ఇంటి నుంచే డబ్బు సంపాదించడం ఎలా..? మీకోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ జాబ్స్..
ఈ మధ్య ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేయడం కామన్‌గా మారింది. ఖర్చులు పెరిగిపోవడం, వచ్చిన జీతం సరిపోకపోవడంతో చాలా మంది ఇతర ఆదాయాల వైపు చూస్తున్నారు. మీరు కూడా రెండో ఆదాయం కోసం చూస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఈజీగా డబ్బులు ఎలా సంపాదించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఈ మధ్య కాలంలో ఖర్చులు పెరిగిపోవడంతో వచ్చిన జీతం సరిపోవడం లేదు. దీంతో చాలా మంది అప్పుల పాలు అవుతున్నారు. ఈ అప్పుల నుంచి తప్పించుకునేంది పార్ట్ టైమ్, ఫ్రీలాన్స్ వర్క్స్ చేసుకుంటున్నారు. 2025లో 10శాతం మంది అమెరికన్లు తమ ప్రధాన ఆదాయం సరిపోకపోవడంతో సైడ్ బిజినెస్‌లు లేదా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నట్లు సర్వేలో తేలింది. మీరు కూడా అదనపు ఆదాయం కోసం చూస్తున్నట్లయితే.. మీకోసం ఇక్కడ చాలా మార్గాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆన్‌లైన్‌లో.. మరికొన్ని ఇంటి నుంచే.. ఇంకొన్ని ఆఫ్‌లైన్‌లో చేయవచ్చు.
ఆన్‌లైన్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా?
ఫ్రీలాన్స్ సేవలు:
Upwork, Fiverr, Freelancer.com వంటి వెబ్‌సైట్‌లలో రైటర్లు, డిజైనర్లు, ప్రోగ్రామర్లు, మార్కెటింగ్ నిపుణులు వంటి వారికి అవకాశాలు లభిస్తాయి. AI- రూపొందించిన కంటెంట్‌ను సరిచేయడం, ఎస్ఈవో నైపుణ్యాలు ఉన్న వారికి మంచి డిమాండ్ ఉంది.
వెబ్‌సైట్లు, యాప్‌లను టెస్ట్ చేయడం:
UserTesting.com లాంటి ప్లాట్‌ఫారమ్‌లు వెబ్‌సైట్లు, యాప్‌లను టెస్ట్ చేసి ఫీడ్‌బ్యాక్ ఇచ్చే వారికి డబ్బు చెల్లిస్తాయి.
ఏఐ టూల్స్ ద్వారా ఆదాయం:
ఏఐ టూల్స్‌ను ఉపయోగించి డిజిటల్ ఉత్పత్తులను తయారు చేయడం, బిజినెస్ మార్కెటింగ్‌కు సాయం చేయడం లేదా ఏఐ టూల్స్ ఎలా వాడాలో నేర్పించడం ద్వారా సంపాదించవచ్చు.
సర్వేలు పూర్తి చేయడం:
Swagbucks, Survey Junkie వంటి వెబ్‌సైట్‌లు సర్వేలు పూర్తి చేసినందుకు డబ్బులు లేదా గిఫ్ట్ కార్డులు ఇస్తాయి.
బ్లాగులు, అఫిలియేట్ మార్కెటింగ్:
మీ బ్లాగుకు మంచి ట్రాఫిక్ ఉంటే, అఫిలియేట్ నెట్‌వర్క్‌లో చేరి, మీ లింక్‌ల ద్వారా కొనుగోళ్లు జరిగితే కమిషన్ సంపాదించవచ్చు.
Etsyలో ఉత్పత్తులు అమ్మడం:
మీ సృజనాత్మక నైపుణ్యాలను (నగల తయారీ, ఎంబ్రాయిడరీ) ఉపయోగించి Etsyలో ఉత్పత్తులు అమ్మి లాభాలు పొందవచ్చు.
డిజిటల్ ఉత్పత్తులు అమ్మడం:
eBookలు, ప్లానర్లు, కోర్సులు వంటివి తయారు చేసి Gumroad, Etsy లాంటి సైట్లలో అమ్మవచ్చు.
eBookలను ప్రచురించడం:
అమెజాన్ KDP (కిండిల్ డైరెక్ట్ పబ్లిషింగ్) ద్వారా ఉచితంగా మీ eBookను ప్రచురించి, రాయల్టీ సంపాదించవచ్చు.
ట్విచ్‌లో గేమ్స్ స్ట్రీమ్ చేయడం:
మీ గేమింగ్ నైపుణ్యాలను ట్విచ్‌లో స్ట్రీమ్ చేసి సబ్‌స్క్రిప్షన్స్, యాడ్స్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు.
ఫోటోగ్రఫీ ఆన్‌లైన్‌లో అమ్మడం:
Fine Art America, SmugMug వంటి సైట్‌లలో మీ ఫోటోలను అమ్మి ఆదాయం పొందవచ్చు.
ఇంటి నుంచే డబ్బు సంపాదించడం ఎలా?
పెట్స్ సిట్టింగ్:
Rover, Wag లాంటి యాప్‌ల ద్వారా కుక్కల పెంపకం సేవలు అందించవచ్చు.
గిఫ్ట్ కార్డులు అమ్మడం:
CardCash లాంటి వెబ్‌సైట్‌లలో మీ గిఫ్ట్ కార్డులను వాటి విలువలో 92శాతం వరకు అమ్ముకోవచ్చు.
ఆఫ్‌లైన్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా?
పాత బట్టలు అమ్మడం:
మీ పాత బట్టలను ThredUp, Poshmark వంటి ప్లాట్‌ఫారమ్‌లలో లేదా స్థానిక దుకాణాలలో అమ్ముకోవచ్చు.
పాత ఎలక్ట్రానిక్స్ అమ్మడం:
మీ పాత గాడ్జెట్‌లను Swappa, Gazelle, లేదా Amazon ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ ద్వారా అమ్మి డబ్బు సంపాదించవచ్చు.
బేబీ సిట్టింగ్:
Care.com, Sittercity లేదా స్థానిక నెట్‌వర్క్‌ల ద్వారా పిల్లలను చూసుకునే సేవలు అందించవచ్చు.
మీ కారు రెంట్‌కి ఇవ్వడం:
Turo, Getaround లాంటి ప్లాట్‌ఫారమ్‌లలో మీ కారును అద్దెకిచ్చి ఆదాయం పొందవచ్చు.
TaskRabbitలో పనులు చేయడం:
ఫర్నిచర్ అసెంబుల్ చేయడం, వస్తువులు తరలించడం వంటి చిన్న చిన్న పనులు చేసి డబ్బు సంపాదించవచ్చు.
ట్యూషన్ చెప్పడం:
ఆన్‌లైన్‌లో లేదా నేరుగా ట్యూటర్.కామ్ ద్వారా విద్యార్థులకు పాఠాలు చెప్పవచ్చు.
డెలివరీ సర్వీసులు:
Amazon, DoorDash, Uber Eats లాంటి డెలివరీ యాప్‌లలో సైన్ అప్ చేసి డెలివరీ పనులు చేయవచ్చు.
హౌస్ సిట్టింగ్:
యజమానులు ఊళ్లో లేనప్పుడు వారి ఇళ్లను, పెట్స్ ను చూసుకోవడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు.
మిస్టరీ షాపింగ్:
BestMark, IntelliShop లాంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కస్టమర్ సర్వీస్‌పై ఫీడ్‌బ్యాక్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




