ఆ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. ఇక డెబిట్ కార్డ్ అక్కర్లేదు.. మొబైల్‏తోనే డబ్బులు విత్ డ్రా..

మనం సాధారణంగా డబ్బులు మొత్తం బ్యాంకులలో దాచుకుంటుంటాం. అవసరమైనప్పుడు మాత్రమే కొన్ని కొన్ని డ్రా చేస్తుంటాం. ఇక కొన్ని సందర్బాల్లో

ఆ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. ఇక డెబిట్ కార్డ్ అక్కర్లేదు.. మొబైల్‏తోనే డబ్బులు విత్ డ్రా..
Cash Withdrawal
Follow us

|

Updated on: May 18, 2021 | 8:56 PM

మనం సాధారణంగా డబ్బులు మొత్తం బ్యాంకులలో దాచుకుంటుంటాం. అవసరమైనప్పుడు మాత్రమే కొన్ని కొన్ని డ్రా చేస్తుంటాం. ఇక కొన్ని సందర్బాల్లో డబ్బులు డ్రా చేయడానికి ఏటీఎం కోసం పరుగులు పెడుతుంటాం. అయితే ఇందుకోసం కచ్చితంగా డెబిట్ కార్డు కావాల్సిందే. డెబిట్ కార్డ్ ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడానికి వీలుంటుంది. ఒకవేళ డెబిట్ కార్డు లేకపోతే.. ఇక డబ్బులు డ్రా చేయడానికి బ్యాంకులకు పరుగులు పెట్టాల్సిందే. కానీ ప్రస్తుత పరిస్థితులలో ప్రతి సారి బ్యాంకుకు వెళ్ళడం కొంత రిస్క్ అనే చెప్పుకోవాలి. అయితే ఈ కరోనా కష్టాల్లో తమ కస్టమర్లకు నగదు విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా.. కొన్ని బ్యాంకులు ఏటీఎం కార్డు లేకుండానే డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నాయి.

ఐసీఐసీఐ బ్యాంక్ కూడా తన కస్టమర్లకు ఇలాంటి తరహా సేవలను అందిస్తోంది. ఇటీవలే ఈ బ్యాంక్ తమ కస్టమర్లకు డెబిట్ కార్డు లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు ఎలా డ్రా చేయాలో ఈమెయిల్ ద్వారా పూర్తి వివరాలను తెలియజేసింది. మొబైల్ ఫోన్‏లో ఐసీఐసీఐ బ్యాంక్ యాప్ iMobile App ద్వారా సులభంగానే ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు ఏటీఎంకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కార్డ్ లెస్ విత్ డ్రా అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు తీసుకోవడం వలన కార్డ్ స్కిమ్మింగ్  మోసాల నుంచి తప్పించుకోవచ్చు. అలాగే ఇందుకు ఏటీఎం పిన్ కూడా అవసరం ఉండదు. ఇక దీనికి ఎలాంటి ప్రత్యేకమైన ఛార్జీలు ఉండవు. కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే కాకుండా పలు బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు కార్డ్ లెస్ ఏటీఎం క్యాష్ విత్ డ్రా సర్వీసులు అందిస్తున్నాయి. దేశీయ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు యోనో యాప్ ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

Also Read: మహిళలకు ప్రధాన సమస్యగా మారిన ఐరన్ లోపం.. రక్తంలో ఐరన్ పెంచుకోవడానికి వీటిని తప్పకుండా తినాలి..

Covid Care: కరోనా పాజిటివ్ వచ్చిన తల్లులు తమ పిల్లలకు పాలు ఇవ్వొచ్చా ? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

పండ్లు, కూరగాయలు తినడం వలన ఒత్తిడి ఫసక్… అధ్యయనాల్లో వెలువడిన సంచలన విషయాలు..