Car Offers: కొత్త కారు కొనాలంటే ఇదే ఛాన్స్.. వాటిపై ఏకంగా రూ.5 లక్షల వరకూ తగ్గింపు.. !
కారు కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. పలు టాప్ బ్రాండ్లు, డీలర్లు మిడ్ సైజ్ ఎస్‌యూవీలపై అదిరే ఆఫర్లను ప్రకటించారు. పలు డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్‌లతో పాటు కారు లోన్లపై పలు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈఎంఐలపై కూడా ఆఫర్లు ఉన్నాయి. ఎక్స్ చేంజ్ బోనస్‌లు, లాయల్టీ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.
కారు కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. పలు టాప్ బ్రాండ్లు, డీలర్లు మిడ్ సైజ్ ఎస్‌యూవీలపై అదిరే ఆఫర్లను ప్రకటించారు. పలు డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్‌లతో పాటు కారు లోన్లపై పలు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈఎంఐలపై కూడా ఆఫర్లు ఉన్నాయి. ఎక్స్ చేంజ్ బోనస్‌లు, లాయల్టీ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి దాదాపు రూ. 5లక్షల వరకూ రాయితీ పొందే వీలుంది. ఒకవేళ మీరు కొత్త కారు కొనుగోలు చేయాలనే ప్లాన్‌లో ఉంటే మాత్రం ఈ ఆఫర్లను మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈ నెలాఖరు వరకు మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి. మిడ్ సైజ్ ఎస్‌యూవీ కార్లపై అందుబాటులో ఉన్న బెస్ట్ ఫెస్టివ్ డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ కార్లపై తగ్గింపులు..
టయోటా హిలక్స్.. ఈ కారుపై ఏకంగా రూ.5 లక్షల వరకూ వివిధ రకాల ప్రయోజనాలు అందుతాయి. వీటిల్లో క్యాష్ తగ్గింపులతో పాటు, ఎక్స్ చేంజ్ బోనస్, బ్యాంకు ఆఫర్లు, క్యాష్ బ్యాక్‌లు ఉంటాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ.. మహీంద్రా కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న ఏకైక ఎలక్ట్రిక్ ఎస్ యూవీ ఇది. దీనిపై రూ.3 లక్షల వరకూ తగ్గింపు పొందొచ్చు. అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి.
సిట్రోయెన్ సీ5 ఎయిర్‌క్రాస్.. కొన్ని ఎంపిక చేసిన సిట్రోయెన్ డీలర్లు మాత్రమే ఈ కారుపై డిస్కౌంట్ ను అందిస్తున్నారు. దాదాపు రూ. 2.5లక్షల వరకూ వివిధ రకాల ప్రయోజనాలు అందిస్తున్నారు.
హ్యుందాయ్ కోనా ఈవీ.. ఈ ఎలక్ట్రిక్ కారు కొనుగోలుపై కూడా రూ. 2 లక్షల నగదు తగ్గింపు లభిస్తుంది. మరిన్ని అదనపు ప్రయోజనాలు కూడా కొంతమంది డీలర్లు అందిస్తున్నారు.
ఎంజీ జెడ్‌ఎస్ ఈవీ.. ఈ కారు కొనుగోలుపై రూ. 2.3 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
జీప్ మెరిడియన్.. ఈ కారు ఈ ఫెస్టివ్ సీజన్లో కొనుగోలు చేస్తే రూ. 1.9 లక్షల వరకు ప్రయోజనాలు పొందొచ్చు. దీనిలో రూ. 1.15 లక్షల నగదు తగ్గింపు, రూ. 50,000 ఎక్స్‌చేంజ్ బోనస్, రూ. 20,000 కార్పొరేట్ డిస్కౌంట్లు లభిస్తాయి.
వీడబ్ల్యూ టిగువాన్.. ఈ కారుపై కూడా రూ. 1.85 లక్షలు తగ్గింపును అందుకోవచ్చు.
జీప్ కంపాస్.. ఈ కారును కొనుగోలు చేస్తే రూ. 1.5లక్షల ప్రయోజనాలు పొందొచ్చు. అందులో రూ. 85,000 నగదు తగ్గింపు కాగా, రూ. 50,000 ఎక్స్‌చేంజ్ బోనస్, రూ. 15,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉంటుంది.
ఎంజీ ఆస్టర్.. ఈ కారుపై మీకు రూ. 1.5 లక్షల వరకూ ప్రయోజనాలు ఉంటాయి. రూ. 1 లక్ష వరకు నగదు తగ్గింపు కాగా ఎంపిక చేసిన వేరియంట్‌లపై రూ. 50,000 వరకూ ఎక్స్ చేంజ్ బోనస్ లభిస్తుంది.
స్కోడా కుషాక్.. ఈ కారును కొనుగోలు చేస్తే రూ. 1.5 లక్షల వరకు ప్రయోజనాలు పొందొచ్చు. రూ. 40,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కాగా రూ. 25,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉంటుంది.
టాటా సఫారి అండ్ హారియర్ ప్రీ ఫేస్‌లిఫ్ట్.. వీటిపై రూ. 1.5 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తాయి. (అడాస్‌పై రూ. 75,000, రూ. 50,000 వరకూ ఎక్స్ చేంజ్, కార్పొరేట్, డీలర్ ఆఫర్లు ఉంటాయి.
సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్.. ఈ కారుపై రూ. 99,000 ప్రయోజనాలు ఉంటాయి. 5 సంవత్సరాల వరకూ ఏఎంసీ, వారంటీ వంటి మెయింటెనెన్స్ సపోర్టు ఉంటుంది.
వీడబ్ల్యూ టైగన్ టాప్‌లైన్.. ఈ కారు కొనుగోలుపై అన్ని రకాల ప్రయోజనాలు కలిపి రూ. లక్ష ప్రయోజనాలు పొందొచ్చు.
హ్యుందాయ్ క్రెటా.. ఈ కారుపై ప్రస్తుతానికి అధికారిక ఆఫర్‌లు ఏమీ లేవు. కానీ ఎంపిక చేసిన డీలర్ షోరూమ్ మార్జిన్ బేసిస్ స్టాక్ నుంచి డిస్కౌంట్‌లను అందిస్తోంది
హ్యుందాయ్ అల్కాజర్.. ఈ కారుపై రూ.35,000 డిస్కౌంట్ లభిస్తోంది.
ఫైనాన్స్ ఆప్షన్లు..
ఇవి కాక అనేక మంది డీలర్లు మీ కారుకు ఫైనాన్స్ చేయడానికి పలు ఆప్షన్లను కూడా అందిస్తున్నారు. అయితే మీరు లోన్ తీసుకునే ముందు పలు రుణదాతల వద్ద డేటాను తనిఖీ చేయాలి. అలాగే అక్కడి ఆఫర్లను సరిపోల్చాలి. అప్పుడే లాభదాయకమైన వడ్డీ రేటును పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈఎంఐ, ప్రీ క్లోజర్ నిబంధనలు, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర చార్జీల గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..