PPF Scheme: ఈ తేదీ వరకు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి.. ఎక్కువ వడ్డీని పొందే ప్రయోజనం.. ఎలాగంటే..

పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడం ఉపయోగకరమనే చెప్పాలి. కానీ మీరు దానిలో తెలివిగా డబ్బును పెట్టుబడి పెట్టినట్లయితే, మీరు మాత్రమే గరిష్ట ప్రయోజనం పొందుతారు. మీరు ప్రతి నెలా పీపీఎఫ్‌లో డబ్బును పెడుతున్నట్లయితే దానిని నెల..

PPF Scheme: ఈ తేదీ వరకు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి.. ఎక్కువ వడ్డీని పొందే ప్రయోజనం.. ఎలాగంటే..
Ppf
Follow us
Subhash Goud

|

Updated on: Jul 22, 2023 | 5:01 PM

పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడం ఉపయోగకరమనే చెప్పాలి. కానీ మీరు దానిలో తెలివిగా డబ్బును పెట్టుబడి పెట్టినట్లయితే, మీరు మాత్రమే గరిష్ట ప్రయోజనం పొందుతారు. మీరు ప్రతి నెలా పీపీఎఫ్‌లో డబ్బును పెడుతున్నట్లయితే దానిని నెల ప్రారంభంలో 5వ తేదీలోపు డిపాజిట్ చేయండి. తద్వారా పీపీఎఫ్‌ నిబంధనల ప్రకారం మీకు ఆ నెల వడ్డీ లభిస్తుంది.

5వ తేదీ వరకు డబ్బు జమ చేయడం ఎందుకు ప్రయోజనకరం:

సాధారణ సమాధానం ఏమిటంటే ప్రస్తుతం పీపీఎఫ్‌పై వడ్డీ 7.1 శాతం చొప్పున చెల్లిస్తున్నారు. ఇది మునుపటి నెల చివరి తేదీ, కొత్త నెల ఐదవ తేదీ మధ్య కనీస బ్యాలెన్స్‌పై నిర్ణయించబడుతుంది. ప్రతి నెలా పీపీఎఫ్‌ ఖాతాలలో జమ చేసిన మొత్తానికి వడ్డీ చెల్లించబడుతుంది. అయితే ప్రతి సంవత్సరం మార్చి 31వ తేదీన ఆర్థిక సంవత్సరం చివరిలో ఖాతాలో వడ్డీ జమ చేయబడుతుంది. నెల 5వ తేదీలోపు కొత్త మొత్తాన్ని ఖాతాలో జమ చేస్తేనే ఆ ఖాతాకు ఈ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే పెట్టుబడిదారులు 5వ తేదీలోపు మొత్తాన్ని ఖాతాలో జమ చేసినప్పుడు మాత్రమే వడ్డీపై వడ్డీ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఎవరైనా నెల ఐదో తేదీ తర్వాత పీపీఎఫ్ ఖాతాలో డబ్బు జమచేస్తే, అంతకుముందు నెల వడ్డీని, ఆ నెల వడ్డీని పొందలేరు.

ఉదాహరణకు.. 5 ఏప్రిల్ 2022న పీపీఎఫ్‌ ఖాతాలో రూ.1 లక్ష ఉందనుకోండి.. ఈ ఖాతా పెట్టుబడిదారుడు 6 ఏప్రిల్ 2022న రూ.1.5 లక్షల అదనపు పెట్టుబడి పెట్టాడు. పీపీఎఫ్‌ నిబంధనల ప్రకారం.. పెట్టుబడిదారులు ఏప్రిల్ 5, 2022 నుంచి ఏప్రిల్ 30, 2022 వరకు కనీస బ్యాలెన్స్‌పై మాత్రమే వడ్డీని పొందుతారు. అది ఏప్రిల్ 2022కి పెట్టుబడిదారు రూ. 1.5 లక్షల పెట్టుబడి వడ్డీని కోల్పోతారు. అంటే ఏప్రిల్ 5లోగా ఇన్వెస్టర్ రూ.1.5 లక్షలను పీపీఎఫ్ ఖాతాలో జమ చేసి ఉంటే, మొత్తం రూ.2.5 లక్షల పెట్టుబడిపై ఏప్రిల్ వడ్డీ వచ్చేది. అందువల్ల, పెట్టుబడిదారులు పీపీఎఫ్‌లో డబ్బును ఉంచేటప్పుడు పూర్తి ప్రణాళికతో పెట్టుబడి పెట్టాలి. తద్వారా వారు గరిష్ట రాబడిని పొందవచ్చు. వారు 5వ రోజులోపు పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడాన్ని ఒక నియమంగా తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి