ICICI Bank: ఐసీఐసీఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా.. అయితే మీకు ఇది శుభవార్తే.. ఆరు రోజుల్లో రెండోసారి వడ్డీ రేట్లు పెంచిన బ్యాంక్‌..

ప్రైవేట్ బ్యాంక్ ICICI బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను మళ్లీ పెంచింది. గత ఆరు రోజుల్లో రెండోసారి వడ్డీ రేట్లు పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచినప్పటి నుంచి, టర్మ్ డిపాజిట్ల రేట్లు పెరుగుతున్నాయి..

ICICI Bank: ఐసీఐసీఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా.. అయితే మీకు ఇది శుభవార్తే.. ఆరు రోజుల్లో రెండోసారి వడ్డీ రేట్లు పెంచిన బ్యాంక్‌..
Icici Bank
Follow us

|

Updated on: Jun 23, 2022 | 7:45 AM

ప్రైవేట్ బ్యాంక్ ICICI బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను మళ్లీ పెంచింది. గత ఆరు రోజుల్లో రెండోసారి వడ్డీ రేట్లు పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచినప్పటి నుంచి, టర్మ్ డిపాజిట్ల రేట్లు పెరుగుతున్నాయి. దాదాపు అన్ని బ్యాంకులు FD, RD వడ్డీ రేట్లను పెంచాయి. డిపాజిట్ల వడ్డీ రేట్లే కాదు రుణాల వడ్డీ రేట్లు కూడా పెరిగాయి. ఐసిఐసిఐ బ్యాంక్ బుధవారం రూ. 2 కోట్ల లోపు ఎఫ్‌డిల వడ్డీ రేట్లను పెంచింది. ఎంపిక చేసిన టేనర్‌ల FDలపై వడ్డీ రేట్లను 5 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. కొత్త FD రేట్లు జూన్ 22, 2022 నుంచి అమలులోకి వచ్చాయి. ICICI బ్యాంక్ ప్రకారం ఇప్పుడు FD రేటు 2.75 శాతం నుంచి 5.75కి చేరుకుంది. బ్యాంక్ FDల రేటును 185 రోజుల నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ, ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలకు పెంచింది.

185 రోజుల నుంచి 1 సంవత్సరం లోపు ఉండే FDలపై, కొత్త వడ్డీ రేటు 4.65 శాతంగా ఉంటుంది. ఇది గతంలో 4.60 శాతంగా ఉండేది. అదేవిధంగా, ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు ఉన్న FDల వడ్డీ రేటు 5.35 శాతానికి పెరిగింది. జూన్ 21 వరకు, ఈ కాలానికి చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ 5.30 శాతం చొప్పున అందుబాటులో ఉంది. మిగిలిన పదవీకాలానికి FDలపై వడ్డీ రేట్లు మునుపటిలాగే స్థిరంగా ఉంచబడ్డాయి.

ఇవి కూడా చదవండి

ICICI బ్యాంక్ 185 రోజుల నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ కాల వ్యవధిలో 4 రకాల పథకాలను అందిస్తుంది. ఇందులో 185 నుంచి 210 రోజులు, 211 రోజుల నుంచి 270 రోజులు, 271 రోజుల నుంచి 289 రోజులు, 290 రోజుల నుంచి ఒక సంవత్సరం వరకు FDలు ఉంటాయి. ICICI బ్యాంక్ ఈ అన్ని FDలపై వడ్డీ రేట్లను 5 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఇప్పుడు కొత్త రేటు 4.65 శాతానికి పెరిగింది. అదేవిధంగా, ICICI బ్యాంక్ ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల కాలవ్యవధితో నాలుగు వేర్వేరు FD పథకాలను అందిస్తుంది. FDలు 1 సంవత్సరం నుంచి 389 రోజులు, 390 రోజుల నుంచి 15 నెలల వరకు, 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ, 18 నెలల నుంచి 2 సంవత్సరాల FDలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.35 శాతం వడ్డీ లభిస్తుంది. గతంలో దీని రేటు 5.30 శాతంగా ఉంది.