Small Savings Schemes: చిన్న మొత్తాల పెట్టుబడితో అధిక లాభాలు.. ఆ పథకాల్లో పెట్టుబడి పెడితే మీరే కోటీశ్వరులు..!
ప్రభుత్వాలు కూడా ప్రజల్లో పొదుపు ఆవశ్యకతను తెలియజేయడానికి వారికి అధిక వడ్డీ వచ్చేలా చిన్న మొత్తాల పొదుపు పథకాలను ప్రారంభించాయి. ఈ పొదుపు పథకాలు బాగా ప్రాచుర్యం పొందడంతో వీటిల్లో పెట్టుబడి పెట్టడానికి అందరూ సుముఖత వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చిన్నమొత్తాల పొదుపు పథకాలతో కోటీశ్వరులయ్యే అవకాశ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి చిన్న మొత్తాల పొదుపు పథకాలతో ఎలా కోటీశ్వరులవ్వాలో? ఓ సారి తెలుసుకుందాం.
భారతదేశంలో వేతన జీవులు శాతం ఎక్కువ. ముఖ్యంగా పల్లెలతో పోల్చుకుంటే పట్టణాల్లో వేతన జీవులు ఎక్కువ మంది ఉంటారు. వీరిలో కూడా మధ్యతరగతి ప్రజలు చాలా మంది ఉంటారు. అయితే ప్రశాంతమైన జీవనం కోసం చాలా కష్టపడి సొమ్ము సంపాదిస్తూ ఉంటారు. ఇలా కష్టపడి సంపాదించిన సొమ్మును అనుకోని ఆపద వస్తే ఆసరాగా ఉంటుందని కొంత పొదుపు చేస్తారు. ఇలా పొదుపు చేసిన సొమ్ము అవసరానికి ఉపయోగపడడమే కాకుండా ఆర్థికపరంగా మానసిక ప్రశాంతతను అందిస్తుంది. అయితే ప్రభుత్వాలు కూడా ప్రజల్లో పొదుపు ఆవశ్యకతను తెలియజేయడానికి వారికి అధిక వడ్డీ వచ్చేలా చిన్న మొత్తాల పొదుపు పథకాలను ప్రారంభించాయి. ఈ పొదుపు పథకాలు బాగా ప్రాచుర్యం పొందడంతో వీటిల్లో పెట్టుబడి పెట్టడానికి అందరూ సుముఖత వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చిన్నమొత్తాల పొదుపు పథకాలతో కోటీశ్వరులయ్యే అవకాశ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి చిన్న మొత్తాల పొదుపు పథకాలతో ఎలా కోటీశ్వరులవ్వాలో? ఓ సారి తెలుసుకుందాం.
సాధారణంగా చిన్న మొత్తాల పొదుపు పథకాలను పోస్టాఫీసులు, బ్యాంకుల్లో అందుబాటులో ఉంటాయి. అయితే చిన్నమొత్తాల పొదుపు పథకాల కంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కువ రాబడి వస్తాయి. అయితే అవి రిస్క్‌తో కూడిన పెట్టుబడులు కావడంతో మధ్యతరగతి ప్రజలు నమ్మకమైన రాబడి కోసం చిన్న మొత్తాల పొదుపు పథకాలను ఎంచుకుంటున్నారు. చిన్న మొత్తాల పొదుపు పథకాలు అంటే సుకన్య సమృద్ధి యోజన, కిసాన్ వికాస్ పత్ర, పీపీఎఫ్ వంటి పథకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే పీపీఎఫ్‌లో పెట్టుబడివతో కోటీశ్వరులు కావచ్చని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
పీపీఎఫ్ పెట్టుబడి కోటీశ్వరులు ఇలా
మీరు 25 సంవత్సరాల పీపీఎఫ్ పెట్టుబడి పెడితే కోటీశ్వరులు కావచ్చు. నెలవారీ పెట్టుబడి రూ.12,500గా ఉంటుంది. అంటే 25 సంవత్సరాల కాలానికి పెట్టుబడి మొత్తం రూ.1.5 కోట్లు ఉంటుంది. అలాగే వడ్డీ రూ.2.5 కోట్లు వస్తుంది. అంటే మెచ్యూరిటీ మొత్తం రూ.4 కోట్లు వస్తుంది. పీపీఎఫ్ ప్రస్తుత వడ్డీ రేటు7.1 శాతంగా ఉంటుంది. అలాగే పోస్టాఫీసు ఆర్‌డీ, టైమ్ డిపాజిట్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ద్వారా కూడా అధిక వడ్డీ రేటును పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి