Gold Price Today: ఒక్కసారిగా షాక్ ఇచ్చిన బంగారం ధర.. ఆదివారం ఒక్కరోజే ఏకంగా..
గత రెండు రోజులుగా బంగారం ధర స్థిరంగా స్థిరంగా కొనసాగుతోంది, కాస్త తగ్గుముఖం పట్టిందని సంతోషించేలోపే మళ్లీ ఒక్కసారిగా ధర పెరిగింది. ఆదివారం బంగారం ధరలో భారీగా పెరుగుదల కనిపించింది. తులం బంగారంపై ఏకంగా రూ. 320 వరకు పెరుగుదల కనిపించింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,100గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,290కి చేరింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో...
బంగారం ధర ఎప్పుడు, ఎలా పెరుగుతుందో అర్థం కానీ పరిస్థితి ఉంది. ఒక రోజు తగ్గితే, రెండు రోజులు పెరుగుతుంది అన్నట్లు ఉంది. గత రెండు రోజులుగా బంగారం ధర స్థిరంగా స్థిరంగా కొనసాగుతోంది, కాస్త తగ్గుముఖం పట్టిందని సంతోషించేలోపే మళ్లీ ఒక్కసారిగా ధర పెరిగింది. ఆదివారం బంగారం ధరలో భారీగా పెరుగుదల కనిపించింది. తులం బంగారంపై ఏకంగా రూ. 320 వరకు పెరుగుదల కనిపించింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,100గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,290కి చేరింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఆదివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,440కి చేరింది.
* ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,290 వద్ద కొనసాగుతోంది.
* చెన్నై విషయానికొస్తే ఆదివారం ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,780 వద్ద కొనసాగుతోంది.
* కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,100గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,290 వద్ద కొనసాగుతోంది.
* ఇక బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,100గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,290 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు…
* హైదరాబాద్‌లో ఆదివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,100గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,290 వద్ద కొనసాగుతోంది.
* ఇక నిజామాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 57,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,290 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ 57,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,290గా ఉంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,100గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,290 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇక వెండి కూడా బంగారం దారిలోనే దూసుకుపోతోంది. ఆదివారం వెండి ధరలో భారీగా పెరుగుదల కనిపించింది. కిలో వెండిపై ఏకంగా రూ. 1000 పెరగడం గమనార్హం. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో వెండి ధరలో పెరుగుదల కనిపించింది. చెన్నైలో అత్యధికంగా కిలో వెండి ధర రూ. 80,200కి చేరింది. ఇక ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో ఆదివారం కిలో వెండి ధర రూ. 77,200గా ఉంది. హైదరాబాద్‌తో పాటు కొయంబత్తూరు, విజయవాడ, విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. 80,200గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..