Railway Budget 2024: బడ్జెట్‌లో రైల్వేకు అధిక కేటాయింపులు.. వందే భారత్ స్లీపర్ క్లాస్‌లపై కీలక ప్రకటన..?
బడ్జెట్ 2024 అధికారిక తేదీని ఇంకా ప్రకటించనప్పటికీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 22న లేదా జూలై 24న మధ్య కేంద్ర బడ్జెట్ 2024ని ప్రవేశపెట్టనున్నారు. ప్రయాణీకులు, సరుకు రవాణా సేవలపై దృష్టి సారించి రాబోయే బడ్జెట్‌లో భారతీయ రైల్వేలకు కేటాయింపు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రైల్వేల్లో మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి 2024-25 బడ్జెట్ కేటాయింపు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సంవత్సరం రైల్వేలకు బడ్జెట్‌కు ముందు కేటాయింపులు 30 శాతం ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం బడ్జెట్‌ను జూలైలో సమర్పించనున్నారు. బడ్జెట్ 2024 అధికారిక తేదీని ఇంకా ప్రకటించనప్పటికీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 22న లేదా జూలై 24న మధ్య కేంద్ర బడ్జెట్ 2024ని ప్రవేశపెట్టనున్నారు. ప్రయాణీకులు, సరుకు రవాణా సేవలపై దృష్టి సారించి రాబోయే బడ్జెట్‌లో భారతీయ రైల్వేలకు కేటాయింపు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రైల్వేల్లో మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి 2024-25 బడ్జెట్ కేటాయింపు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సంవత్సరం రైల్వేలకు బడ్జెట్‌కు ముందు కేటాయింపులు 30 శాతం ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కేటాయింపులు రూ. 2.95 లక్షల కోట్ల నుంచి రూ. 3 లక్షల కోట్ల మధ్య ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో 2024-25 రైల్వే బడ్జెట్ కేటాయింపుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
అమృత్ భారత్, వందే భారత్ రైళ్లు
వచ్చే 5-7 సంవత్సరాలలో 250 అమృత్ భారత్ రైళ్లు (జనసాధరన్ రైళ్లు) జనరల్, స్లీపర్ క్లాస్ కోచ్‌లతో ప్రారంభించాలని రైల్వే మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఈ ఏడాది ఇలాంటి 25 రైళ్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే వందే భారత్ రైళ్లు కొత్త స్లీపర్ వెర్షన్ ఆగస్టు 15 నాటికి ట్రయల్స్ ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ముంబై, ఢిల్లీ, చెన్నై, హౌరా వంటి సుదూర మార్గాల్లో రైల్వే 6 వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టనుంది. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వంటి 150 కి.మీ మార్గాలకు ఇంటర్‌సిటీ కనెక్టివిటీని మెరుగుపరచడానికి 8-10 వందే మెట్రో రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే యోచిస్తోంది.
సూపర్ యాప్, సరుకు రవాణా
డిజిటల్ విషయంలో, రైల్వేలు కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి ఐఆర్‌సీటీసీ సూపర్ యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. ముఖ్యంగా సరుకు రవాణా, పార్శిల్ విభాగాల్లో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా రైల్వే కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్)లో పెట్టుబడులను పెంచడానికి కూడా యోచిస్తోంది.
కవచ్
కవచ్ సేఫ్టీ మెకానిజం కోసం ఎక్కువ బడ్జెట్ కేటాయింపులతో భద్రతకు ప్రాధాన్యత ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కవచ్ సిస్టమ్‌తో 4,500 కిలోమీటర్ల రైలు నెట్‌వర్క్‌ను కవర్ చేయాలని రైల్వే యోచిస్తోంది. మూడు భారతీయ కంపెనీల సహకారంతో రీసెర్చ్ డిజైన్, స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన కవచ్ ఆటోమేటిక్ రైలు రక్షణ (ఏటీపీ) వ్యవస్థ, భారతీయ రైల్వేలకు జాతీయ ఏటీపీ వ్యవస్థగా స్వీకరించారు. కవచ్ సిస్టమ్‌లోని యాంటీ కొలిజన్ టెక్నాలజీ లోకోమోటివ్ డ్రైవర్‌లు వేగాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..