ITC: ఐటీసీలో ఉద్యోగం అంటే మామూలుగా ఉండదు.. కోటి రూపాయలకు పైగా జీతం తీసుకుంటున్న 220 మంది ఉద్యోగులు..

FMCG, హోటల్, అగ్రిబిజినెస్ వంటి అనేక రంగాలలో అగ్రగామి సంస్థ అయిన ITC , గత ఆర్థిక సంవత్సరంలో మిలియనీర్ ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది...

ITC: ఐటీసీలో ఉద్యోగం అంటే మామూలుగా ఉండదు.. కోటి రూపాయలకు పైగా జీతం తీసుకుంటున్న 220 మంది ఉద్యోగులు..
Itc
Follow us

|

Updated on: Jun 23, 2022 | 7:21 AM

FMCG, హోటల్, అగ్రిబిజినెస్ వంటి అనేక రంగాలలో అగ్రగామి సంస్థ అయిన ITC , గత ఆర్థిక సంవత్సరంలో మిలియనీర్ ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 2021-22లో ఏటా రూ. 1 కోటి కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఐటీసీ ఉద్యోగుల సంఖ్య 44 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో నెలకు రూ.8.5 లక్షలు లేదా ఏడాదికి కోటి రూపాయల కంటే ఎక్కువ వేతనం పొందుతున్న ఉద్యోగుల సంఖ్య 220కి పెరిగిందని ఐటీసీ తాజా వార్షిక నివేదిక పేర్కొంది. 2020-21లో 153 మంది ఉద్యోగులు ఇంత జీతం పొందారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీలోని 220 మంది ఉద్యోగులు ఏటా రూ.1.02 కోట్లు పొందుతున్నారని వార్షిక నివేదికలో పేర్కొంది. ఇది నెలకు రూ. 8.5 లక్షల కంటే ఎక్కువ.

మరోవైపు FY22లో ITC ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరి మొత్తం రూ. 12.59 కోట్ల జీతం పొందారు. ఇది గత సంవత్సరం కంటే 5.35 శాతం ఎక్కువ. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో పూరీ మొత్తం జీతం రూ.11.95 కోట్లు. 2021-22లో పూరీ మొత్తం జీతంలో రూ. 2.64 కోట్ల జీతం, రూ. 49.63 లక్షల ఇతర ప్రయోజనాలు, రూ. 7.52 కోట్ల పనితీరు బోనస్ ఉన్నాయి. ఉద్యోగులందరి సగటు జీతం కంటే పూరీ జీతం 224 రెట్లు అని వార్షిక నివేదిక పేర్కొంది. ITC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు B సుమంత్, R టాండన్ FY22 లో 5.5 కోట్ల రూపాయలకు పైగా వేతనం తీసుకున్నారు. మార్చి 31, 2022 నాటికి ITC ఉద్యోగుల మొత్తం సంఖ్య 23,829, ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 8.4 శాతం తక్కువ. ఇందులో 21,568 మంది పురుషులు, 2,261 మంది మహిళా ఉద్యోగులు ఉండగా.. పర్మినెంట్ ఉద్యోగులే కాకుండా మరో 25,513 మంది ఉద్యోగులు కంపెనీలో పనిచేస్తున్నారు. మార్చి 31, 2021 నాటికి ITC ఉద్యోగుల మొత్తం సంఖ్య 26,017. 2021-22లో ఐటీసీ ఉద్యోగుల సగటు జీతం 7 శాతం పెరిగింది. సీనియర్ ఉద్యోగుల వేతనాల్లో 8 శాతం పెంపుదల ఉంది. మార్చి 31, 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఐటీసీ ఆదాయం రూ. 59,101 కోట్లుగా ఉంది, ఇది ఏడాది క్రితం రూ. 48,151.24 కోట్లుగా ఉంది.