Public Transport: దేశంలో అన్నీ నగరాల్లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ.. కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో అన్నీ నగరాల్లో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థను మెరుగు పరచాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మన దేశంలో చాలా నగరాల్లో ఇప్పటికీ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సరిగా అందుబాటులో లేదు. ఈ నేపధ్యంలో కేంద్రం అన్నీ నగరాల్లో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ..

దేశంలో అన్నీ నగరాల్లో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థను మెరుగు పరచాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మన దేశంలో చాలా నగరాల్లో ఇప్పటికీ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సరిగా అందుబాటులో లేదు. ఈ నేపధ్యంలో కేంద్రం అన్నీ నగరాల్లో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ అభివృద్ధి చేయడానికి ప్రణాళికా తీసుకురాబోతోంది. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ పరిశ్రమకు ఊతం ఇచ్చేదిలా ఉంటుందని ప్రధాన మంత్రి సలహాదారు తరుణ్ కపూర్ అంచనా వేస్తున్నారు.
ఎక్కడైతే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ అభివృద్ధి చెందలేదో.. అక్కడ డీజిల్ బస్సులకు బదులుగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపధ్యంలో వాహనాల ధరలతో పాటు బ్యాటరీ పరిమాణం తగ్గించడంపై ఈవీ పరిశ్రమ దృష్టి సారించాలి. స్కాండినేవియా, ఐరోపా దేశాల్లో ఈవీలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి.
మనదేశం కూడా ఈ దిశగా కొనసాగాలని కతరుణ్ కపూర్ పేర్కొన్నారు. మనదేశం తన ముడి చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి ద్వారానే పొందుతోంది. సహజ వాయువును సైతం 50 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటోంది. ప్రపంచంలోని అత్యంత కాలుష్య కారక నగరాలు మన దేశంలో ఉన్నాయి. కాలుష్య ఉద్గారాలు తగ్గించుకునేందుకు ఈవీలను అందిపుచ్చుకోవడం మినహా ఇంకో ప్రత్యామ్నాయం లేదు. విద్యుత్తు కార్లే కాకుండా.. బ్యాటరీతో నడిచే బస్సులు, ద్విచక్రవాహనాలే రోడ్లపై తిరిగేలా చూసుకోవాలి. ప్రపంచంలోనే ఈవీలకు తయారీ కేంద్రంగా మనదేశం మారాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.