Maruti Suzuki: ఎదురుచూపులకు ఫుల్ స్టాప్.. మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఐదు డోర్ల కారు.. పూర్తి వివరాలు ఇవి..
ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడింది. ఎప్పుడొస్తుందా.. ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేసిన ఐదు డోర్ల కారు మార్కెట్ తలుపుతట్టింది. మారుతి సుజుకి జిమ్నీ కారు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఇది మారుతి సుజుకి కంపెనీ నుంచి వచ్చిన మొట్టమొదటి ఎస్ యు వి కారు.

ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడింది. ఎప్పుడొస్తుందా.. ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేసిన ఐదు డోర్ల కారు మార్కెట్ తలుపుతట్టింది. మారుతి సుజుకి జిమ్నీ కారు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఇది మారుతి సుజుకి కంపెనీ నుంచి వచ్చిన మొట్టమొదటి ఎస్ యు వి కారు. దీనికి ఇప్పటికే 30 వేలకు పైగా ప్రీ బుకింగ్స్ వచ్చాయి. ఈ జిమ్మీ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఆ కారుకు పోటీగానే..
మహీంద్రా థార్ కారుతో ఈ మారుతి సుజుకీ జిమ్నీ పోటీపడనుంది. రెండు డోర్లు కలిగిన జిమ్మీని మారుతి మన దేశంలోనే తయారు చేసి ఎంపిక చేసిన దేశాలకు ఎక్స్ పోర్టు చేస్తుంది. ఈ ఎస్ యూవీలకు ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఈ జిమ్నీ ఐదు డోర్ల ఎస్ యూవీ కార్ ను తయారు చేసి ఆవిష్కరించినట్లు మారుతి సుజుకి ప్రకటించింది.
మారుతి సుజుకీ జిమ్నీ ఇంజిన్ సామర్థ్యం..
ఈ కారులో 1.5 లీటర్ఱ కే15బీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఫోర్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక లేదా ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. దీనిలోని ఇంజిన్ 105హెచ్పీ, 134ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ సిస్టమ్ ఉంటుంది. త్రీ లింక్ రిజిడ్ యాగ్జిల్ సస్పెన్షన్ ఉంటుంది.



జిమ్నీ ఫీచర్లు ఇవి..
మారుతి సుజికి జిమ్నీ బోల్డ్ లుక్‌తో వస్తోంది. ఇందులో 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి. దీర్ఘచతురస్రాకార డ్యాష్‌బోర్డ్ గుండ్రని ఏసీ వెంట్‌లు, రేట్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి. ఇ
జిమ్నీ పరిమాణం ఇలా..
ఈ ఆఫ్ రోడ్ కారు పొడవు 3,985 మిమీ ఉండగా..ఎత్తు 1,720 మిమీ ఉండబోతోంది. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికొస్తే.. 210 మిమీతో పాటు వీల్‌బేస్ 2,590 మిమీ ఉంటుంది. దీని బట్టి చూస్తే.. వీల్‌బేస్ థార్ కంటే ఎక్కువ ఉండబోతోంది.
సెక్యూరిటీ ఫీచర్స్..
జిమ్నీ సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికొస్తే..ఈ కారు 6 ఎయిర్‌బ్యాగ్‌లు కలిగి ఉంటుంది. ఈబీడీ ఈఎస్పీ లాంటి చాలా రకాల కొత్త ఫీచర్లను కలిగి ఉంది. అంతేకాకుండా హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్, స్పీడ్ అలర్ట్, రియర్ వ్యూ కెమెరా ఇందులో ఉన్నాయి. ఆల్‌గ్రిప్ ప్రో ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది.
ధర, లభ్యత..
మారుతి సుజుకీ జిమ్నీ మొత్తం ఆరు ట్రిమ్ లలో అందుబాటులో ఉంది. ధర రూ.12.74 లక్షల నుంచి రూ.15.05లక్షలు ఎక్స్ షోరూం వరకూ ఉంటుంది. ఈ ఐదు డోర్ల మారుతి సుజుకీ జిమ్నీ కారును మనదేశంలోనే మొట్టమొదటి సారి లాంచ్ చేస్తుండటం విశేషం. ఈ కారును నెక్సా అధికారిక వెబ్ సైట్ నుంచి బుకింగ్ చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..