Dragon Fruit Farming: డ్రాగన్ ఫ్రూట్ ద్వారా దద్దరిల్లే ఆదాయం.. నెలకు లక్షన్నర సంపాదిస్తున్న మహిళ
వ్యాపారమైనా, వ్యవసాయమైన నలుగురు పాటించే విధానం కంటే కొత్త విధానంలో వెళ్తే అధిక ఆదాయం పొందవచ్చని నిపుణులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ముఖ్యంగా వ్యవసాయం విషయంలోకి వస్తే మాత్రం నలుగురు సాగు చేసే పంటల కంటే కొత్త పంటలు సాగు చేస్తే మేలైన రాబడి వస్తుంది. ముఖ్యంగా పెరటి సాగు చేసే వారు చాలా తక్కువ స్థలంలో సాగు చేసి ఎక్కువ ఆదాయం పొందుతూ ఉంటారు.
వ్యాపారమైనా, వ్యవసాయమైన నలుగురు పాటించే విధానం కంటే కొత్త విధానంలో వెళ్తే అధిక ఆదాయం పొందవచ్చని నిపుణులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ముఖ్యంగా వ్యవసాయం విషయంలోకి వస్తే మాత్రం నలుగురు సాగు చేసే పంటల కంటే కొత్త పంటలు సాగు చేస్తే మేలైన రాబడి వస్తుంది. ముఖ్యంగా పెరటి సాగు చేసే వారు చాలా తక్కువ స్థలంలో సాగు చేసి ఎక్కువ ఆదాయం పొందుతూ ఉంటారు. ఇలాంటి వారికి ఓ మహిళ ఆదర్శంగా నిలిచింది. తన ఇంటిపై డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగు చేస్తూ నెలకు లక్షన్నర పైగానే ఆదాయాన్ని ఆర్జిస్తుంది. కేరళలోని కొల్లంకు చెందిన రెమాభాయ్ ఓ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పని చేస్తూ 2022లో ఆమె పదవీ విరమణ చేశారు. రిటైర్‌మెంట్ లైఫ్‌ను హ్యాపీగా సాగుకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో తనకున్న 4 సెంట్ల ఇంటి స్థలంలోనే సాగుకు ఉపక్రమించింది. వినూత్నంగా సాగు చేయాలనే ఉద్దేశంతో డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగు చేసింది. ఈ నేపథ్యంలో డ్రాగన్ ఫ్రూట్ పంట ద్వారా ఆమె ఎంత ఆర్జించిందో? ఓ సారి తెలుసుకుందాం.
రెమాభాయ్ తన 4 సెంట్ల చిన్న స్థలంలో 90 కాంక్రీట్ స్తంభాలను నాటారు. ఒక్కో స్తంభం దగ్గర నాలుగు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను పాతారు. సాధారణంగా ఒక ఎకరం భూమిలో దాదాపు 500 డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు మాత్రమే ఉంటాయి. కానీ రెమాభాయ్ పద్ధతి ప్రకారం నాలుగు సెంట్లల్లో 360 మొక్కలను పాతారు. అనంతరం ఇంటి టెర్రస్‌పై కూడా కొన్ని మొక్కలను పెంచింది. అయితే ఆమె కుమారుడు మొదట్లో టెర్రస్‌పైకి మట్టిని తీసుకెళ్లే ఆలోచనను వ్యతిరేకించాడు. అయితే రెమాభాయ్ తక్కువ మట్టితో టెర్రస్ సాగు చేయాలని కేరళలోని అలువా నుండి 50 ప్లాస్టిక్ డ్రమ్ములను సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం ప్రారంభించింది. ఆమె ప్రతి ప్లాస్టిక్ డ్రమ్ములో రెండు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పెంచడం ప్రారంభించింది.
ఆరు నెలల తర్వాత పంట దిగుబడి ప్రారంభమైంది. ఒక్కో ప్లాస్టిక్ డ్రమ్ము నుంచి 30 డ్రాగన్ ఫ్రూట్స్ అంటే మొత్తం 1500 డ్రాగన్ పండ్లు దిగుబడి వచ్చాయి. ఒక్కో పండు సుమారు 600 గ్రాములు నుంచి 810 గ్రాములు ఉన్నాయి. రెమాబాయ్ ఆమె టెర్రస్‌లో పెరిగిన డ్రాగన్ ఫ్రూట్స్ ద్వారా రూ. 30,000 ఆమె 4 సెంట్ల ప్లాట్‌లో పెంచిన మొక్కల నుంచి రూ.40,000 సంపాదిస్తుంది. ఇలా ప్రతి 15 రోజులకు ఓ సారి దిగుబడి వస్తుంది. ఈ లెక్కన ఆమె సరాసరిన దిగుబడి వచ్చినప్పుడు నెలకు రూ.1.50 లక్ష వరకూ సంపాదిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..