Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card Balance Transfer: క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల్లో ఇబ్బందులా? ఇలా చేస్తే చాలా ఈజీ..

మీ క్రెడిట్ కార్డుపై ఉన్న అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఈ ఆప్షన్ ద్వారా వేరే కార్డుకి బదిలీ చేసేసుకోవచ్చు. అప్పుడు వడ్డీ భారం ఉండదు. సిబిల్ స్కోర్ పై కూడా ఎటువంటి ప్రభావం చూపదు.

Credit Card Balance Transfer: క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల్లో ఇబ్బందులా? ఇలా చేస్తే చాలా ఈజీ..
Credit Card
Follow us
Madhu

|

Updated on: Jun 07, 2023 | 5:00 PM

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్, పర్సనల్ లోన్ ట్రాన్స్‌ఫర్ గురించి తెలిసే ఉంటుంది. ఇంకా చెల్లించాల్సి ఉన్న హోమ్ లోన్ బ్యాలెన్స్ మొత్తాన్ని మరొక బ్యాంకుకు బదిలీ చేయడాన్ని హోమ్ లోన్ ట్రాన్స్‌ఫర్ అంటుంటాం. సరిగ్గా ఇదే విధానంలో క్రెడిట్ కార్డు లో కూడా ఓ ఆప్షన్ ఉంది. అదే క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్. మీ క్రెడిట్ కార్డుపై ఉన్న అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఈ ఆప్షన్ ద్వారా వేరే కార్డుకి బదిలీ చేసేసుకోవచ్చు. అప్పుడు వడ్డీ భారం ఉండదు. సిబిల్ స్కోర్ పై కూడా ఎటువంటి ప్రభావం చూపదు. అయితే దీనికి ప్రాసెసింగ్ ఫీజు ఉంటుందని గమినించాలి. క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ విధానం గురించి పూర్తిగా తెలుసుకుందాం రండి..

క్రెడిట్ కార్డ్ ఔట్‌స్టాండిగ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌ అంటే..

వినియోగదారులు తమ బకాయిలను ఒక కార్డు నుంచి మరొక కార్డుకు తరలించవచ్చు. సాధారణంగా, ఈ ప్రక్రియలో అధిక వడ్డీ క్రెడిట్ కార్డ్ నుంచి బకాయి ఉన్న బ్యాలెన్స్ తక్కువ వడ్డీ రేట్లు లేదా మెరుగైన రీపేమెంట్ నిబంధనలతో కొత్త క్రెడిట్ కార్డ్‌కి బదిలీ అవుతుంది. దీని వల్ల కార్డ్ హోల్డర్లు వడ్డీ చెల్లింపులపై డబ్బును ఆదా చేసుకోవచ్చు. వారి రుణ చెల్లింపు వ్యూహాలను క్రమబద్ధీకరించవచ్చు. ఇంకా వివరంగా చెప్పాలంటే.. ఉదాహరణకు మీ వద్ద రెండు బ్యాంకులకు చెందిన రెండు క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయని అనుకోండి. అందులో ఒక బ్యాంకు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపునకు చివరి తేదీ జూన్ 15 కాగా.. ఆలోగా మీరు బిల్లు చెల్లించలేనిపక్షంలో మీ వద్ద ఉన్న మరో క్రెడిట్ కార్డుపైకి మొదటి క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ఔట్‌స్టాండిగ్ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. తద్వారా మొదటిబ్యాంకుకు చెల్లించాల్సిన క్రెడిట్ కార్డు బిల్లు బారి నుంచి రిలీఫ్ పొందవచ్చు. లేదంటే ఆ క్రెడిట్ కార్డు బిల్లుని నిర్ణీత గడువులోగా చెల్లించనందుకుగాను లేట్ ఫీజు, వడ్డీలు, వగైరాలు కలుపుకొని భారీ మొత్తంలోనే చెల్లించాల్సి వస్తుంది.

చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు బ్యాలెన్స్ బదిలీ సౌకర్యాలను అందిస్తాయి. అయితే, ఈ సేవ లభ్యత, నిబంధనలు ప్రొవైడర్‌ను బట్టి మారవచ్చు. వారి నిర్దిష్ట బ్యాలెన్స్ బదిలీ విధానాలు, అనుబంధ ఛార్జీలను అర్థం చేసుకోవడానికి మీరు మీ సంబంధిత బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డ్ జారీచేసే వారితో మాట్లాడాలి.

ఇవి కూడా చదవండి

ఇది గుర్తుంచుకోవాలి..

బ్యాలెన్స్ బదిలీకి సంబంధించిన ఫీజులు, ఛార్జీలను ముందుగానే తెలుసుకోవాలి. కొంతమంది క్రెడిట్ కార్డ్ జారీచేసేవారు బ్యాలెన్స్ బదిలీ రుసుములను వసూలు చేస్తారు. సాధారణంగా బదిలీ చేస్తున్న మొత్తంలో ఒక శాతం ఫీజుగా వసూలు చేస్తారు. అందుకే ఈ మొత్తం మీకు మొదటి క్రెడిట్ కార్డుపై పడుతున్న వడ్డీ కన్నా తక్కువగా ఉందో లేదో తెలుసుకోండి. లేకుంటా బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ వల్ల నష్టపోయే ప్రమాదం కూడా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..