోంది.

కోర్సు ఏమిటి? :

2018లో విద్యా మంత్రిత్వ శాఖ జన్ శిక్షా సంస్థాన్ పథకాన్ని ప్రారంభించింది. తర్వాత అది నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖకు బదిలీ చేయబడింది. ఈ కోర్సులో జ్యూట్ బ్యాగ్ తయారీ కూడా నేర్పిస్తారు. ఇక్కడ సమీక్ష చాలా నేర్చుకుంది. జనపనార సంచులు ఎక్కువ కాలం ఉంటాయి. ఈ సంచులు చిన్న లేదా భారీ వస్తువులను తీసుకెళ్లడానికి అనుకూలంగా ఉంటాయి. అనేక ప్రయోజనాల కోసం దీన్ని రోజూ ఉపయోగించవచ్చు. శంభాజీ నగర్ ప్రాంతంలో జనపనార సంచుల తయారీకి అవసరమైన ముడిసరుకు లభ్యం కాలేదు. అందుకని కోల్‌కతా నుంచి జూట్ తీసుకురావాల్సి వచ్చింది. దీనికి ఎక్కువ ఖర్చవుతుంది. పని వదలకుండా చేయడం వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని సమీక్ష చెబుతోంది.

కుటుంబ మద్దతు లభించింది:

వ్యాపారం ప్రారంభించాలంటే అన్ని కంటే ముందు కుటుంబసభ్యుల మద్దతు ఉండాలి. వారి సపోర్టు తో మరింత వ్యాపారంలో రాణిస్తానం. అయితే సమీక్షకు కుటుంబసభ్యుల నుంచి పూర్తి సహకారం అందింది. తమ పిల్లలు ఇద్దరు వెబ్ సైట్లో జ్యూట్ బ్యాకుల గురించి పూర్తి వివరాలను పొందుపరిచారు.

అయితే ఈ వ్యాపారం ప్రారంభించాలంటే యంత్రం, జూట్ గురించిన సమాచారం సరిగ్గా ఉండాలి. వ్యాపారం ప్రారంభించిన తర్వాత మార్కెటింగ్‌పై కూడా అవగాహన ఉండాలని సుమీక్ష చెబుతోంది. కస్టమైజ్డ్ ఆర్డర్‌ల కోసం 700-800 ఆర్డర్‌లు ఎక్కువగా అందుతాయి. మరింత శ్రద్ధతో చేయాల్సి ఉందని సుమీక్ష అంటున్నారు. అప్పు తీసుకుని వ్యాపారం ప్రారంభించింది.. ఒక మహిళ వ్యాపారం ప్రారంభించడానికి ఎవరి మద్దతు అవసరం లేదు. తాను పని చేయాగలను అనే నమ్మకంతో ముందుకు సాగింది. అనతి కాలంలో జ్యూట్ బ్యాగుల తయారీ రంగంలో రాణించి తాను చేసిన అప్పును కూడా తీర్చేసింది. అంతేకాదు పది మందికి ఉపాధిని కూడా కల్పిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి