EPFO: మీరు ఉద్యోగం మానేసిన తర్వాత పీఎఫ్ అకౌంట్లో వడ్డీ జమ అవుతుందా? పూర్తి వివరాలు తెలుసుకోండి
ఉద్యోగులు ఐదు సంవత్సరాలు విరామం తీసుకున్న తర్వాత మళ్లీ ఉద్యోగంలో చేరితే పీఎఫ్ వడ్డీ విషయంలో షాక్‌కు గురయ్యే పరిస్థితులు ఉంటాయి. గత రెండేళ్లుగా..
ఉద్యోగులు ఐదు సంవత్సరాలు విరామం తీసుకున్న తర్వాత మళ్లీ ఉద్యోగంలో చేరితే పీఎఫ్ వడ్డీ విషయంలో షాక్‌కు గురయ్యే పరిస్థితులు ఉంటాయి. గత రెండేళ్లుగా తన పీఎఫ్ ఖాతాలో వడ్డీ జమ కావడం లేదని ఆందోళనకు గురవుతుంటారు. అయితే పీఎఫ్ నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ జాబ్‌లో చేరినట్లయితే ఈ మధ్యకాలంలో పీఎఫ్ విరాళాలు నిలిచిపోతాయి. అలాంటి సమయంలో మీకు వడ్డీ రాదు. ఉద్యోగి మూడేళ్లకు పైగా విరామం తీసుకున్నందున పీఎఫ్ అకౌంట్ నిష్క్రియంగా మారుతుంది. అందువల్ల తమ పీఎఫ్ ఖాతాపై ఎలాంటి వడ్డీ పొందలేరు. ఈపీఎఫ్‌వో పీఎఫ్ ఖాతాలను రెండు వర్గాలుగా విభజించింది. యాక్టివ్, ఇన్‌యాక్టివ్. రెగ్యులర్ కంట్రిబ్యూషన్‌లు చేసే ఖాతాలు యాక్టివ్ కేటగిరీ కిందకు వస్తాయి.
అయితే 36 నెలలుగా ఎలాంటి మొత్తం డిపాజిట్ చేయని ఖాతాలు ఇన్‌యాక్టివ్ కేటగిరీ కిందకు వస్తాయి. ఉద్యోగం మానేసిన కొందరి పీఎఫ్ ఖాతా విషయంలోనూ అదే జరుగుతుంది. యాక్టివ్‌గా ఉన్న పీఎఫ్ ఖాతాల విషయంలో వడ్డీ క్రమం తప్పకుండా జమ అవుతూనే ఉంటుంది. అయితే, నిర్దిష్ట వ్యవధి తర్వాత ఇన్‌యాక్టివ్ ఖాతాలపై వడ్డీ జమ కావడం ఆగిపోతుంది. EPFO నిబంధనల ప్రకారం.. ఉద్యోగి ఉద్యోగంలో ఉన్నప్పుడు మొదటి మూడు సంవత్సరాలకు వడ్డీని పొందుతాడు. కానీ, వారి ఖాతాలో వరుసగా మూడు సంవత్సరాలు ఎలాంటి సహకారం అందించకపోవడంతో వడ్డీ జమ కావడం నిలిచిపోతుంది. అయితే ఇప్పుడు ఉద్యోగి కొత్త జాబ్ స్టార్ట్ చేయడంతో అకౌంట్ మళ్లీ యాక్టివ్ అవుతుంది. ఖాతాలో ఉన్న డిపాజిట్లపై వడ్డీని పొందడం ప్రారంభం అవుతుంది.
పీఎఫ్ ఖాతా ఎప్పుడు ఇన్‌యాక్టివ్‌గా మారుతుందో తెలుసుకోండి:
ఉద్యోగం నుంచి విరామం తీసుకోవడం, లేదా ఉద్యోగం వదిలిపెట్టడం, లేదా విదేశాలకు వెళ్లడం, లేదా మరణం సంభవించినప్పుడు కూడా మూడేళ్లపాటు ఖాతాలో ఎటువంటి సహకారం అందించకపోతే అది నిష్క్రియంగా మారుతుంది. అంటే పీఎఫ్ అకౌంట్ ఇన్‌యాక్టివ్‌లోకి వెళ్లిపోతుందన్నట్లు. ఇప్పుడు, మీరు కొత్త ఉద్యోగానికి మారితే మునుపటి ఖాతాలోని బ్యాలెన్స్‌పై వడ్డీ కొనసాగుతుందా లేదా అనే ప్రశ్న తలెత్తుతుంది. మీరు ఉద్యోగాలు మారడంపై మీ మునుపటి పీఎఫ్ ఖాతాపై వడ్డీని వస్తూనే ఉంటుంది. ఈపీఎఫ్‌వో ప్రకారం.. ఒక వ్యక్తి ఉద్యోగంలో ఉంటే అతని మునుపటి ఖాతాలు యాక్టివ్‌గా పరిగణించడం జరుగుతుంది. అందుకే ఉద్యోగాలు మారేటప్పుడు మునుపటి పీఎఫ్ ఖాతాను కొత్త సంస్థ ఖాతాతో విలీనం చేయాలి. కొన్ని కారణాల వల్ల అకౌంట్ విలీనం కానట్లయితే వడ్డీ నిలిచిపోతుంది. ఒక ఉద్యోగానికి, మరొక ఉద్యోగానికి మధ్య మూడు సంవత్సరాల కంటే ఎక్కువ గ్యాప్ ఉంటే మీరు వడ్డీని రావడం ఆగిపోతుందని గుర్తించుకోవాలి.
ఐదేళ్ల విరామం తర్వాత ఉద్యోగి మళ్లీ ఉద్యోగంలో చేరితే అతనికి 58 ఏళ్లు వచ్చే వరకు పీఎఫ్ కట్ అవుతుంటుంది. అప్పుడు వడ్డీ కూడా పొందుతుంది. ఇన్ని సంవత్సరాలలో వడ్డీ క్రమం తప్పకుండా అందుతూనే ఉంటుంది. పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాలు. ఇంతకు మించి పనిచేస్తే పీఎఫ్ డిడక్షన్ ఆగిపోతుంది. దీని తర్వాత తమ పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.
పదవీ విరమణ తర్వాత మూడేళ్ల వరకు మాత్రమే వడ్డీ లభిస్తుంది. ఈ మొత్తం ఖాతాదారుడి వార్షిక ఆదాయానికి జోడిస్తుంది ఈపీఎఫ్‌వో. దీని ప్రకారం పన్ను చెల్లించాలి. పదవీ విరమణ తర్వాత ఒక వ్యక్తిని ఉద్యోగిగా పరిగణించడం జరుగుతుంది.
అయితే ఉద్యో గులు ప్రణాళికాబద్ధంగా ఉద్యోగం నుంచి విరామం తీసుకుని మరింత పని చేయాలనే ఉద్దేశ్యంతో వారి పీఎఫ్ ఖాతాలో డబ్బు జమ చేయాలి. ఉద్యోగం మానేసిన తర్వాత వారు మరింత పని చేయకూడదనుకుంటే వారు మూడేళ్లలోపు పీఎఫ్ డబ్బును ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే మూడేళ్ల తర్వాత వారికి వడ్డీ క్రెడిట్ రావడం ఆగిపోతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి