FD Interest Rates: ఆ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త.. ఎఫ్‌డీలపై అదిరిపోయే వడ్డీ ఆఫర్..
సీనియర్ సిటిజన్లు అయితే జీవితాంతం ఎవరిపై ఆధారపడకుండా ఉండడానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మొగ్గు చూపుతూ ఉంటారు. ఆర్‌బీఐ తీసుకున్న చర్యలతో రెండేళ్ల నుంచి అన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. అయితే ఇటీవల రెపో రేట్ల విషయంలో ఆర్‌బీఐ ఆచితూచి వ్యవహరిస్తుండడంతో ఈ వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్ పడింది.

కష్టపడి సంపాదించిన సొమ్ముకు నమ్మకమైన రాబడి కోసం వివిధ పెట్టుబడి మార్గాలను అంతా ఆశ్రయిస్తూ ఉంటారు. ముఖ్యంగా అంతా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆధారపడుతూ ఉంటారు. అలాగే సీనియర్ సిటిజన్లు అయితే జీవితాంతం ఎవరిపై ఆధారపడకుండా ఉండడానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మొగ్గు చూపుతూ ఉంటారు. ఆర్‌బీఐ తీసుకున్న చర్యలతో రెండేళ్ల నుంచి అన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. అయితే ఇటీవల రెపో రేట్ల విషయంలో ఆర్‌బీఐ ఆచితూచి వ్యవహరిస్తుండడంతో ఈ వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్ పడింది. అయితే కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు వినియోగదారులను ఆకట్టుకోవడానికి వడ్డీ రేట్లు ఇంకా పెంచుతూనే ఉన్నాయి. అయితే వీటిల్లో పెట్టుబడి పెట్టడం అనేది వినియోగదారుని ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. అయితే వడ్డీ రేటు గురించి ఆలోచించే వారు కచ్చితంగా పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ముఖ్యంగా సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు కస్టమర్లకు అధిక వడ్డీ రేటును అందిస్తుంది. ఏకంగా 9 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది. కాబట్టి పెట్టుబడిదారులు ఆయా బ్యాంకుల వడ్డీ రేటును కూడా పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో? ఓ సారి తెలుసుకుందాం.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఈ బ్యాంక్ సాధారణ వినియోగదారుల కోసం 4.5 శాతం నుంచి 9శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తుంది. ఇది ప్రస్తుతం సీనియర్ సిటిజన్‌లకు వరుసగా 1001 రోజుల పాటు పెట్టుబడి పెట్టిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9.5 శాతం వడ్డీ రేటును అందిస్తుంది, అదే నిబంధనలకు రిటైల్ పెట్టుబడిదారులు 9 శాతం పొందుతారు. సీనియర్ సిటిజన్లు ఏడు రోజుల నుంచి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 4.5 శాతం నుండి 9.5 శాతం వరకు వడ్డీ రేటును పొందుతారు. ఈ తాజా డిపాజిట్ వడ్డీ రేటు 14 జూన్ 2023 నుండి సవరింరించారు. కాబట్టి ఈ బ్యాంకులో అత్యధిక వడ్డీ రేటు 9 శాతం 1001 రోజుల వ్యవధిలో ఉన్న పెట్టుబడులపై అందిస్తారు.
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇప్పుడు 4 శాతం నుంచి 9.1 శాతం మధ్య ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సాధారణ కస్టమర్లకు ఏడు రోజుల నుంచి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై అందిస్తుంది. ఏడు రోజుల నుంచి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు 4.5 శాతం నుంచి 9.6 శాతం వరకు వడ్డీ రేటును పొందుతారు. ఐదేళ్ల కాలవ్యవధిపై అత్యధిక వడ్డీ రేటు 9.1 శాతం అందిస్తారు. ఈ రేట్లు జూలై 5, 2023 నుండి వర్తిస్తాయి. సాధారణ కస్టమర్‌లు ఇప్పుడు 5 సంవత్సరాల డిపాజిట్‌పై 9.10 శాతం వడ్డీ రేటును పొందవచ్చు, సీనియర్ సిటిజన్లు 9.60 శాతం వడ్డీ రేటును పొందవచ్చు.



మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..