PPF Account: మీ PPF ఖాతా మూసివేయబడితే టెన్షన్ తీసుకోకండి.. తిరిగి ఇలా ప్రారంభించవచ్చు..

కనీస మొత్తాన్ని PPF ఖాతాలో జమ చేయకపోతే.. నిర్ణీత సమయం తర్వాత మీ ఖాతా నిష్క్రియంగా మారుతుంది. దీన్ని మళ్లీ అమలు చేయడానికి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

PPF Account: మీ PPF ఖాతా మూసివేయబడితే టెన్షన్ తీసుకోకండి.. తిరిగి ఇలా ప్రారంభించవచ్చు..
Ppf
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 26, 2021 | 1:13 PM

పెట్టుబడులు పెట్టాలని అనుకునేవారికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) మంచి ఎంపిక అవుతుంది. PPFలో కేవలం 500 రూపాయల పెట్టుబడితో మొదలు పెట్టవచ్చు. ఇందులో మీరు గరిష్టంగా రూ .1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. దీనిపై పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. కానీ కరోనా సమయంలో డబ్బు లేకపోవడం వల్ల చాలా మంది ప్రజలు ఇలాంటి పథకాలపై పెట్టుబడులను వాయిదా వేసుకున్నారు. ఇందులో వాయిదాలను జమ చేయలేకపోయారు. ఈ కారణంగా ఖాతా క్లాజ్ అయ్యింది.

మీరు కూడా అలాంటి వారి జాబితాలో ఉంటే టెన్షన్ తీసుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కొన్ని విధానాలను అనుసరించడం ద్వారా దాన్ని మళ్ళీ ఓకే చేసుకోవచ్చు. పిపిఎఫ్ ఖాతాలో పెట్టుబడులు 15 సంవత్సరాల కాలానికి జరుగుతుంది.

ప్రతి సంవత్సరం కనీస రూ .500 పెట్టుబడి పెట్టవల్సి ఉంటుంది. మీరు ఈ మొత్తాన్ని జమ చేయక పోతే.. PPF ఖాతా క్రియారహితంగా మారుతుంది. దీనితో పాటు దీనిపై లభించే ఇతర ప్రయోజనాలు కూడా కోల్పోతాము. అటువంటి పరిస్థితిలో పిపిఎఫ్ ఖాతాను మళ్లీ తెరవడానికి మీరు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ఖాతాను తిరిగి సక్రియం చేయడం ఎలా

PPF ఖాతాను తిరిగి తెరవాడానికి ముందుగా బ్యాంక్ లేదా పోస్టాఫీసుకు వెళ్లవల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మీరు దానికి సంబంధించిన ఫారమ్ నింపాలి. దీనితో పాటు మీరు ఫైన్‌తోపాటు బకాయిల మొత్తాన్ని చెల్లించాలి. బకాయి మొత్తాన్ని లెక్కించడం మీ భాగంలో PPF మొత్తాన్ని జమ చేయని కాలంపై ఆధారపడి ఉంటుంది. ఇది కాకుండా, మీరు కూడా జరిమానా చెల్లించాలి. ఈ జరిమానాను సంవత్సరానికి రూ .50 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

ఎంత బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది

ఒకరి పిపిఎఫ్ ఖాతా 4 సంవత్సరాలు మూసివేయబడితే.. మీరు సుమారు 2000 రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పాటు మీరు రూ .200 జరిమానా కూడా జమ చేయాల్సి రావచ్చు. 

ఇవి కూడా చదవండి: Ramappa Temple: తెలంగాణ ప్రజలకు అభినందనలు.. రామప్పకు అరుదైన గౌరవంపై ప్రధాని మోడీ ట్వీట్

Miracle Bore Water: ఆ బోరు వాటర్ తాగితే కీళ్ల నొప్పులు మాయం.. ఆ నీటి కోసం క్యూ కడుతున్న జనం..