PPF Investment: పీపీఎఫ్‌లో పెట్టుబడితో భారీ లాభాలు.. ఆ మూడు ప్రయోజనాలు తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!

పీపీఎఫ్‌​ పథకం మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు. కానీ 15 ఏళ్ల తర్వాత కూడా పీపీఎఫ్‌ను కొనసాగిస్తే అనేక ప్రయోజనాలు లభిస్తాయి. 5 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి తర్వాత, మీరు 3 ఎంపికలను పొందుతారు. మీ డబ్బును పెంచుకోవడానికి మీరు వాటిలో దేనినైనా ఎంచుకోవచ్చు. పీపీఎఫ్‌ అందించే ప్రయోజనాల గురించి ఓ సారి తెలుసుకుందాం.

PPF Investment: పీపీఎఫ్‌లో పెట్టుబడితో భారీ లాభాలు.. ఆ మూడు ప్రయోజనాలు తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Ppf
Follow us
Srinu

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 27, 2023 | 8:02 PM

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మంచి పెట్టుబడి ఎంపిక ఆర్థిక నిపుణులు చెబుతూ ఉంటారు. తక్కువ-రిస్క్‌ కోసం చూసే పెట్టుబడిదారులకు, స్థిరమైన రాబడితో సంతృప్తి చెందేవారికి ఇది ఒక ప్రముఖ పెట్టుబడి ఎంపిక. ఇది పన్ను రహిత పెట్టుబడి వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. పీపీఎఫ్‌​ పథకం మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు. కానీ 15 ఏళ్ల తర్వాత కూడా పీపీఎఫ్‌ను కొనసాగిస్తే అనేక ప్రయోజనాలు లభిస్తాయి. 5 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి తర్వాత, మీరు 3 ఎంపికలను పొందుతారు. మీ డబ్బును పెంచుకోవడానికి మీరు వాటిలో దేనినైనా ఎంచుకోవచ్చు. పీపీఎఫ్‌ అందించే ప్రయోజనాల గురించి ఓ సారి తెలుసుకుందాం.

మెచ్యూరిటీపై పీపీఎఫ్‌​ ఉపసంహరణ

మీ పీపీఎఫ్‌ ఖాతా మెచ్యూరిటీ అయిన తర్వాత మీరు అందులో డిపాజిట్ చేసిన మొత్తాన్ని, దానిపై పొందిన వడ్డీని ఉపసంహరించుకోవచ్చు. ఖాతా మూసివేస్తునన సందర్భంలో మీరు మొత్తం డబ్బును మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయవచ్చు. ఉపసంహరించుకున్న డబ్బుతో పాటు దానిపై మీరు పొందే వడ్డీ పూర్తిగా పన్ను రహితం. అలాగే మీరు ఇన్వెస్ట్ చేసిన సంవత్సరాలకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

15 ఏళ్ల తర్వాత కూడా పెట్టుబడి

మీరు మీ ఖాతాను మెచ్యూరిటీ సమయంలో మరింత పొడిగించుకోవచ్చు. ఖాతా పొడిగింపు 5-5 సంవత్సరాల కాలానికి తీసుకోవచ్చు. కానీ మీరు పీపీఎఫ్‌ ఖాతా మెచ్యూరిటీకి 1 సంవత్సరం ముందు మాత్రమే పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని గుర్తుంచుకోవాలి. అయితే మీరు పొడిగింపు సమయంలో డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.మెచ్యూర్‌కు ముందు ఉపసంహరణ నియమాలు ఇందులో వర్తించవు.

ఇవి కూడా చదవండి

పెట్టుబడి లేకుండా ఖాతా వర్కింగ్‌

మెచ్యూరిటీ తర్వాత మీ ఖాతా పని చేయడం కొనసాగుతుంది. మీరు ఇన్వెస్ట్ చేయకపోయినా మెచ్యూరిటీ ఆటోమేటిక్‌గా 5 సంవత్సరాలు పొడిగించబడుతుంది. అలాగే మీరు దానిపై వడ్డీని పొందుతూనే ఉంటారు. 

పీపీఎఫ్‌ ఖాతా తెరవడం ఇలా

  • పీపీఎఫ్‌ ఖాతాను ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంకులో తెరవవచ్చు. అలాగే ఏ పోస్టాఫీసులోనైనా ఖాతాను తెరవవచ్చు.
  • మైనర్‌లు కూడా ఖాతాను తెరవగలరు, అయితే వారి తరఫున తల్లిదండ్రులకు ఉన్న వాటా పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు అలాగే ఉంటుంది.
  • ఆర్థిక మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం హిందూ అవిభాజ్య కుటుంబం పీపీఎఫ్‌ ఖాతాను తెరవకూడదు.

పెట్టుబడికి రాబడి ఇలా

ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో 7.1 శాతం వడ్డీ ఇస్తోంది. మీరు ఈ వడ్డీ రేటుతో 15 లేదా 20 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే, మీరు భారీ ఫండ్‌ను సృష్టించవచ్చు. పీపీఎఫ్‌ పథకం స్థిర వడ్డీ రేటు పథకంగా పరిగణించబడుతున్నప్పటికీ ప్రభుత్వం ప్రతి మూడు నెలల తర్వాత వడ్డీని సమీక్షిస్తుంది. రేటు మార్పుకు లోబడి ఉంటుంది. ప్రస్తుత రేట్లు ప్రకారం నెలకు రూ.1000 లెక్కన 15 ఏళ్లు పెట్టుబడితో రూ.3.35 లక్షల రాబడి వస్తుంది. అలాగే ఇరవై ఏళ్లు పెట్టుబడి పెడితే రూ.5.32 లక్షలు వస్తుంది. రూ.2 వేల లెక్కన పెట్టుబడి పెడితే 15 ఏళ్లకు రూ.6.50 లక్షలు, ఇరవై ఏళ్లకు రూ.10.65 లక్షల రాబడి వస్తుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..