Hero Splendor : సూపర్ స్పోర్టీ లుక్‌తో హీరో స్ప్లెండర్… 125 సీసీలో అదిరిపోయే ఫీచర్లు ఇవే..

మార్కెట్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోడానికి హీరో మోటోకార్ప్ కొత్త మోడల్స్‌ను రిలీజ్ చేయడంతో పాటు ఉన్న మోడల్స్‌ను అప్ గ్రేడ్ చేయడానికి దృష్టి పెట్టింది. హీరో తన ఎక్స్‌టీఈసీ సూట్ ఫీచర్లను మరిన్ని వాహనాలకు అందించడం ద్వారా సమగ్ర విధానాన్ని తీసుకుంటోంది. ఈ ఫీచర్లను ప్రస్తుతం స్ప్లెండర్ ప్లస్‌ 100 సీసీకు ఇచ్చిన కంపెనీ తాజాగా 125 సీసీ సూపర్ స్ప్లెండర్‌కు ఇవ్వనుంది.

Hero Splendor : సూపర్ స్పోర్టీ లుక్‌తో హీరో స్ప్లెండర్… 125 సీసీలో అదిరిపోయే ఫీచర్లు ఇవే..
Splendor
Follow us
Srinu

|

Updated on: Mar 08, 2023 | 2:45 PM

భారత టూవీలర్ మార్కెట్‌లో హీరో స్ప్లెండర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. గతంలో హీరోహోండా భాగస్వామ్యంతో వచ్చిన ఈ బైక్‌ను ప్రస్తుతం హీరో కంపెనీ వినియోగదారులకు అందిస్తుంది. మార్కెట్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోడానికి హీరో మోటోకార్ప్ కొత్త మోడల్స్‌ను రిలీజ్ చేయడంతో పాటు ఉన్న మోడల్స్‌ను అప్ గ్రేడ్ చేయడానికి దృష్టి పెట్టింది. హీరో తన ఎక్స్‌టీఈసీ సూట్ ఫీచర్లను మరిన్ని వాహనాలకు అందించడం ద్వారా సమగ్ర విధానాన్ని తీసుకుంటోంది. ఈ ఫీచర్లను ప్రస్తుతం స్ప్లెండర్ ప్లస్‌ 100 సీసీకు ఇచ్చిన కంపెనీ తాజాగా 125 సీసీ సూపర్ స్ప్లెండర్‌కు ఇవ్వనుంది. ఇప్పటికే సూపర్ స్ప్లెండర్ 110 సీసీలో  ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. హీరో లైనప్‌లోని గొప్ప స్కీమ్‌లో, సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టీఈసీ 124.7 సీసీ ఇంజిన్‌తో గ్లామర్ ఎక్స్‌టీఈసీకు పోటీగా ఉండనుంది. ఈ ఇంజిన్ 7500 ఆర్‌పీఎం వద్ద 10.7 బీహెచ్‌పీ శక్తిని, 6000 ఆర్పీఎం వద్ద 10.6 ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ సూపర్ స్ప్లెండర్ లీటర్‌కు 68 కిలో మీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూ టూత్, కాల్ అలర్ట్, ఎస్ఎంఎస్ అలర్ట్ వంటి అధునాతన ఫీచర్లతో వచ్చే ఈ బైక్ కచ్చితంగా యువత మనస్సును గెలుచుకుంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

ఆ రెండు బైక్స్‌కు పోటీనిచ్చేలా..

హీరో స్ప్లెండర్ 125సీసీ ఎక్స్‌టీఈసీ కొత్త కనెక్టివిటీ ఫీచర్లతో వస్తుంది. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ పొజిషన్ ల్యాంప్, ఆకర్షణీయమైన గ్రాఫిక్‌లతో వినియోగదారులను ఆకట్టుకునే అవకాశం ఉంది. ముందువైపు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు, నలుపు రంగులో ఉండే అల్లాయ్ వీల్స్, సౌకర్యవంతమైన రైడర్ ట్రయాంగిల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ ప్రధానంగా హోండా సీబీ షైన్ 125సీసీ, టీవీఎస్ రైడర్‌ బైక్‌లకు ప్రధాన పోటీగా ఉంటుంది. హీరో ఎక్స్‌టీఈసీ ఉత్పత్తులు కేవలం యువతను ఆకట్టుకునే విధంగా రూపొందిచినట్లు హీరో మోటోకార్ప్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రంజీవ్‌జిత్ సింగ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ ఐకానిక్ సూపర్ స్ప్లెండర్ కొత్త వెర్షన్‌లో మా ఎక్స్‌టీఈసీ శ్రేణి ద్విచక్ర వాహనాలకు పెరుగుతున్న అప్పీల్‌ను జోడిస్తుందని విశ్వసిస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా ఈ బైక్‌లో స్మార్ట్ కనెక్టవిటీ ఫీచర్లు కచ్చితంగా ఆకట్టుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి