AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Bike: స్టన్నింగ్ లుక్‌లో కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌.. నెలకు రూ. 3,700 చెల్లిస్తే చాలు.. మీ ఇంటికి వచ్చేస్తుంది!

ఒబెన్‌ రోర్‌ పేరిట వచ్చిన ఈ బైక్‌ అద్భుతమైన పనితీరును కనబరుస్తుందని కంపెనీ పేర్కొంది. సింగిల్‌ చార్జ్‌పై 187కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని చెబుతోంది. గంటకు గరిష్టంగా 100కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుందని వివరించింది. వినియోగదారులకు అద్భుతమైన ఈఎంఐ ఆప్షన్లను కూడా కంపెనీ అందిస్తోంది.

Electric Bike: స్టన్నింగ్ లుక్‌లో కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌.. నెలకు రూ. 3,700 చెల్లిస్తే చాలు.. మీ ఇంటికి వచ్చేస్తుంది!
Oben Electric Rorr
Madhu
|

Updated on: Jul 21, 2023 | 7:00 PM

Share

మన దేశంలో విద్యుత్‌శ్రేణి వాహనాలకు అంతకంతకూ డిమాండ్‌ పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ బైక్‌, స్కూటర్‌ సెగ్మెంట్‌ సేల్స్‌లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. దీంతో అన్ని కంపెనీలు పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్‌ బైక్‌, స్కూటర్లను లాంచ్‌ చేస్తున్నాయి. డిమాండ్‌ అనుగుణంగా వినియోగదారుల అటెన్షన్‌ను డ్రా చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఒబెన్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ను మన దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఒబెన్‌ రోర్‌ పేరిట వచ్చిన ఈ బైక్‌ అద్భుతమైన పనితీరును కనబరుస్తుందని కంపెనీ పేర్కొంది. సింగిల్‌ చార్జ్‌పై 187కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని చెబుతోంది. గంటకు గరిష్టంగా 100కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుందని వివరించింది. వినియోగదారులకు అద్భుతమైన ఈఎంఐ ఆప్షన్లను కూడా కంపెనీ అందిస్తోంది. కేవలం రూ. 3,780 చెల్లించి బైక్‌ని సొంతం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇవి..

ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ అధిక సామర్థ్యంతో కూడిన పనితీరును కనబరుస్తుంది. అంతేకాక అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఇచ్చారు. దీనిలో 4.4కిలోవాట్‌అవర్‌ డైకాస్ట్‌ అల్యూమినియం బ్యాటరీ ఉంటుంది. ఈ బైక్‌ కొనుగోలు చేసిన వారికి దీనిలోని బ్యాటరీకి మూడేళ్ల పాటు ఉచిత సర్వీస్‌ వారంటీ ఉంటుంది. దీనిలో ఫాస్ట్‌ చార్జింగ్‌ ఫీచర్‌ ఉంటుంది. కేవలం రెండు గంటల్లోనే 80శాతం వరకూ బ్యాటరీని చార్జ్‌ చేసే ఫాస్ట్‌ చార్జర్‌ ఇస్తారు. 8కిలోవాట్ల ఐపీఎంఎస్‌ఎం మోటార్‌ దీనిలో ఉంటుంది. ఈ బైక్‌ గంటలకు 100 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలుగుతుంది.

ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్‌ ఇది..

ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్‌లోని 4.4కిలోవాట్‌అవర్‌ బ్యాటరీని ఒక్కసారి ఫుల్‌ చార్జ్‌ చేస్తే ఏకంగా 187కిలోమీటర్ల దూరాన్ని ఆగకుండా కవర్‌ చేస్తుంది. దీనిలో మూడు విభిన్న రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. అవిఎకో, సిటీ, హవోక్. అలాగే ఈ బైక్ వివిధ స్పీడ్ ఆప్షన్‌లను అందిస్తుంది. గంటకు 50 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు, 100కిలోమీటర్ల వేగాన్ని అందిస్తుంది. అలాగే దీనిలో ఉన్న స్విఫ్ట్ యాక్సిలరేషన్ బైక్ కేవలం 3 సెకన్లలో గంటకు 49 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఇవి కూడా చదవండి

ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ ధర, లభ్యత..

ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,49,999. ఇటీవల ప్రభుత్వం అందిస్తున్న ఫేమ్‌-2 సబ్సిడీలో కోత విధించిన తర్వాత ధరలు కొద్దిగా పెరిగాయని కంపెనీ ప్రకటించింది. ఈ బైక్‌ని మీరు సొంతం చేసుకోవడానికి రూ. 30,000 డౌన్ పేమెంట్ చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని తదుపరి 36 నెలల్లో నెలవారీ రూ. 3,780 చొప్పున ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..