SSY Scheme: కూతురు పెళ్లి సమయానికి రూ. 35 లక్షలు కావాలా.? ఇలా చేయండి..
ఈ పథకంలో చిన్న మొత్తం పొదుపు చేసుకుంటూ పోతుంటే భారీగా రిటర్న్స్ పొందే అవకాశాన్ని కల్పించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకంతో ఆడ బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయొచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టే మొత్తంపై ట్యాక్స్ మినహాయింపు కూడా వర్తిచడం విశేషం. ఉదారహణకు మీ చిన్నారు పెళ్లికి లేదా, పై చదువుల కోసం...
కూతురు పుట్టగానే చిన్నారి బంగారు భవిష్యత్తు కోసం పేరెంట్స్ ఎన్నో కలలు కంటారు. కొందరు ఉన్నత చదువులు చదివించి, విదేశాలకు పంపించాలని భావిస్తే. మరికొందరు చదువు పూర్తయిన తర్వాత మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని భావిస్తుంటారు. అయితే ఈ రెండు డబ్బులతో కూడుకున్న విషయమే. అందుకే చిన్నతనం నుంచే వారి కోసం సేవింగ్స్ చేస్తుంటారు. ఇలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన అనే పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ఈ పథకంలో చిన్న మొత్తం పొదుపు చేసుకుంటూ పోతుంటే భారీగా రిటర్న్స్ పొందే అవకాశాన్ని కల్పించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకంతో ఆడ బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయొచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టే మొత్తంపై ట్యాక్స్ మినహాయింపు కూడా వర్తిచడం విశేషం. ఉదారహణకు మీ చిన్నారు పెళ్లికి లేదా, పై చదువుల కోసం రూ. 35 లక్షలు రావాలంటే నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సుకన్య సమృద్ధి యోజన పథకం అన్ని పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంటుంది. ఇందులో అత్యధికంగా 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. పదేళ్లలోపు ఆడబిడ్డ పేరుపై పేరెంట్స్ అకౌంట్‌ను ఓపెన్ చేయాలి. ఇందులో నెలకు కనీసం రూ. 250 నుంచి గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. 15 ఏళ్ల వ్యాలిడిటీతో ఈ పథకం ఉంటుంది. నెలకు లేదా ఏడాదికి ఒకసారి ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. 15 ఏళ్లు నిండిన తర్వాత డబ్బుల్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక ఈ పథకం ఓపెన్ చేసిన తర్వాత నుంచి 21 ఏళ్లకు క్లోజ్ అవుతుంది. లేదా అమ్మాయి పెళ్లి జరిగితే క్లోజ్ అవుతుంది.
ఇక రూ. 35 లక్షలు రావాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నెలకు రూ. 6250 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇలా మీరు ఏడాదికి రూ. 75000 ఇన్వెస్ట్ చేస్తారు. 15 ఏళ్లకు మొత్తం రూ. 11,25000 పెట్టుబడి పెడతారు. దీనిపై మీకు ఏడాదికి 8320 శాతం లెక్కన వడ్డీ లెక్కిసే.. రూ. 2338789 అవుతుంది. మెచ్యూరిటీ పూర్తయ్యే సమయానికి మొత్తం రూ. 3463789 చేతికి అందుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..