AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: మీ ఆధార్ దుర్వినియోగమైందా? ఆన్‌లైన్‌లో తనిఖీ చేయడం ఎలా..?

మీ వ్యక్తిగత సమాచారం అంతా ఆధార్‌లో ఉంటుంది. పేరు, చిరునామా, బయోమెట్రిక్ వివరాలు అన్నీ నమోదు చేస్తారు. ఆధార్ రికార్డులు భద్రంగా ఉన్నాయని ప్రభుత్వం కొంత హామీ ఇచ్చింది. అయితే..

Aadhaar Card: మీ ఆధార్ దుర్వినియోగమైందా? ఆన్‌లైన్‌లో తనిఖీ చేయడం ఎలా..?
Aadhaar Card
Subhash Goud
|

Updated on: Feb 08, 2023 | 9:02 AM

Share

మీ వ్యక్తిగత సమాచారం అంతా ఆధార్‌లో ఉంటుంది. పేరు, చిరునామా, బయోమెట్రిక్ వివరాలు అన్నీ నమోదు చేస్తారు. ఆధార్ రికార్డులు భద్రంగా ఉన్నాయని ప్రభుత్వం కొంత హామీ ఇచ్చింది. అయితే ఆన్‌లైన్‌లో ఆధార్ దుర్వినియోగానికి అవకాశం ఉన్నందున క్రమం తప్పకుండా తనిఖీ చేయడం మంచిది. ఆధార్ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నారో లేదో తనిఖీ చేసేందుకు ‘ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ’ అనే ఆప్షన్‌ను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అందించింది.

  • ‘ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ’ని చెక్ చేయడానికి మీరు ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ (www.uidai.gov.in)ని సందర్శించాలి.
  • ‘మై ఆధార్’ ఆప్షన్‌పై క్లిక్ చేసి, ఆధార్ సర్వీసెస్ కింద ‘ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ’పై క్లిక్ చేయండి.
  • ఆధార్ నంబర్, సెక్యూరిటీ కోడ్ మరియు ఓటీపీ ఉపయోగించి లాగిన్ చేయండి.
  • ఓటీపీని నమోదు చేసి దానిని ధృవీకరించిన తర్వాత, ‘ప్రొసీడ్’ ఎంపికపై క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ కార్డ్, మునుపటి ధృవీకరణ అభ్యర్థనలకు సంబంధించిన అన్ని వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. దీని ద్వారా మీరు ఆధార్ దుర్వినియోగం అయ్యిందో లేదో తనిఖీ చేయవచ్చు.

ఈ పద్దతి ద్వారా మీ ఆధార్‌ కార్డు దుర్వినియోగం విషయమై తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. మీ ఆధార్‌ను ఇతరులు ఉపయోగించి ఏదైనా మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం, యూఐడీఏఐ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఆధార్‌ విషయంలో జాగ్రత్త ఉండాలని సూచిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.