MIS Scheme: పెట్టుబడిపై నెలవారీ ఆదాయం కావాలా? అయితే ఈ పోస్టల్ స్కీమ్ ను ట్రై చేయండి

పోస్టాఫీసులో అందుబాటు ఉండే ఎంఐఎస్ స్కీమ్ గురించి ఓ సారి తెలుసుకుందాం. నెలవారీ ఎంత వడ్డీ వస్తుంది? ఏ మేరకు డిపాజిట్ చేయవచ్చు? అనే విషయాల గురించి ఓ సారి చూద్దాం.

MIS Scheme: పెట్టుబడిపై నెలవారీ ఆదాయం కావాలా? అయితే ఈ పోస్టల్ స్కీమ్ ను ట్రై చేయండి
Post Office Scheme
Follow us
Srinu

|

Updated on: Feb 07, 2023 | 8:53 PM

జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్ము మనకు ఆసరాగా ఉండాలని సగటు మనిషి కోరుకుంటాడు. ముఖ్యంగా ఉద్యోగస్తులు తాము రిటైరైన తర్వాత వచ్చే సొమ్ము నెలవారీ ఆదాయం వచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. ఎందుకంటే రిటైరయ్యాక ఇల్లు గడవడానికి, అలాగే తమ మందులు ఖర్చులకు డబ్బు కావాలి కాబట్టి నెలవారీ ఆదాయ పథకాలపై దృష్టి పెడతారు. ఈ నేపథ్యంలో చాలా మంది తమకు అందుబాటు ఉండే పోస్టాఫీసులో పెట్టుబడి పెడతారు. ఎందుకంటే నెలవారీ సొమ్ము విత్ డ్రా చేసుకోవడానికి వీలుగా ఉండడంతో పాటు దాచుకున్న సొమ్ముపై ప్రభుత్వ భరోసా ఉంటుంది. అయితే పోస్టాఫీసులో అందుబాటు ఉండే ఎంఐఎస్ స్కీమ్ గురించి ఓ సారి తెలుసుకుందాం. నెలవారీ ఎంత వడ్డీ వస్తుంది? ఏ మేరకు డిపాజిట్ చేయవచ్చు? అనే విషయాల గురించి ఓ సారి చూద్దాం.

మంత్లీ ఇన్ కం స్కీమ్ పై ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ వస్తుంది. అయితే ఈ వడ్డీను ప్రభుత్వం క్రమ పద్ధతిలో నిర్ణయిస్తుంది. పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ స్కీం కింద లాక్ పిరియడ్ 5 సంవత్సరాలు. మీరు మెచ్యూరిటీ తర్వాత ఇన్వెస్ట్ చేసిన సొమ్మును విత్ డ్రా చేసుకోవచ్చు లేదా మళ్లీ పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడి పరిమితి ఒకే ఖాతాకు రూ.4.5 లక్షల నుంచి రూ.9 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే జాయింట్ ఖాతా ద్వారా అయితే రూ.15 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ ఖాతా ద్వారా నెలకు రూ.8875 స్థిరమైన ఆదాయం పొందవచ్చు. అలాగే రూ.9 లక్షలు సింగిల్ ఖాతాపై పెట్టుబడి పెడితే రూ.5325 ఆదాయం వస్తుంది. ఈ పథకానికి ఎవరైనా అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. అలాగే పదేళ్లు పైబడిన మైనర్ పేరుపై కూడా డిపాజిట్ వేసి వారి అవసరాలను తీర్చవచ్చు. కాబట్టి స్థిరమైన ఆదాయం కోసం పోస్టాఫీస్ ఎంఐఎస్ స్కీం పెట్టుబడి పెట్టుకోండి. 

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?