House Buying Tips: ఇల్లు కొనేటప్పుడు ఈ 6 తప్పులు ఎప్పుడూ చేయకండి.. తప్పు చేస్తే జీవితాంతం తిప్పలు తప్పదు..!
రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటును పెంచిన తర్వాత, బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేటును భారీగా పెంచాయి. ఫలితంగా ప్రజలు రుణాలు తీసుకుని ఇల్లు కొనడం..

రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటును పెంచిన తర్వాత, బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేటును భారీగా పెంచాయి. ఫలితంగా ప్రజలు రుణాలు తీసుకుని ఇల్లు కొనడం ఖరీదుగా మారింది. మెట్రో లేదా ఇతర నగరాల్లో మీ కలల ఇంటిని కూడా కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. కొన్ని పొరపాట్లకు దూరంగా ఉండాలి. ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు చేయకూడని 6 ప్రధాన తప్పుల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం..
ఖర్చునంతా లెక్క వేయాలి..
రుణం తీసుకునే సమయంలో అదనపు ఛార్జీల గురించి కూడా తెలుసుకోవాలి. తిసుకునే రుణంలో అదనపు ఛార్జీల పేరుతో సగం కట్ చేయడం జరుగుతుంది. అందుకే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తప్పక తెలుసుకోవాలి. విడివిడిగా జీఎస్టీ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ, బ్రోకరేట్, ఫర్మిషింగ్, ఇతర ఛార్జీలు అన్నీ ఇల్లు కొనుగోలుపై విధించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితిలో మొత్త ఎంత ఖర్చు అవుతుంది? ఎంత లోన్ అవసరం? ఎంత అమౌంట్ చేతికి వస్తుంది? వంటి అన్ని వివరాలను చెక్ చేసుకోవాలి.
ఇల్లు కొనే విషయంలో తొందరపాటు వద్దు..
మీ డ్రీమ్ హోమ్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, కనీసం 10 ప్రాపర్టీలను చెక్ చేసి, సరిపోల్చుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఉచిత, అత్యాశతో కూడిన ఆఫర్ల వలలో పడవద్దు. ఆ తరువాత మోసానికి గురవుతారు.




లక్షణాలను చెక్ చేయాలి..
ఇల్లు కొనడానికి వెళితే, ఇంటి నాలుగు గోడల గురించి మాత్రమే కాదు.. ఇతర లక్షణాలు కూడా తెలుసుకోవాలి. ఇల్లు ఎంత వరకు సేఫ్ అనేది నిర్ధారించుకోవాలి. విశ్రాంతి, అవసరాలు, తగినంత గది స్థలం, పార్కింగ్ కోసం స్థలం వంటివి అన్నీ పరిశీలించాలి.
హోంవర్క్, పరిశోధన..
ఇల్లు కొనుగోలు చేయబోతున్నట్లయితే.. వ్యక్తిగత పరిశోధన చేయడం చాలా ముఖ్యం. అలాగే హోంవర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. ధర, ఆ ప్లేస్ గురించి విశ్లేషించాలి. ఎంత స్థలం అవసరమో కూడా నిర్ధారించుకోవాలి. అలాగే విక్రేత, బిల్డర్ ఎవరు? వారి ట్రాక్ రికార్డ్ ఏంటి? అనే సమాచారాన్ని కూడా తెలుసుకోవాలి.
క్రెడిట్ స్కోర్‌పై దృష్టి..
ఆస్తిని కొనుగోలు చేయడానికి రుణం కోసం దరఖాస్తు చేస్తు.. బ్యాంకర్లు మీ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేస్తారు. ఈ క్రెడిట్ స్కోర్, చెల్లింపుల హిస్టరీలో ఏదైనా సమస్య ఉంటే.. లోన్ రిజెక్ట్ అవుతుంది. కావున, లోన్ కోసం అప్లై చేసే ముందు క్రెడిట్ స్కోర్‌ని ఆన్‌లైన్‌లో చేక్ చేసుకోవడం చాలా ముఖ్యం.
హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి..
బ్యాంకులు రుణాలు ఇస్తూ 75 శాతం లేదా 90 శాతం నిధులు సమకూరుస్తాయి. మిగిలినవి బ్యాంకుకు పే చేయాల్సి ఉంటుంది. అందుకే.. 20 25 శాతం బడ్జెట్‌ను సిద్ధం చేసుకోవడం ఉత్తమం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




