Home Loan Tips: హోమ్ లోన్ ఈఎంఐ చెల్లించలేకపోతున్నారా? ఇలా చేయండి
మీరు మీ హోమ్ లోన్ ఇన్‌స్టాల్‌మెంట్‌ను మూడు లేదా అంతకంటే ఎక్కువ నెలలు చెల్లించకపోతే అప్పుడు రుణదాత మీ లోన్‌ను ఎన్‌పీఏ ఖాతాలో వేయవచ్చు.రుణం ఎన్‌పీఏకి వెళ్ళిన తర్వాత రుణదాత డబ్బును రికవరీ చేయడానికి కఠినమైన చర్యలు తీసుకోవచ్చు. మీరు గృహ రుణ మొత్తాన్ని..

మీరు మీ హోమ్ లోన్ ఇన్‌స్టాల్‌మెంట్‌ను మూడు లేదా అంతకంటే ఎక్కువ నెలలు చెల్లించకపోతే అప్పుడు రుణదాత మీ లోన్‌ను ఎన్‌పీఏ ఖాతాలో వేయవచ్చు.రుణం ఎన్‌పీఏకి వెళ్ళిన తర్వాత రుణదాత డబ్బును రికవరీ చేయడానికి కఠినమైన చర్యలు తీసుకోవచ్చు. మీరు గృహ రుణ మొత్తాన్ని సకాలంలో చెల్లించకపోతే మీ క్రెడిట్ స్కోర్ కూడా ప్రతికూలంగా ప్రభావితమవుతుందని కూడా మీరు గుర్తుంచుకోవాలి. అంటే మీరు భవిష్యత్తులో రుణాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొవచ్చు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. హోమ్ లోన్ మొత్తం ఎన్‌పీఏలోకి వెళ్లిన తర్వాత, రుణదాత బ్యాంకు లేదా సంస్థ కూడా చట్టపరమైన చర్య తీసుకోవచ్చు. సాధారణంగా గృహ రుణ ఈఎంఐ చెల్లించనందుకు 1 నుంచి 2 శాతం వడ్డీ రేటు విధించబడుతుంది. మీరు రుణం తీసుకుని ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లయితే మీరు మీ రుణదాతను సంప్రదించి మీ సమస్యను వివరించడం చాలా ముఖ్యం. అతను ఆర్థిక సమస్యను పరిష్కరించడానికి అనేక ప్రణాళికలు ఉంటాయి. దాని కింద మీకు ఉపశమనం ఇవ్వవచ్చు.
రుణదాత ఈఎంఐని తగ్గించడం, లోన్ కాలపరిమితిని పెంచడం వంటి అనేక ప్లాన్‌లు ఉంటాయి. మరోవైపు, మీరు ఏదైనా అదనపు మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసినప్పటికీ, దాన్ని ఉపయోగించడం ద్వారా మీరు లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు. ఈఎంఐలను సకాలంలో చెల్లించడానికి నెలవారీ బడ్జెట్ అవసరం. అదే సమయంలో మీరు రుణ చెల్లింపు పద్ధతులను తెలుసుకోవడానికి ఆర్థిక సలహాదారుని లేదా నిపుణుడిని కూడా సంప్రదించవచ్చు. మీరు పెట్టుకున్న ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోతే భవిష్యత్తులో రుణం తీసుకునేందుకు ఇబ్బందులు పడవచ్చు. ఇలాంటి సమస్య ఏర్పడినప్పుడు బ్యాంకుకు వెళ్లి కొంత సమయం తీసుకుని చెల్లించేందుకు ప్లాన్ చేసుకోండి.




బీమా పథకాలపై రుణం
వివిధ రకాల లోన్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు మీ EMIలను స్వల్ప కాలానికి కవర్ చేయగలవు. మీరు మీ హోమ్ లోన్‌తో పాటు అటువంటి ప్లాన్‌ను కొనుగోలు చేయడాన్ని పరిగణించవచ్చు. మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు ఈ బీమా ఉపయోగకరంగా ఉంటుంది. రుణ రక్షణ బీమా పథకం అనేది ఆసరాగా ఉంటుంది. మీ రుణాన్ని తిరిగి చెల్లించడానికి మీకు ఖచ్చితమైన మార్గాలు అవసరం. సకాలంలో ఎంఐఈలు చెల్లించకపోతే ఇంట్లో ఉండే బంగారంపై రుణాలు తీసుకుని పెండింగ్‌లో ఉన్న ఈఎంఐలను చెల్లిస్తే సిబిల్ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. మీకు అవసరం లేని ఎలక్ట్రానిక్స్ లేదా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) వంటి దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి ఉపసంహరించుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




