Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card UPI Payments: రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డు.. యూపీఐ పేమెంట్స్ కూడా చేసేయొచ్చు.. పూర్తి వివరాలు ఇవి..

కస్టమర్ల కోసం క్రెడిట్ ఆన్ యూపీఐ సేవలు తీసుకువచ్చినట్లు కీవీ యాప్ తెలిపింది. యాక్సిస్ బ్యాంకుతో కలసి ఈ కొత్త సేవలు లాంచ్ చేసినట్లు వెల్లడించింది. ఈ సర్వీసుల్లో భాగంగా కంపెనీ బ్యాంకులతో భాగస్వామ్యం ద్వారా రూపే క్రెడిట్ కార్డులను యాప్ జారీ చేయనుంది.

Credit Card UPI Payments: రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డు.. యూపీఐ పేమెంట్స్ కూడా చేసేయొచ్చు.. పూర్తి వివరాలు ఇవి..
Upi Credit Card
Follow us
Madhu

|

Updated on: Jun 07, 2023 | 6:00 PM

బ్యాంకింగ్ రంగం కొత్త రూపు సంతరించుకుంటోంది. డిజిటల్ బాటలోనే మరింత సాంకేతికతను జోడిస్తూ వినియోగదారులకు సౌకర్యవంతమైన సేవలందిస్తోంది. ఇటీవల కాలంలో యూపీఐ పేమెంట్లకు బాగా డిమాండ్ ఏర్పడిందన్న విషయం అందరికీ తెలిసిందే. వీధి చివర బడ్డీ కొట్టు నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకూ అన్నింటా యూపీఐ పేమెంట్స్ అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఇప్పటి వరకూ అవి కేవలం బ్యాంకు అకౌంట్ కు లింకైన ఫోన్ నంబర్ ద్వారానే లావాదేవీలు జరిపేవి. అయితే క్రెడిట్ కార్డు నుంచి యూపీఐ లావాదేవీలు ఇప్పటి వరకూ అందుబాటులోకి రాలేదు. అయితే ఇప్పుడు దానిని కూడా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ప్రైవేటు  బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్,  కివీ యాప్ రెండు కలిపి సేవలను అందుబాటులోకి తెచ్చాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

కివీ యాప్ క్రెడిట్ ఆన్ యూపీఐ సేవలు..

కస్టమర్ల కోసం క్రెడిట్ ఆన్ యూపీఐ సేవలు తీసుకువచ్చినట్లు కీవీ యాప్ తెలిపింది. యాక్సిస్ బ్యాంకుతో కలసి ఈ కొత్త సేవలు లాంచ్ చేసినట్లు వెల్లడించింది. ఈ సర్వీసుల్లో భాగంగా కంపెనీ బ్యాంకులతో భాగస్వామ్యం ద్వారా రూపే క్రెడిట్ కార్డులను యాప్ జారీ చేయనుంది. క్రెడిట్ మార్కెట్‌లో సమగ్రమైన డైరెక్ట్ టు కన్సూమర్ మోడల్స్ సర్వీసులు తీసుకువచ్చినట్లు కంపెనీ ప్రకటించింది.

ఎలా వాడాలంటే..

కంపెనీ మొబైల్ అప్లికేషన్ ద్వారా యూజర్లు వారి క్రెడిట్ కార్డు లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. వినియోగదారులకు డిజిటల్ రూపే క్రెడిట్ కార్డు తక్షణమే యాప్ లో లభిస్తోంది. దీన్ని యూజర్లు యూపీఐతో లింక్ చేసుకోవచ్చు. తర్వాత క్రెడిట్ ఆన్ యూపీఐ సేవలు పొందొచ్చు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. కీవీ యాప్‌లో కార్డ్ మేనేజ్‌మెంట్ ఫెసిలిటీస్ ఉంటాయి. కార్డు బ్లాక్ చేయడం, క్రెడిట్ లిమిట్ పెంపు, పేమెంట్ చేయడం వంటి సేవలు అన్నింటినీ పొందొచ్చు. అంతేకాకుండా యూజర్లు ప్రతి ట్రాన్సాక్షన్‌పై రివార్డ్ పొందొచ్చు.

ఇవి కూడా చదవండి

అంతేకాకుండా మీరు లైఫ్ టైమ్ ఫ్రీ కార్డు పొందొచ్చు. జాయినింగ్ ఫీజు, వార్షిక ఫీజు వంటివి ఉండదు. ప్రతి ట్రాన్సాక్సన్‌పై రివార్డులు లభిస్తాయి. కివి కాయిన్లు పొందొచ్చు. 4 కాయిన్లు ఒక రూపాయికి సమానం. వీటిని డబ్బులను మార్చుకొని నేరుగా బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. వచ్చే 18 నెలల కాలంలో 1 మిలియన్ యూజర్లను పొందడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు కీవీ తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వింత విమానాశ్రయం! మామిడి చెట్టు కిందే వెయిటింగ్‌
వింత విమానాశ్రయం! మామిడి చెట్టు కిందే వెయిటింగ్‌
ఆ డెలివరీ వ్యాన్‌కు దెయ్యం పట్టిందా ఏంది.. అలా పోతుంది
ఆ డెలివరీ వ్యాన్‌కు దెయ్యం పట్టిందా ఏంది.. అలా పోతుంది
ఏ దేశమేగినా.. భారతీయ మూలాలు మర్చిపోని ఉషా వాన్స్‌..
ఏ దేశమేగినా.. భారతీయ మూలాలు మర్చిపోని ఉషా వాన్స్‌..
Viral Video: నెక్ట్స్‌ జనరేషన్‌ను తయారు చేస్తున్నట్లే ఉన్నడుగా...
Viral Video: నెక్ట్స్‌ జనరేషన్‌ను తయారు చేస్తున్నట్లే ఉన్నడుగా...
హైవే హీరోస్ అంటే ఎవరు..? వారి ఆరోగ్యంపై టీవీ9 ప్రత్యేక శ్రద్ద
హైవే హీరోస్ అంటే ఎవరు..? వారి ఆరోగ్యంపై టీవీ9 ప్రత్యేక శ్రద్ద
రూ.223 కోట్ల ఆస్తులు.. రూ.48 కోట్లు విలువైన ప్రైవేట్ జెట్..
రూ.223 కోట్ల ఆస్తులు.. రూ.48 కోట్లు విలువైన ప్రైవేట్ జెట్..
ఎవరూ లేకుండానే బాలికల హాస్టల్ బాత్రూం నుంచి చప్పుళ్లు..
ఎవరూ లేకుండానే బాలికల హాస్టల్ బాత్రూం నుంచి చప్పుళ్లు..
ప్రపంచంలోనే మొట్టమొదటి తలకిందులుగా నడిచే కారు.. దీని ప్రత్యేకతలు!
ప్రపంచంలోనే మొట్టమొదటి తలకిందులుగా నడిచే కారు.. దీని ప్రత్యేకతలు!
ఆ నీలి ఆకాశమే ఈ సుకుమారి స్పర్శకై చీరగా మారింది.. గార్జియస్ రీతు.
ఆ నీలి ఆకాశమే ఈ సుకుమారి స్పర్శకై చీరగా మారింది.. గార్జియస్ రీతు.
గురువు కటాక్షం.. ఆ రాశుల వారి జీవితాల్లో శుభ కార్యాల వెల్లువ..!
గురువు కటాక్షం.. ఆ రాశుల వారి జీవితాల్లో శుభ కార్యాల వెల్లువ..!