India Top-5 CEO Salary: భారత్‌లో అత్యధిక వేతనాలు పొందుతున్న టాప్‌-5 సీఈఓలు వీరే.. !

దేశంలో ఇన్ఫోసిస్ నుంచి టిసిఎస్, విప్రో, హెచ్‌సిఎల్ వరకు అనేక ఐటి దిగ్గజాలు ఉన్నాయి. వీటి వ్యాపారం దేశవ్యాప్తంగా, విదేశాలలో విస్తరించి ఉన్నాయి. ఈ కంపెనీలు..

India Top-5 CEO Salary: భారత్‌లో అత్యధిక వేతనాలు పొందుతున్న టాప్‌-5 సీఈఓలు వీరే.. !
India Top 5 Ceo Salary
Follow us

|

Updated on: Mar 18, 2023 | 5:00 AM

దేశంలో ఇన్ఫోసిస్ నుంచి టిసిఎస్, విప్రో, హెచ్‌సిఎల్ వరకు అనేక ఐటి దిగ్గజాలు ఉన్నాయి. వీటి వ్యాపారం దేశవ్యాప్తంగా, విదేశాలలో విస్తరించి ఉన్నాయి. ఈ కంపెనీలు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అయితే ఈ కంపెనీల సీఈవోలు ఎవరో తెలుసా? వారి జీతం ఎంత? అత్యధికంగా చెల్లించే 5 సీఈవోల గురించి తెలుసుకోండి.

  • టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈవో, ఎండీ రాజేష్ గోపీనాథన్ చివరిగా అంటే 5వ స్థానంలో ఉన్నారు. అతను సెప్టెంబర్‌లో టీసీఎస్‌ నుంచి ఈ పదవిని విడిచిపెట్టాడు. 2022లో అతనికి 25.75 కోట్లు పరిహారం అందించారు. అతని వార్షిక వేతనంలో 26.6 శాతం పెరుగుదల ఉంది.
  • టెక్ మహీంద్రా సీఈవో, ఎండీ సిపి గుర్నానీ నాల్గవ స్థానంలో ఉన్నారు. అతని జీతం గత సంవత్సరం 189 శాతం పెరిగింది. అలాగే రూ. 63.4 కోట్లు తీసుకున్నారు.
  • ఇన్ఫోసిస్ కంపెనీ సీఈఓ సలీల్ పారిఖ్ 2022లో రూ. 71.02 కోట్లు తీసుకున్నారు. ఈ జాబితాలో ఇతను మూడవ స్థానంలో ఉన్నారు.
  • ఈ జాబితాలో విప్రో సీఈవో రెండో స్థానంలో నిలిచారు. థియరీ డెలాపోర్టే వార్షిక ప్యాకేజీ FY2022లో రూ. 79.8 కోట్లు.
  • 2022లో అత్యధిక జీతం పొందిన సీఈవో హెచ్‌సిఎల్ కంపెనీకి చెందిన సి. విజయకుమార్. 2021లో అతని జీతం రూ. 123.13 కోట్లు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి