ICICI: మీకు ఐసీఐసీఐ బ్యాంకులో అకౌంట్ ఉందా? అయితే ఇవి తెలుసుకోండి!
ప్రస్తుతం దేశంలోని వివిధ రకాల బ్యాంకులు తమ తమ వినియోగదారులకు రకరకాల సర్వీలను అందిస్తుంటాయి. బ్యాంకులో అకౌంట్ ఉన్న వారికి ఫిక్స్ డిపాజిట్, ఇతర డిపాజిట్లు ఉంటాయి. అయితే వినియోగదారుల కోసం బ్యాంకులు కొత్త కొత్త నియమ నిబంధనలు, వడ్డీ రేట్లను సవరిస్తుంటాయి. సాధారణ ప్రజలకు ఒక రకమైన వడ్డీ రేట్లు, సీనియర్ సీటిజన్లకు మరో వడ్డీ రేట్లను అందిస్తుంటాయి.
దేశంలోని రెండవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసిఐసిఐ బల్క్ ఎఫ్‌డిపై వడ్డీని సవరించింది. ఈసారి బ్యాంక్ కొన్ని కాలాల ఎఫ్‌డిపై వడ్డీని రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు మార్చింది. ఈ కొత్త రేట్లు జూన్ 6, 2024 నుండి అమలులోకి వచ్చాయి. బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ)ని అందిస్తోంది. బ్యాంకు 4.75 శాతం నుంచి 6.75 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. బల్క్ ఎఫ్‌డీపై బ్యాంక్ గరిష్టంగా 7.25% వడ్డీని అందిస్తోంది.
ఐసీఐసీఐ బ్యాంక్ బల్క్ ఎఫ్‌డీపై వడ్డీ రేట్లు..
- 7 రోజుల నుండి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.75 శాతం, సీనియర్ సిటిజన్లకు – 4.75 శాతం.
- 15 రోజుల నుండి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.75 శాతం, సీనియర్ సిటిజన్లకు – 4.75 శాతం.
- 30 రోజుల నుండి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 5.50 శాతం.
- 46 రోజుల నుండి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు – 5.75 శాతం.
- 61 రోజుల నుండి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 6 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6 శాతం.
- 91 రోజుల నుండి 120 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.50 శాతం.
- 121 రోజుల నుండి 150 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.50 శాతం.
- 151 రోజుల నుండి 184 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.50 శాతం.
- 185 రోజుల నుండి 210 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 6.75 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.75 శాతం.
- 211 రోజుల నుండి 270 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 6.75 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.75 శాతం.
- 271 రోజుల నుండి 289 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 6.85 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.85 శాతం.
- 1 సంవత్సరం నుండి 389 రోజులు: సాధారణ ప్రజలకు – 7.30 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.30 శాతం.
- 390 రోజుల నుండి 15 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.25 శాతం.
- 15 నెలల నుండి 18 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 7.05 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.05 శాతం.
- 2 సంవత్సరాల 1 రోజు నుండి 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 7 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7 శాతం
- 3 సంవత్సరాల 1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 7 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7 శాతం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి