Travel Insurance: కేవలం 35 పైసలతో రైలు ప్రయాణానికి ఇన్సూరెన్స్.. రూ.10 లక్షల బెనిఫిట్‌

భారత రైల్వే చరిత్రలోనే పెను విషాదకర సంఘటన ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగింది. మూడు రైళ్లు ఢీకొని వందలాది మంది మరణించారు. చాలామంది గాయాల పాలయ్యారు. ఈ విషయం తెలిసిందే. మరో వైపు ప్రభుత్వం మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా..

Travel Insurance: కేవలం 35 పైసలతో రైలు ప్రయాణానికి ఇన్సూరెన్స్.. రూ.10 లక్షల బెనిఫిట్‌
Travel Insurance
Follow us
Subhash Goud

|

Updated on: Jun 07, 2023 | 5:46 PM

భారత రైల్వే చరిత్రలోనే పెను విషాదకర సంఘటన ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగింది. మూడు రైళ్లు ఢీకొని వందలాది మంది మరణించారు. చాలామంది గాయాల పాలయ్యారు. ఈ విషయం తెలిసిందే. మరో వైపు ప్రభుత్వం మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50,000 ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇటువంటి ప్రమాదం జరిగినపుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ చేసుకునే అవకాశం ఉంది.. ఈ విషయం చాలామందికి తెలీదు. మీరు చాలాసార్లు ఐఆర్‌సీటీసీలో టికెట్లను బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణ బీమా ఆప్షన్‌ కనిపిస్తుంది. సాధారణంగా దానిని అంతగా పట్టించుకొము.

అసలు రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ గురించి పూర్తిగా తెలిస్తే.. మీరు టికెట్ తీసుకునేటప్పుడు కచ్చితంగా ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. మనం ఐఆర్సీటీసీలో టికెట్ బుక్ చేసుకున్నపుడు ఇన్సూరెన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని చెక్ చేయడం ద్వారా కేవలం 35 పైసలతో 10 లక్షల రూపాయల వరకూ సొమ్ము అందుతుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్‌ చేయించుకోవడం వలన ప్రమాదాల బారిన పడితేనే ఇబ్బందులు లేకుండా పోతాయి. కేవలం ప్రమాదం జరిగినపుడే కాకుండా.. చాలా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ఇన్సూరెన్స్ కింద ప్రయాణికులు తమ రైలు ప్రయాణంలో విలువైన వస్తువులు, లగేజీని పోగొట్టుకుంటే పరిహారం లభిస్తుంది.

అలాగే ప్రమాదం జరిగినప్పుడు చికిత్సకు అయ్యే ఖర్చులు, ఒకవేళ మరణం సంభవించినప్పుడు వారి కుటుంబానికి పరిహారం అందిస్తారు. ఏదైనా రైలు ప్రమాదం జరిగినప్పుడు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ. 10 లక్షల వరకు బీమా మొత్తం చెల్లిస్తారు. పాక్షికంగా అంగవైకల్యానికి గురైతే రూ.7.5 లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ.2 లక్షలు, స్వల్ప గాయాలైతే రూ.10,000 వరకు అందజేస్తారు.

ఇవి కూడా చదవండి

మనం ఐఆర్‌సీటీసీ లేదా ఇతర అధీకృత యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌చేస్తున్నప్పుడు ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఆప్షన్ కనిపిస్తుంది. అయితే దీనిని ఎంచుకోవాలా? వద్ద అనేది మన ఇష్టం. కానీ కేవలం 35 పైసలతో మీ ప్రయాణంలో జరిగే ప్రమాదాల నుంచి మీకు 10 లక్షల రూపాయల వరకూ కవరేజ్ వస్తుంది. దీన్ని ఎంచుకున్న ప్రయాణికులు లేదా వారి కుటుంబ సభ్యులు వారు ప్రయాణించిన రైలు ప్రమాదానికి గురైన 4 నెలల్లోపు బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు. బీమా కంపెనీ కార్యాలయానికి వెళ్లి బీమా కోసం క్లెయిమ్‌ను దాఖలు చేయవచ్చు. అయితే బీమాను ఎంచుకునే సమయంలో ప్రయాణికులు తప్పనిసరిగా నామినీ పేరును నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవడంలో ఎలాంటి సమస్య ఉండదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!