Aadhar Update: జూన్‌ 14లోపు ఆధార్‌ అప్‌డేట్‌ చేయకుంటే కార్డు చెల్లుబాటు కాదా?

ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్‌ కార్డు ముఖ్యమైన భాగం అయిపోయింది. ఆధార్‌ లేనిది ఏ పని జరగని పరిస్థితి నెలకొంది. అయితే ఆధార్‌ కోసం భారత విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తూనే ఉంది. ప్రతి ఒక్క పత్రాన్ని ఆధార్‌తో లింక్‌ చేస్తోంది. ముఖ్యంగా పాన్‌ కార్డు, ఓటర్‌ ఐడీలను ఆధార్‌తో లింక్‌ చేయాల్సి

Aadhar Update: జూన్‌ 14లోపు ఆధార్‌ అప్‌డేట్‌ చేయకుంటే కార్డు చెల్లుబాటు కాదా?
Aadhaar Card
Follow us
Subhash Goud

|

Updated on: May 28, 2024 | 7:41 PM

ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్‌ కార్డు ముఖ్యమైన భాగం అయిపోయింది. ఆధార్‌ లేనిది ఏ పని జరగని పరిస్థితి నెలకొంది. అయితే ఆధార్‌ కోసం భారత విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తూనే ఉంది. ప్రతి ఒక్క పత్రాన్ని ఆధార్‌తో లింక్‌ చేస్తోంది. ముఖ్యంగా పాన్‌ కార్డు, ఓటర్‌ ఐడీలను ఆధార్‌తో లింక్‌ చేయాల్సి ఉంటుంది. ఇక ఆధార్‌కార్డు తీసుకుని పదేళ్ల అవుతున్నవారి వివరాలను ఆధార్‌లో అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. అయితే ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు జూన్‌ 14 వరకు గడువు ఉంది. ఆ తర్వాత వివరాలను అప్‌డేట్‌ చేసుకుంటే కొంత ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీనిపై పలు పుకార్లు సోషల్‌ మీడియా ద్వారా చక్కర్లు కొడుతున్నాయి.

జూన్ 14 లోపు వ్యక్తిగత వివరాలను ఆధార్‌లో అప్‌డేట్‌ చేయకుంటే ఆధార్‌ పని చేయదంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. దీనిపై యూఐడీఏఐ స్పందించింది. సోషల్‌ మీడియాలో వ్యాపిస్తున్న వదంతులను ఎవ్వరు కూడా నమ్మవద్దని, అన్ని అబద్దాలేనని తేల్చి చెప్పింది. కేవలం ఉచితంగా ఆధార్ వివరాలు అప్ డేట్ చేయడానికి మాత్రమే వచ్చే నెల 14 తుది గడువని ఉడాయ్ స్పస్టం చేసింది. జూన్ 14 తర్వాత కూడా ఆధార్ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవచ్చని తెలిపింది. గడువు లోపు అప్‌డేట్‌ చేస్తే ఉచితమని, ఆ తర్వాత అయితే కొంత ఫీజు చెల్లించుకోవాల్సి ఉంటుందని యూఐడీఏఐ వెల్లడించింది. ఇంతకుముందు గతేడాది (2023) డిసెంబర్ 14 వరకూ ఉచితంగా ఆధార్ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉండగా, ఆ తేదీని జూన్‌ 14 వరకు పొడిగించింది.

ఆధార్‌లో పేరు నమోదు చేసుకున్న పది సంవత్సరాల కోసారి తమ వివరాలు అప్ డేట్ చేసుకోవాలని గతంలోనే ఉడాయ్ సూచించింది. ఇందుకు గుర్తింపు కార్డు, చిరునామా ధృవీకరణ పత్రాలు సమర్పించి, సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపాజిటరీ (సీఐడీఆర్)లో వివరాలు అప్ డేట్ చేసకోవాలని తెలిపింది.

ఇదిలా ఉండగా, యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేసుకునేందుకు తాజా గుర్తింపు కార్డు, చిరునామా వివరాలు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు, చిరునామాకు రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, కిసాన్ పాస్ బుక్, పాస్ పోర్ట్ వంటి వాటితో కూడా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. లేదా టీసీ, మార్కుల జాబితా, పాన్/ఈ-పాన్, డ్రైవింగ్ లైసెన్స్ గుర్తింపు ధృవీకరణ పత్రంగా, మూడు నెలలు మించని విద్యుత్, నీరు, గ్యాస్, టెలిఫోన్ బిల్లులను చిరునామా ధృవీకరణ పత్రంగా వాడొచ్చునని ఉడాయ్ వెల్లడించింది. ధృవీకరణ పత్రాలను స్కాన్ చేసి ‘మై ఆధార్’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?