SBI FD Scheme: రూ. 5 లక్షలు పెట్టుబడితో రూ. 10లక్షలు రాబడి.. పూర్తి వివరాలు ఇవిగో.. తెలుసుకోకపోతే నష్టపోతారు!
ఇటీవల కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఉత్తమమైన వడ్డీ రేట్లను ఫిక్స్ డ్ డిపాజిట్లపై అందిస్తున్నాయి. అందుకు ఉదాహరణ దేశంలోని అతి పెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ). ఈ బ్యాంకు సీనియర్ సిటిజెనుల కోసం ఓ ప్రత్యేకమైన ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీమ్ ను ప్రారంభించింది. దీనిలో పెట్టుబడి పెడితే మీ సొమ్ము డబుల్ అవుతుంది.

అత్యంత ప్రజాదరణ పొందిన పథకాలలో ఫిక్స్ డ్ డిపాజిట్ ఒకటి. అత్యధిక వడ్డీతో పాటు ప్రభుత్వ మద్దతు కూడా ఉండటం, పన్ను మినహాయింపులు కూడా అందివస్తుండటంతో అందరూ వీటిలో పెట్టుబడి పెట్టడానికి మొగ్గుచూపుతారు. అయితే ఈ ఫిక్స్ డ్ డిపాజిట్లలో వడ్డీ రేటు బ్యాంకులను బట్టి మారుతుంటుంది. సాధారణంగా ఈ ఫిక్స్ డ్ డిపాజట్లపై ప్రభుత్వ బ్యాంకులతో పోల్చితే.. ప్రైవేటు బ్యాంకుల్లో వడ్డీ రేటు అధికంగా ఉంటుందని చాలా నమ్ముతారు. అది కొంత వరకూ వాస్తవం కూడా. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఉత్తమమైన వడ్డీ రేట్లను ఫిక్స్ డ్ డిపాజిట్లపై అందిస్తున్నాయి. అందుకు ఉదాహరణ దేశంలోని అతి పెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ). ఈ బ్యాంకు సీనియర్ సిటిజెనుల కోసం ఓ ప్రత్యేకమైన ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీమ్ ను ప్రారంభించింది. దీనిలో పెట్టుబడి పెడితే మీ సొమ్ము డబుల్ అవుతుంది. ఈ పథకం పేరు ఎస్బీఐ వీకేర్ స్పెషల్ ఎఫ్‌డీ . ఈ పథకం బహుళ ప్రయోజనాలను అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎస్బీఐ వీకేర్ స్పెషల్ ఎఫ్‌డీ..
ఈ ఎఫ్‌డీ పథకంలో పెట్టుబడి పెట్టడం వలన మీ డబ్బు రెట్టింపు అవుతుంది. కోవిడ్ మహమ్మారి సమయంలో సీనియర్ సిటిజన్లు తమ నిధులను కాపాడుకోవడానికి ఎస్బీపై ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అలాగే పలు ప్రైవేటు బ్యాంకుల పోటీని తట్టుకొని నిలబడాటానికి బ్యాంక్ ప్రత్యేకంగా వీకేర్ స్పెషల్ ఎఫ్‌డీని ప్రవేశపెట్టింది. అయితే బ్యాంక్ పలు దఫాలుగా ఈ ప్రత్యేక ఎఫ్‌డీ పథక లభ్యతను పొడిగిస్తూ వస్తోంది. సీనియర్ సిటిజన్లు 2023, 30 సెప్టెంబర్ వరకూ ఈ ఖాతా ప్రారంభించే అవకాశం ఉంది. ఈ స్పెషల్ ఎఫ్‌డీ ద్వారా ఒనగూరే ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం..
7.50 శాతం వడ్డీ పొందే అవకాశం..
ఎస్బీఐ వెబ్‌సైట్ ప్రకారం, సీనియర్ సిటిజన్‌లు అదనంగా 0.50% వడ్డీ రేటుకు అర్హులు. ఈ పథకంలో 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.50% వడ్డీ రేటు వస్తుంది. నెట్ బ్యాంకింగ్, యనో యాప్ లేదా బ్రాంచ్‌ని సందర్శించడం ద్వారా మీరు ఈ పథకం కింద ఎఫ్‌డీని ప్రారంభించవచ్చు. ఎఫ్‌డీపై వడ్డీని నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక ప్రాతిపదికన జమచేస్తారు. అయితే,టీడీఎస్ తీసివేసిన తర్వాత ఎఫ్‌డీపై వడ్డీ అందుబాటులో ఉంటుందని గమనించాలి. రెగ్యులర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం, 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు ఉండే కాలవ్యవధికి వడ్డీ రేట్లు 3.50% నుంచి 7.50% మధ్య ఉంటాయి.
పదేళ్లలో రెట్టింపు..
ఈ ఎఫ్‌డీ పథకంలో పెట్టుబడి పెడితే మీ డబ్బు 10 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది. ఉదాహరణకు, మీరు రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే, పదేళ్ల తర్వాత, మీరు రూ. 10 లక్షల కంటే ఎక్కువ అందుకుంటారు. ముఖ్యంగా, మీరు 10 సంవత్సరాలలో దాదాపు రూ. 5 లక్షల వడ్డీని పొందుతారు, ఎందుకంటే బ్యాంక్ 10 సంవత్సరాల కాలవ్యవధితో సాధారణ ఎఫ్‌డీలపై 6.5 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
మరో పథకం ఇదిగో..
ఎస్బీఐ నుంచే అందుబాటులో ఉన్న మరో అద్భుతమైన పథకం అమృత్ కలాష్ ఎఫ్‌డీ పథకం. దీనిలో ఖాతా ప్రారంభించేందుకు కూడా చివరి తేదీని బ్యాంక్ పొడిగించింది. ఇది కూడా సీనియర్ సిటిజన్‌లు, ఇతర కస్టమర్‌లకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..