LIC Policy: ఖాతాదారులకు ఎల్ఐసీ బంపర్ ఆఫర్.. ఫైన్ లేకుండానే పాలసీలను పునరుద్ధరణకు అవకాశం..
పెట్టుబడికి భరోసా ఉంటుందనే కారణంతో ఎక్కువ మంది ఎల్ఐసీలో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే పాలసీ తీసుకున్నప్పుడు ఎంతో ఉత్సాహంగా తీసుకుంటామో? ప్రీమియంలు చెల్లించడానికి అంత అలసత్వం చూపిస్తాం. దీంతో పాలసీలు లాప్స్ అయిపోతాయి.

జీవిత బీమా.. అంటే మనం లేకపోయినా మన కుటుంబానికి ఆర్థిక భరోసానిస్తుంది. అలాగే సొమ్మును పొదుపు చేయడానికి ఎల్ఐసీ పెట్టుబడి పెట్టడం అనేది ఎప్పటి నుంచో అవలంభిస్తున్న పద్ధతి. ఎల్ఐసీ కూడా ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి పెట్టుబడికి భరోసా ఉంటుందనే కారణంతో ఎక్కువ మంది ఎల్ఐసీలో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే పాలసీ తీసుకున్నప్పుడు ఎంతో ఉత్సాహంగా తీసుకుంటామో? ప్రీమియంలు చెల్లించడానికి అంత అలసత్వం చూపిస్తాం. దీంతో పాలసీలు లాప్స్ అయిపోతాయి. అలాగే భారీగా వడ్డీ కూడా కట్టాల్సి రావడంతో పాలసీలను పునరుద్ధరించడానికి ఆసక్తి చూపించరు. అయితే ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకున్న ఎల్ఐసీ ల్యాప్స్ అయిపోయిన పాలసీలకు ఎలాంటి ఫైన్లు లేకుండా పునరుద్ధరించుకునే అవకాశం కల్పించింది. ఎల్ఐసీ కల్పించిన అవకాశాలేంటో ఓ సారి చూద్దాం.
ఫిబ్రవరి 1 నుంచి 24 వరకూ ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకునేందుకు ఎల్ఐసీ ఓ మంచి ఆఫర్ ను ప్రవేశపెట్టింది. పాలసీ పునురద్ధరణ సమయంలో వేసే వడ్డీని, ఇతర చార్జీలను మినహాయింపును ఇచ్చింది. ఈ మేరకు తన ఏజెంట్లతో పాటు, ఎల్ఐసీ ఆఫీసుల్లో వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారు. పాలసీలను పునరుద్ధరించడానికి మంచి అవకాశం అంటూ ఖాతాదారులను అటువైపుగా అడుగులు వేసేలా చైతన్యం చేస్తున్నారు. పాలసీ దారులు రూ. లక్ష వరకూ ఆలస్య రుసుమును రాయితీగా పొందుతారు. అలాగే రూ.లక్ష పైబడి రూ.3 లక్షల వరకూ ఆలస్య రుసుముపై 25 శాతం రాయితీ, మూడు లక్షల కంటే ఎక్కువ ప్రీమియంలపై 30 శాతం రాయితీని పొందుతారు. రాయితీ విషయాలపై మరింత సమాచారం కోసం ఎల్ఐసీ ఆఫీసుల్లో సంప్రదించాలని కోరుతున్నారు. అలాగే చెల్లించిన ప్రీమియం తేదీ నుంచి 5 సంవత్సరాల లోపు బాకీ ఉన్న పాలసీలను మాత్రమే పునరుద్ధరించుకునే అవకాశం ఉంది. అలాగే నాక్, బిల్ పే రిజిస్టర్డ్ పాలసీలపై రూ.5 రుసుము చెల్లించాల్సి వస్తుంది.
అయితే టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, మల్టిపుల్ రిస్క్ లతో కూడిన పాలసీలు వంటి హైరిస్క్ ప్లాన్ లు ఈ రాయితీ పొందలేవు. ప్రీమియం చెల్లింపు వ్యవధిలో ల్యాప్ అయిన పాలసీలు మాత్రమే పునరుద్ధరణకు అర్హత సాధిస్తాయి. కాబట్టి ఈ విషయాలపై వినియోదారులకు అవగాహన కల్పిస్తున్నామని ఎల్ఐసీ అధికారులు పేర్కొంటున్నారు.




మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




