Gold Coin Scheme: ఇండియన్ గోల్డ్ కాయిన్ స్కీమ్​లో కీలక మార్పులు.. ఇక బంగారం కొనుగోలు ఈజీ.. ఎలా అంటే..!

బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. మళ్లీ ధరలు పెరుగుతుండడంతో ఇన్వెస్టర్ల చూపు మార్కెట్ల నుంచి యల్లో మెటల్ వైపు మళ్లుతోంది.

Gold Coin Scheme: ఇండియన్ గోల్డ్ కాయిన్ స్కీమ్​లో కీలక మార్పులు.. ఇక బంగారం కొనుగోలు ఈజీ.. ఎలా అంటే..!
Indian Gold Coin Scheme
Follow us
Balaraju Goud

|

Updated on: May 18, 2021 | 8:31 PM

Indian Gold Coin Scheme: బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. మళ్లీ ధరలు పెరుగుతుండడంతో ఇన్వెస్టర్ల చూపు మార్కెట్ల నుంచి యల్లో మెటల్ వైపు మళ్లుతోంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి సావరిన్ గోల్డ్ బాండ్ అమ్మకాలు మొదలుపెడుతోంది. సోమవారం నుంచి సావరిన్ గోల్డ్ బాండ్-SGB స్కీమ్ 2021-22 మొదటి సబ్‌స్క్రిప్షన్ మొదలయింది. ఈ పథకం మే 21న ముగియనుంది. ఇక గోల్డ్ బాండ్ ఇష్యూ ధర గ్రాముకు రూ.4,777 ఫిక్స్ చేసింది రిజర్వ్ బ్యాంక్. అంటే మార్కెట్ ధర కన్నా గోల్డ్ బాండ్ ధర తక్కువే. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,990 ఉంది. అదే 10 గ్రాముల సావరిన్ గోల్డ్ బాండ్ కొంటే రూ.47,770 మాత్రమే చెల్లించాలి. ఒకవేళ ఆన్‌లైన్‌లో సావరిన్ గోల్డ్ బాండ్ కొంటే గ్రాముకు రూ.50 అంటే 10 గ్రాములకు రూ.500 తగ్గింపు లభిస్తుంది. అంటే ఆన్‌లైన్‌లో 10 గ్రాముల సావరిన్ గోల్డ్ బాండ్‌ను రూ.47,270కి కొనవచ్చు.

భారత ప్రధాని నరేంద్రమోదీ 2015లో ప్రారంభించిన ఇండియన్ గోల్డ్ కాయిన్ స్కీమ్​లో తాజాగా కొన్ని కీలక సవరణలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకాన్ని సాధారణ ప్రజలకు చేరువ చేసేందుకు కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రస్తుతం మెటల్స్ అండ్​ మినరల్స్​ ట్రేడింగ్​ కార్పొరేషన్​ (MMTC) పరిధిలో అమలవుతున్న ఈ పథకంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొత్తగా ప్రవేశపెడుతున్న నిబంధనలతో ఈ పథకం ప్రజాదరణ పొందుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలు సులభంగా ఆన్​లైన్​ ఈ-కామర్స్ ప్లాట్​ఫామ్​లతో సహా పలు మార్కెటింగ్​ మార్గాల ద్వారా ఇందులో చేరే అవకాశాన్ని కల్పిస్తోంది. ఎమ్​ఎమ్​టిసి, జ్యువెలర్స్, బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల ద్వారా నేరుగా ఈ పథకంలో కొనుగోలుకు అందుబాటులోకి తెస్తుంది. కాగా, విదేశీ బంగారు నాణేల దిగుమతిని తగ్గించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

భారతీయ బంగారు నాణెం పథకంలో కొత్త సవరణలు

సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్పీఎంసీఐఎల్) క్రయ విక్రయాల్లో సవరణలు

ప్రస్తుతం 1 గ్రాము, 2 గ్రాముల చిన్న విలువ కలిగిన భారతీయ బంగారు నాణేలను కూడా ముద్రించడానికి అనుమతి.

గతంలో 5, 10, 20 గ్రాముల బంగారు నాణేలను మాత్రమే ముద్రించేందుకు వీలుండేది.

బంగారు నాణేలు అధునాతన భద్రతా లక్షణాలతో లోడ్ చేయబడి ఉంటాయి.

దేశంలోనే తయారైన స్వచ్చమైన BIS హాల్‌మార్క్ బంగారు నాణేలని కేంద్రం స్పష్టం చేసింది.

ఎస్పీఎంసీఐఎల్, ఆన్​లైన్​ ఈ–-కామర్స్ ప్లాట్‌ఫాంలు, విమానాశ్రయాలతో సహా ఇతర వ్యాపార ఛానెళ్ల ద్వారా ఈ భారతీయ బంగారు నాణేల కొనుగోలుకు అవకాశం.

ప్రత్యక్ష అమ్మకాలకు ఎమ్​ఎమ్​టీసీ జ్యువెలర్స్​, బ్యాంకులు, ఇండియా పోస్ట్​ మొదలైన పలు మార్కెటింగ్​ మార్గాల ద్వారా అమ్మకాలు.

ఎస్పీఎంసీఐఎల్​ తన ఈ–కామర్స్​ పోర్టల్​ ద్వారా ఐజీసీలపై ఎగుమతి ఆర్డర్లకు అనుమతి.

గోల్డ్ కాయిన్స్​ 24 క్యారెట్లలో 995 ఫైన్​నెస్​లో మాత్రమే లభ్యం.

భవిష్యత్‌లో 999 ఫైన్​నెస్‌తో​ 24 క్యారెట్లలో కూడా తయారు.

అందుబాటులోకి 999, 995 ప్యూరిటీతో కూడిన 24 క్యారెట్ల ఐజీసీలు.

గోల్డ్​ కాయిన్స్​ను కొనుగోలు చేయడానికి దేవాలయాలు, ట్రస్టులు మొదలైన వాటికి ఎస్.పి.ఎం.సి.ఎల్ ముంబై అనుమతి.

ఇదిలావుంటే, సావరిన్ గోల్డ్ బాండ్‌ను ఎవరైనా కొనేందుకు వీలు కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. వ్యక్తిగతంగా, హిందూ అవిభాజ్య కుటుంబాలు, ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, చారిటీ సంస్థలు సావరిన్ గోల్డ్ బాండ్ కొనొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక గ్రాము నుంచి 4 కేజీల వరకు కొనేందుకు వీలు కల్పించింది. ట్రస్టులు, సంస్థలు 20 కేజీల అవకాశం ఉంది. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పోస్ట్ ఆఫీసులు, స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లు సావరిన్ గోల్డ్ బాండ్స్ అమ్మకాలు జరుపుతాయి. అంతేకాదు వీటిపై ఏడాదికి 2.5 శాతం చొప్పున భారతీయ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ కూడా చెల్లిస్తుంది.

Read Also…  CBSE 12th Board Exam: సీబీఎస్‌ఈ 12 బోర్డు పరీక్ష రద్ధుపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు